జీడిపప్పును రోజూ తింటే ఏమవుతుంది?

జీడిపప్పు అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. అటు స్వీట్స్ లోనూ, ఇటు హాట్స్ లోనూ, పచ్చిగానూ, వేయుంచుకొని ఇలా అనేక రకాలుగా దీనిని వాడ‌తారు. ఎంతో రుచిగా ఉండే జీడిప‌ప్పును ఎలా తిన్నా… దాని రుచే వేరు. కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాలని అందించటంలోనూ దీనికిదే సాటి. అలాంటి జీడిప‌ప్పులు రోజూ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • జీడిపప్పును రోజూ తినటం వల్ల మెటబాలిజం పెరుగుతుంది.
  • ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు కారణంగా శరీరంలో పేరుకుపోయి ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ కరిగిపోతుంది. తద్వారా బరువు తగ్గుతారు.
  • క్రమం తప్పకుండా జీడిపప్పు తీసుకొన్నట్లైతే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇందులో ఉండే రాగి, యాంటీ ఆక్సిడెంట్లు కారణంగా చర్మానికి ఆ విధమైన మెరుపునిస్తుంది.
  • జీడిపప్పులో నుండి వచ్చే నూనె చర్మానికి మేలు చేస్తుంది. ఆ నూనెలో సెలీనియం, జింక్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉన్నాయి,
  • జీడిపప్పులో ఉండే లుటిన్, మరియు ఇతర ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్ల కారణంగా మన కళ్లను దెబ్బతినకుండా కాపాడుతుంది. దీంతో మెరుగైన కంటిచూపుని పొందవచ్చు. అంతేకాకుండా, జీడిపప్పులోని జియాక్సంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్… కళ్లలో ఉండే మాక్యులా దెబ్బతినకుండా కాపాడుతుంది. ఈ యాంటీఆక్సిడెంట్ UV ఫిల్టర్‌గా పని చేయడం కారణంగా సూర్య కిరణాల నుండి కూడా కళ్ళను రక్షిస్తుంది.
  • ముఖ్యంగా జీడిపప్పు మైగ్రేన్ సమస్యను తగ్గిస్తుంది.
  • జీడిపప్పును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మెగ్నీషియం లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. తద్వారా గుండెకు తగినంత రక్తం సరఫరా అవుతుంది. దీంతో గుండె జబ్బులు తగ్గుతాయి.
  • జీడిపప్పులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా రక్తంలో ఉండే గ్లూకోజ్ పై ప్రభావం పరిమితం అవుతుంది. దీంతో టైప్ 2 మధుమేహం ఉన్నవారికి, అలాగే పరిస్థితిని నివారించడానికి చూస్తున్న వారికి ఇది గొప్ప ఎంపిక.
  • జీడిపప్పు విటమిన్ లకి మూలం.
  • ఇది నరాల కణాల సున్నితత్వాన్ని తగ్గిస్తుంది.
  • జీడిపప్పు క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఇందులో ఉండే ప్రోయాంతోసైనిడిన్స్ కారణంగా శరీరంలో క్యాన్సర్ కణాలు పునరావృతం కాకుండా నిరోధిస్తుంది.

ముగింపు:

జీడిపప్పు మోనో అన్‌శాచురేటెడ్, మరియు పాలీ అన్‌శాచురేటెడ్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వుల యొక్క అద్భుతమైన మూలం. ఇంకా ఈ గింజల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మితిమీరి వీటిని తీసుకోకూడదు. జీడిపప్పుని ప్రతిరోజూ తినటం తప్పుకాదు కానీ రోజుకి 5 పప్పులకి మించి తినకూడదు. టూమచ్ గా వీటిని తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చిపెట్టుకున్నట్లే!

Leave a Comment