మీలో ఈ సంకేతాలు కనిపిస్తుంటే…శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గినట్లే!

డయాబెటిస్ తో బాధపడుతున్నవారు అనుక్షణం జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వారి షుగర్ లెవెల్స్ పెరిగినా ప్రమాదమే! తగ్గినా ప్రమాదమే! చాలా సందర్భాల్లో వీరి శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోతూ ఉంటాయి. దీనినే మెడికల్ టెర్మినాలాజీలో “హైపోగ్లైసీమియా” అంటారు. వెంటనే ఎలర్ట్ అవ్వకపోతే ప్రాణానికే ప్రమాదం.

నిజానికి డయాబెటిక్ పేషెంట్ బ్లడ్ లో షుగర్ లెవెల్ 70 mg/dl కంటే తక్కువగా ఉంటే… తక్షణమే లెవల్స్ పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. మరి ఈ షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయని మనకి ఎలా తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చు. మన శరీరంలో ఆకస్మికంగా ఏర్పడే కొన్ని మార్పులే దీనికి సంకేతంగా మనం పరిగణించాలి అవేంటంటే…

విపరీతమైన ఆకలి: 

రోజూ వలే కాకుండా అకస్మాత్తుగా విపరీతమైన ఆకలి వేయడం రక్తంలో చక్కెర తగ్గిందని సూచించే సంకేతంగా చెప్పుకోవచ్చు. అటువంటప్పుడు బ్రేక్ ఫాస్ట్ తో 15-20 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. భోజనంలో 40-65 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం తీసుకోవాలి.

చికాగుగా ఉండటం: 

బాడీలోని బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయినప్పుడు శరీరం ఎపినెఫ్రిన్, కార్టిసాల్ అనే హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. ఇదే సమయంలో ఎక్కువుగా టెన్షన్ పడుతూ ఉంటే ఇది షుగర్ లెవెల్స్ తగ్గుదలకు సంకేతంగా భావించాలి.

భావోద్వేగానికి గురి అవడం: 

షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు ఒక్కసారిగా ప్రవర్తలో మార్పులు కనిపిస్తాయి. ఆకస్మికంగా భావోద్వేగానికి గురువటం, మొండితనం, చిరాకు, నిరాశ వంటి భావాలు కనిపిస్తే రక్తంలో చక్కెర స్థాయి తగ్గినట్లుగా గుర్తు.

ఏకాగ్రత లోపించడం:

మెదడు శక్తి కోసం రక్తంలో ఉండే చక్కెరపై ఆధారపడుతుంది, కాబట్టి బ్లడ్ లో గ్లూకోజ్‌ తగ్గితే… మెదడు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఈ కారణంగా ఏకాగ్రత లోపిస్తుంది. ఏ పనిపై దృష్టిపెట్టలేకపోవచ్చు. 

ముగింపు:

పై లక్షణాలు శరీరంలో కనిపిస్తే… తక్షణమే స్పందించి… వైద్యులను సంప్రదించి…. రక్తంలో షుగర్ లెవల్స్ ఎలా ఉన్నాయో పరీక్షించుకోవాలి. అలానే, శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు గ్లూకోజ్ మాత్రలు, స్వీట్లు, పండ్ల రసం వంటి సాధారణ షుగర్ కంటెంట్ కలిగిన ఆహారం తీసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay in Touch

To follow the best weight loss journeys, success stories and inspirational interviews with the industry's top coaches and specialists. Start changing your life today!

spot_img

Related Articles