నోటిలో గాయాన్ని ఈ టిప్స్‌తో నయం చేయండి..!

సాదారణంగా మనం ఏవైనా ఆహార పదార్ధాలని తీసుకొనేటప్పుడు అనుకోకుండా ఒక్కోసారి నాలుక కొరుక్కుంటాం. అలానే పదార్ధాలని నములుతున్నప్పుడు పొరపాటున దవడ లోపలి చర్మం కొరుక్కుంటాం. ఇలాంటప్పుడు నోటిలోపల తీవ్రమైన నొప్పి పుడుతుంది. తినటానికి, తాగటానికి ఇబ్బంది కలుగుతుంది.

నోటి లోపల చర్మం, లేదా నాలుక కట్ అయినప్పుడు అది తగ్గడానికి మరింత సమయం పడుతుంది. మరి ఆహారం సరిగా నమలి తినకపోతే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాంటప్పుడు నోటి గాయాన్ని తగ్గించుకోవటానికి కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: నోటిపూతకి శాశ్వతంగా చెక్ పెట్టాలంటే ఇలా చేయండి!

వేడి నీరు తాగాలి:

నోటిలో గాయం త్వరగా మానాలంటే, కనీసం రోజుకు ఒకసారైనా గోరువెచ్చని నీరు తాగాలి. రోజూ ఉదయాన్నే వేడి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల నోటిలో ఏర్పడిన గాయం త్వరగా మానిపోతుంది. అంతేకాక, దంతాలు, నాలుకపై పేరుకుపోయిన మురికి కూడా తొలగిపోయి… నోటి ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

చల్లని పదార్థాలు తినాలి:

నోట్లో గాయమైనప్పుడు వేడి వేడి పదార్థాలు తినటం కానీ, స్పైసీ ఫుడ్స్‌ తీసుకోవటం కానీ చేయకూడదు. దీనివల్ల సమస్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే కొన్ని రోజులపాటు చల్లటి పదార్ధాలు, లేదా పెరుగన్నం వంటివి తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల నోటి గాయం త్వరగా తగ్గే ఛాన్స్ ఉంది.

అలోవేరా జెల్ వాడాలి:

నోటి గాయం విషయంలో అలోవెరా జెల్ అద్భుతంగా పని చేస్తుంది. దీనిని ఉపయోగించడం ద్వారా నోటి సంబందిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలోవేరాలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గాయాలను త్వరగా మాన్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందుకోసం మీరు చేయాల్సిందల్లా… కలబంద రసాన్ని నోటిలో గాయమైన ప్రదేశంలో అప్లై చేసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత, చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

డిస్క్లైమర్:

ఇవన్నీ సాదారణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అందించిన నేచురల్ టిప్స్ మాత్రమే! సమస్య తీవ్రతరమైనప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

Leave a Comment