పని ఒత్తిడిలో పడి చాలా మంది వేళకి తినరు. కనీసం ఈటింగ్ టైమింగ్స్ కూడా పాటించరు. లంచ్ చేయాల్సిన టైంలో బ్రేక్ ఫాస్ట్ చేస్తారు; స్నాక్స్ తినే టైంలో లంచ్ చేస్తారు; డిన్నర్ చేయాల్సిన టైంలో స్నాక్స్ తింటారు; అర్దరాత్రి దాటాక డిన్నర్ చేస్తారు. ఇదంతా అన్-హెల్దీ లైఫ్ స్టైల్. ఇలా చేయటం వల్ల లైఫ్-సర్కిల్ దెబ్బతింటుంది.
దీనివల్ల మెటబాలిజం దెబ్బతిని… అల్సర్, గ్యాస్, కాన్స్టిపేషన్, ఒబేసిటీ వంటి అనేక అనారోగ్య సమస్యలు పలకరిస్తాయి. ఇక టైం సెన్స్ లేకుండా తినే తిండి వల్ల అధిక బరువు, ఊబకాయంతో నానా ఇబ్బందులున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారనియమాలు పాటించాలి. మరి బరువు తగ్గాలంటే ఏ టైంకి తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇవి కూడా చదవండి: రాత్రి వేళ ఆలస్యంగా భోజనం చేస్తున్నారా..? అయితే, మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే!
- రోజంతా ఆకలిని నియంత్రించడానికి ఏదో ఓ అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి. అయితే అలా తినే బ్రేక్ ఫాస్ట్ ఎంత ఎర్లీగా ఉంటే… అంత ఆరోగ్యంగా ఉంటారు. అందుకోసం ఉదయం 7 నుండీ 9 గంటల లోపు అల్పాహారం తీసుకోవడానికి ఉత్తమ సమయం.
ఇవి కూడా చదవండి: డిన్నర్ తర్వాత చేసే వాకింగ్ మంచిదేనా?
- మధ్యాహ్న భోజనం వల్ల శరీరానికి శక్తి ఎక్కువ లభిస్తుంది. అందుకోసం విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్ తో నిండిన భోజనం తీసుకోవాలి. అయితే మధ్యాహ్నం 12:30 నుండీ 1 గంట మధ్య భోజనం చేయడానికి ఉత్తమ సమయం.
ఇవి కూడా చదవండి: అన్నం తినేటప్పుడు ఈ ఐదు పొరపాట్లు అస్సలు చేయకండి!
- బరువు తగ్గడానికి రాత్రి భోజనం ఎంతో కీలకమైంది. అందుకే సరైన సమయంలో డిన్నర్ చేయడం ముఖ్యం. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల మెటబాలిజం దెబ్బతింటుంది. నడుము దగ్గర కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. ఇంకా అర్థరాత్రి భోజనం వల్ల మీ నిద్రకు భంగం వాటిల్లుతుంది. అలాకాకుండా ఉండాలంటే, రాత్రి 8 గంటల లోపే డిన్నర్ చేయటానికి ఉత్తమ సమయం.
డిస్క్లైమర్:
కేవలం ఆహారంలో మార్పులే కాకుండా శారీరక శ్రమ కూడా చేయాల్సి ఉంటుది. నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే హాయిగా నిద్ర కూడా పడుతుంది. మళ్ళీ ఉదయం లేవగానే హెల్దీగా, ఏనర్జటిక్ గా ఉంటారు.