How Much Sleep Do We Need

మనిషికి ఎంత నిద్ర అవసరం?

ఆరోగ్యకరమైన జీవన విధానానికి మంచి నిద్ర చాలా అవసరం. ప్రతి ఒక్కరూ రోజుకి కనీసం 8 గంటలు నిద్రపోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. కానీ, ఈ ఉరుకులు, పరుగుల జీవితంలో నిద్ర వేళల్లో మార్పులు …

Read more

5 Fashion Tips To Look Stylish

స్టైలిష్‌ లుక్ తో కనిపించాలంటే ఇలా చేయండి!

ఈ కాలంలో ఎవరికైనా డ్రెస్ సెన్స్ అనేది చాలా ముఖ్యం. మీ డ్రెస్సింగ్ స్టైల్‌ ని బట్టే మీ క్యారెక్టర్ ని అంచనా వేయటం ప్రారంభిస్తారు. అందుకే నేటి యువత ఫ్యాషన్ డిజైన్ పై …

Read more

Eye Care Diet

కంటి చూపును మెరుగు పరిచే అద్భుతమైన ఆహారాలు

ఈ కంప్యూటర్ యుగంలో ప్రతీదీ డిజిటలైజ్ అయిపొయింది. దీంతో ప్రతి పనికీ మొబైల్, లేదా ల్యాప్‌టాప్‌ మీద ఆధారపడాల్సి వస్తుంది. గాడ్జెట్ల వినియోగం ఎక్కువయ్యే కొద్దీ అవి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా వాటి స్క్రీన్ లైట్ మన కళ్ళకి చాలా హాని కల్గిస్తున్నాయి. ఈ కారణంగా కళ్ళు మంట, దురద వంటి సమస్యలు మొదలై… చివరికి కంటిచూపు కూడా మందగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కంటి ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ ఆహారాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఉసిరి:

ఉసిరి కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం చేత కంటిచూపు పెరుగుతుంది. ఉసిరిని డైరెక్ట్ గా అయినా తీసుకోవచ్చు, లేదంటే… ఉసిరి పొడి, ఊరగాయ, జామ్, ఇలా ఏదో ఒక రూపంలో దీనిని తీసుకోవచ్చు. ఉసిరికాయను రోజూ తీసుకోవడం వల్ల ఒక్క కంటికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

ఆకు కూరగాయలు:

కంటి చూపు మెరుగుపడటంలో ఆకుకూరలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆకు కూరలు, పచ్చి కూరగాయలు కంటికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిన్-సి లతో పాటు, ఐరన్, లుటిన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి ఉన్నాయి. ఇవి కంటి చూపును మరింత పెంచుతాయి.

ఆవకాడో:

అవకాడోలో విటమిన్-ఇ పుష్కలంగా ఉండటం చేత ఇది కంటి రెటీనాని మరింత బలపరుస్తుంది. అవకాడో ఎక్కువగా తింటే… వృద్ధాప్యం వచ్చినా మీ కళ్ళు ఆరోగ్యంగానే ఉంటాయి.

క్యారెట్:

క్యారెట్‌లో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపును మరింత పెంచుతుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్-ఎ కళ్లకు ఎంతో మేలు చేస్తుంది.

సీఫుడ్:

సీఫుడ్ తీసుకోవటం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా ట్యూనా ఫిష్, సాల్మన్ ఫిష్, ట్రౌట్ ఫిష్ వంటి సముద్ర చేపలు కంటి రెటీనాను బలోపేతం చేస్తాయి. ఈ చేపలలో DHA అనే ​​కొవ్వు ఆమ్లం ఉంటుంది. ఇది రెటీనా బలాన్ని పెంచుతుంది. తద్వారా కంటి చూపుమెరుగుపరుస్తుంది.

సిట్రస్ ఫ్రూట్స్:

సిట్రస్ ఫ్రూట్స్ అయిన నిమ్మ, నారింజ, ద్రాక్షపండు, జామపండులో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ సి కళ్లకు మేలు చేస్తుంది.

డ్రైఫ్రూట్స్:

బాదం, వాల్ నట్స్ వంటి డ్రైఫ్రూట్స్ కంటి చూపును ఎంతో మెరుగుపరుస్తాయి. ఈ డ్రైఫ్రూట్స్ రోజూ తింటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

ఇవి మాత్రమే కాదు, స్క్రీన్‌పై కంటిన్యూగా పని చేయకుండా మధ్య మద్యలో కాస్త విశ్రాంతి తీసుకోవాలి. అలాగే, అప్పుడప్పుడూ కళ్ళను చల్లటి నీటితో కడగడం వల్ల కూడా కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.

Read more

5 Most Common Eating Mistakes

అన్నం తినేటప్పుడు ఈ ఐదు పొరపాట్లు అస్సలు చేయకండి!

చాలామంది ఆహారం తినేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మీరు చేసే ఈ పొరపాట్లే… మీ జీవనశైలిని దెబ్బతీస్తాయి. సాధారణంగా ఎవరైనా రోజుకు రెండు, లేదా మూడు సార్లు భోజనం చేస్తారు. అయితే, ఆ …

Read more

Signs And Symptoms Of Chest Infection

ఈ సంకేతాలు కనిపిస్తే మీకు ఛాతీ ఇన్ఫెక్షన్ ఉన్నట్లే!

కరోనా మహమ్మారి పుణ్యామా అని ఇటీవలికాలంలో ఏమాత్రం ఛాతీలో నొప్పి వచ్చినా భయపడాల్సి వస్తుంది. నిజానికి అన్ని రకాల చెస్ట్ పెయిన్స్… చెస్ట్ ఇన్ఫెక్షన్ కి దారి తీయవు. అలాగని చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు …

Read more

What Happens If You Eat Raw Garlic On Empty Stomach

ఉదయాన్నే పరిగడుపున వెల్లుల్లి తింటే ఏం జరుగుతుందో తెలుసా!

ఔషధాల గని వెల్లుల్లి. ఇందులో అనేక మెడిసినల్ ప్రాపర్టీస్ తో పాటు, న్యూట్రిషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో విటమిన్ B1, B6, C తో పాటు… కాల్షియం, కాపర్, మాంగనీస్,సెలీనియం వంటి పోషకాలు …

Read more

How To Lose Weight Fast In 4 Simple Steps

మీరు ఫాస్ట్ గా బరువు తగ్గాలనుకుంటే… ఈ 5 సింపుల్ టిప్స్ పాటించండి!

బరువు పెరగటం అనేది చాలా స్పీడ్ గా జరిగే ప్రాసెస్; కానీ తగ్గటం మాత్రం చాలా స్లోగా జరిగే ప్రాసెస్. ఒబేసిటీని కంట్రోల్ చేయటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డైట్ కంట్రోల్ చేస్తుంటారు. …

Read more

Is Sleeping On Your Stomach Bad For You

రోజూ మీకు బోర్లా పడుకునే అలవాటు ఉందా..! అయితే మీకీ సమస్యలు తప్పవు!

ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారంతోపాటు సరైన నిద్ర కూడా అవసరం. అయితే, ఆ నిద్రపోయే సమయంలో సరైన పొజిషన్‌ కూడా అవసరం. సరైన పొజిషన్ లో నిద్రించకపోతే… పలు ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నవాళ్ళం …

Read more