విపరీతమైన బాడీ పెయిన్స్ వస్తుంటే… దానికి కారణాలు ఇవే!

ఇటీవలికాలంలో చాలామంది విపరీతమైన బాడీ పెయిన్స్ తో బాధపడుతున్నారు. కొంతమంది మాత్రం కాళ్లు, చేతులు, మెడ, భుజాలు, నడుము నొప్పులతో సతమతమవుతూ ఉంటే… మరికొంతమంది మాత్రం అక్కడా…ఇక్కడా… అని కాకుండా శరీరం మొత్తం నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు.

కొన్నిసార్లు అవి సాదారణ నొప్పులే అయినా… ఇంకొన్ని సార్లు మాత్రం తీవ్ర పరిణామాలకి తావిస్తున్నాయి. అలాంటి సందర్భంలో వైద్యుడ్ని సంప్రదించక తప్పదు. అయితే అసలు ఈ బాడి పెయిన్స్ రావటానికి కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్ట్రెస్:

విపరీతమైన స్ట్రెస్ కి గురయినప్పుడు శరీరం అలసటకి లోనవుతుంది. దీనివల్ల బాడీలో ఉండే ఇమ్మ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. దీంతో మజిల్స్ టైట్ అవుతాయి. అందువల్ల బాడీ ఏక్స్ పెరుగుతాయి. అలాకాక, లాంగ్ టైమ్ స్ట్రెస్ ఉన్నట్లయితే, మజిల్స్ లో బాడీ పెయిన్స్ కూడా లాంగ్ టైమ్ కంటిన్యూ అవుతాయి.

డీహైడ్రెషన్:

బాడీ డీహైడ్రేట్ అయితే చాలా సమస్యలు తలెత్తుతాయి. ఎప్పుడైతే బాడీలో వాటర్ పెర్సంటేజ్ తగ్గుతుందో… అప్పుడు బాడీ పెయిన్స్ పెరుగుతాయి. ఒక వ్యక్తి శరీరం యాక్టివ్ గా పనిచేయాలంటే… హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. డీహైడ్రేట్ అయినప్పుడు ఆ వ్యక్తి అలసటకి గురయినట్లు అనిపిస్తుంది. ఈ కారణంగా శరీరమంతా నొప్పులు ఏర్పడతాయి.

ఇన్ సోమ్నియా:

ఆరోగ్యకరమైన జీవనానికి తగినంత నిద్ర అవసరం. సరిగా నిద్రపోని వారు తరచుగా నొప్పిని అనుభవిస్తారు. నిద్ర లేమి వల్ల శరీరమంతా అలసటగా అనిపిస్తుంది. ఇంకా బద్ధకం, శరీరం బరువుగా కూడా అనిపించవచ్చు.

ఆర్థరైటిస్:

ఆర్థరైటిస్‌ వల్ల శరీరం అంతటా తీవ్రమైన నొప్పులు కలుగుతాయి. కీళ్ళ నొప్పులతో పాటు, కండరాల్లో మంటగా ఉంటే.. దానివల్ల ఆర్థరైటిస్ వస్తుంది.

జలుబు మరియు ఫ్లూ:

జలుబు, మరియు ఫ్లూ రెండూ వాపుకు కారణమయ్యే వైరల్ ఇన్ఫెక్షన్లు. ఈ అంటువ్యాధులు ఒక్కసారిగా శరీరంపై దాడి చేస్తాయి. దీంతో రోగనిరోధక వ్యవస్థ వాటితో పోరాడటానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో ముఖ్యంగా గొంతు, ఛాతీ మరియు ఊపిరితిత్తులలో వాపు, బాధాకరంగా ఉంటుంది. శరీరం ఇన్‌ఫెక్షన్‌తో పోరాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నందున శరీరంలోని మిగిలిన భాగం కూడా నొప్పులు రావచ్చు.

అనీమియా:

శరీరంలో తగినంత ఎర్ర రక్త కణాలు లేనప్పుడు రక్తహీనత (అనీమియా) సంభవిస్తుంది. అటువంటి సమయంలో శరీర కణజాలాలు తగినంత ఆక్సిజన్‌ను పొందలేవు. అందువల్ల అవి అలసిపోయినట్లు అనిపించవచ్చు. ఈ కారణంగా నొప్పులు సహజం.

విటమిన్ డి లోపం:

కిడ్నీస్, మరియు మజిల్స్ వంటి బాడీలోని మేజర్ ఆర్గాన్స్ సరిగ్గా పనిచేయాలంటే కాల్షియం అవసరం. ముఖ్యంగా ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి కూడా కాల్షియం అవసరం. కాల్షియంను గ్రహించడంలో తగినంత విటమిన్ డి లేకపోతే, ఈ అవయవాలలో, మరియు ఎముకలలో నొప్పిని అనుభవించవచ్చు.

న్యుమోనియా:

న్యుమోనియా వ్యాధి మొత్తం శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది బ్రీతింగ్, స్వెటింగ్, మరియు ఇతర ముఖ్యమైన విధులకు బాధ్యత వహిస్తుంది. ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోతే, శరీరం తగినంత ఆక్సిజన్‌ను పొందదు. అందువల్ల శరీరం అంతటా నొప్పులు వస్తాయి.

ఫైబ్రోమైయాల్జియా:

ఫైబ్రోమైయాల్జియా అనేది కండరాలు, మరియు ఎముకలతో సహా మొత్తం శరీరమంతా అలసిపోయినట్లు, నొప్పిగా మరియు సున్నితంగా అనిపించే పరిస్థితి. ఇంజ్యూరీస్, సర్జరీస్, ఇన్ఫెక్షన్స్ వంటి ఒత్తిడితో కూడిన సంఘటనలు దీనిని ప్రేరేపించవచ్చు.

లూపస్:

రోగనిరోధక వ్యవస్థ కణజాలాలపై దాడి చేసినప్పుడు లూపస్ సంభవిస్తుంది. ఈ డ్యామేజ్ వల్ల కలిగే నష్టం మరియు వాపు కారణంగా, శరీరంలో నొప్పులు సాధారణమవుతాయి.

ముగింపు:

ఒకటి కాదు, రెండు కాదు అనేక కారణాల వల్ల బాడీ పెయిన్స్ సంభవించవచ్చు. అయితే ఆ నొప్పులు కొద్ది రోజులు మాత్రమే ఉండి పోతే లైట్ తీసుకోండి. అలాకాక, రెండు వారాల కంటే ఎక్కువగా ఉంటే, మీ వైద్యుడిని సంప్రదించండి.

Leave a Comment