నూటికి తొంబై ఐదు శాతం మంది నోటి దుర్వాసనతో బాధపడుతున్నారు. దీనివల్ల నలుగురిలో ఆత్మ విశ్వాసంతో తలెత్తుకు మాట్లాడలేక పోతున్నారు. ఈ సమస్య కేవలం మనకి మాత్రమే కాదు, మనతో పాటు ఎదుటివారికి కూడా ఇబ్బందికరంగా మారుతుంది. తిన్న ఆహారం దంతాలు, లేదా చిగుళ్ల మధ్య ఇరుక్కుపోయి… కుళ్ళిపోతుంది. దీనివల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది.
ఉల్లి, వెల్లుల్లి వంటివి తిన్నా… కాఫీ, టీ, సోడా వంటివి తాగినా… మద్య పానం, ధూమపానం వంటివి సేవించినా… నోటి దుర్వాసన కలుగుతుంది. నోటి అపరిశుభ్రత, అజీర్తి, జలుబు, దంతక్షయం, పిత్త దోషం వంటివి ఉన్నా నోటి దుర్వాసన సమస్యలు వస్తాయి. అయితే, ఈ సమస్యకి చెక్ పెట్టాలంటే, కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మనం తినే ఆహార పదార్ధాలు అనేక రకాల బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తాయి. అలాంటప్పుడు మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉంది. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు వంటి ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల ఈ సమస్య నుంచీ బయట పడొచ్చు.
అలాగే, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా అవసరం కాబట్టి ఫ్రైడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, రెడ్ మీట్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
శరీరం ఎప్పుడూ హైడ్రేట్ గా ఉండటం కోసం… మజ్జిగ, అల్లం, పసుపు వంటివి తీసుకోవాలి. వేడి వాతావరణం ఉన్నప్పుడు శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. నోటి దుర్వాసనని పోగొట్టే ఎనర్జీ డ్రింక్స్ తాగుతుండాలి. ఇందుకోసం క్యారెట్, బీట్‌రూట్, దానిమ్మ, బాదం పప్పులు, వాల్‌నట్స్, ఏలకులు, లవంగం, పసుపు వీటన్నింటినీ కలిపి డ్రింక్‌గా తయారుచేసుకుని తాగినట్లయితే, నోటి దుర్వాసన దూరమవుతుంది.
అలాగే, పుదీనా, లేదా తులసి ఆకులను నమలటం; భోజనం చేసిన తర్వాత సోంపు గింజలను నమలటం వంటివి చేసినా కూడా బ్యాడ్ బ్రీత్ ని అరికట్టవచ్చు.
మరో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, మన టూత్ బ్రష్ ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. అందుచేత నెలకొకసారి టూత్ బ్రష్ మారుస్తుండాలి. ప్రతి నెలా కుదరకపోతే, కనీసం రెండు నెలలకు ఒకసారైనా టూత్ బ్రష్‌ని మార్చాలి.
ముగింపు:
పైన చెప్పిన విషయాలన్నీ కేవలం మీకు అవేర్నెస్ కలిగించటం కోసమే! ఇవన్నీ మనం పాటించాల్సిన సింపుల్ టిప్స్. కానీ, సమస్య ఎక్కువైతే, డాక్టర్ని సంప్రదించటం మంచిది.