మోకాళ్ల నొప్పులకు సింపుల్ హోం రెమెడీస్

ఇటీవలి కాలంలో మోకాళ్ల నొప్పులు అనేవి చాలా మందికి జీవితంలో ఒక భాగమయ్యాయి. ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే క‌నిపించే ఈ కీళ్ల నొప్పలు… ఇప్పుడు అంద‌రిలోనూ క‌నిపిస్తున్నాయి. ఈ నొప్పులు రావ‌డానికి మేజర్ రీజన్ శ‌రీరంలో కాల్షియం త‌క్కువ‌వటమే!

ఎప్పుడైతే మనం రుచికరమైన ఆహారాన్ని తీసుకోవటానికి అలవాటు పడతామో… అప్పుడు పోష‌కాహారాన్ని పక్కన పెట్టేస్తున్నాం. పోష‌కాహార లోపం వల్ల శరీరంలో విటమిన్స్, మినరల్స్, ఐరన్, కాల్షియం వంటివి లోపిస్తున్నాయి.

సాదారణంగా మోకాళ్ళకు ఏదైనా గాయం తగిలినప్పుడు, మోకాళ్లపై ఎక్కువ ఒత్తిడి కలిగినప్పుడు, శరీరం బరువు పెరిగినప్పుడు, మజిల్స్ మధ్య ఆయిల్ తగ్గినప్పుడు, పోషకాలు తగ్గినప్పుడు, కీళ్లనొప్పులు లేదా గౌట్ కారణంగా ఈ మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి.

మోకాళ్ల నొప్పులు వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు మోకాళ్ల నుంచి ఒక రకమైన శబ్దం, బలమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి కొన్ని గంటలు, లేదా కొన్ని సార్లు రోజు మొత్తం, లేదా కొన్ని రోజుల పాటు కూడా ఉండవచ్చు. ఏదేమైనా ఇది రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుంటుంది. అలాంటి మోకాళ్ల నొప్పులకు కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

పసుపు పాలు:

ఎంతోకాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లయితే… పసుపు పాలు దానికి దివ్యౌషదంగా పనిచేస్తుంది. పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి ఔషధ గుణాలెన్నో పుష్కలంగా ఉన్నాయి. ఇవి వాపు, నొప్పి వంటి వాటినుంచి ఉపశమనం కలిగిస్తాయి. గాయాలను నయం చేయడంలో పసుపు ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందుకే పసుపును పాలతో కలిపి ఉపయోగించడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

తులసి కషాయం:

తులసి ఎన్నో ఔషధ గుణాలని కలిగి ఉంటుంది. అలాంటి తులసిని నీళ్ళల్లో మరగబెట్టి కషాయంలా చేసి తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే, తులసి రసం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తులసి రసాన్ని కలుపుకుని తాగితే మోకాళ్ల నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

అల్లం టీ:

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి వాపులను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. ఈ హెర్బ్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అయిన ‘జింజెరాల్’ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. అల్లాన్ని నీటిలో వేసి బాగా మరిగించి, చల్లారిన తర్వాత దానిని వడగట్టి… అందులో తేనె, మరియు నిమ్మకాయ కలిపి ఆ టీని రోజుకు 2-3 కప్పులు చొప్పున నొప్పి తగ్గే వరకు త్రాగాలి. అలాగే, మోకాళ్లపై అల్లం నూనెను కూడా అప్లై చేయవచ్చు.

ఎసెన్షియల్ ఆయిల్స్:

ఎసెన్షియల్ ఆయిల్స్ తో మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం, అల్లం మరియు నారింజ తో తయారైన నూనెలు మోకాళ్ల నొప్పులను వదిలించుకోవడంలో బాగా పనిచేస్తాయి. ఇవి ప్రభావిత ప్రాంతంలో నొప్పిని తగ్గిస్తాయి.

ఎప్సమ్ సాల్ట్:

కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గించడానికి ఎప్సమ్ సాల్ట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఇందులో మెగ్నీషియం మరియు సల్ఫేట్ కంటెంట్స్ ఉన్నాయి. అందుకే ఇవి రెండూ శక్తివంతమైన నొప్పిని తగ్గించే ఏజెంట్లు. స్నానం చేసే నీటిలో ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ వేసి 30 నిమిషాలు ఆగి… ఆ తర్వాత స్నానం చేస్తే… మోకాళ్ల నొప్పుల నుండీ ఉపశమనం పొందవచ్చు.

మిరియాల పేస్ట్:

మిరియాలు మసాలా దినుసులో ఒకటి. ఇందులో ‘క్యాప్సైసిన్’ అనే స్పెసిఫిక్ కాంపౌండ్ ఉంటుంది. ఇది సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. అలాగే నొప్పి గ్రాహకాలను ప్రేరేపిస్తుంది. నరాలను దారి మళ్లిస్తుంది, కాబట్టి ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసినట్లైతే… కీళ్లలో నొప్పి ఉన్నట్లే తెలియదు. తక్షణ ఉపశమనం కోసం మీరు ఈ పేస్ట్‌ను ఉపయోగించవచ్చు.

డిస్క్లైమర్:

ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమేనని గుర్తించండి. సమస్య వచ్చినప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Leave a Comment