నోటిపూతకి శాశ్వతంగా చెక్ పెట్టాలంటే ఇలా చేయండి!

నోటిపూత అనేది సర్వసాధారణమైన సమస్య. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడినవాళ్ళే! నిజానికి నోటిపూత ఉంటే… ఏమీ తినలేము, తాగలేము సరికదా! ఎక్కువగా మాట్లాడనూ లేము. సాధారణంగా వేడి చేస్తేనో… డీహైడ్రేషన్‌, లేదా స్ట్రెస్ కారణంగానో ఈ నోటిపూత వస్తుంది. అయితే, నోటిపూత బారిన పడిన వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తకుండా కొన్ని హోమ్ రెమెడీస్ ఉపయోగించి దానికి శాశ్వతంగా చెక్ పెట్టేయోచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  • నోటి పూత వచ్చినప్పుడు ఒక చిన్న ఐస్‌ ముక్కని తీసుకుని పూత ఉన్న ప్రాంతంలో స్లోగా మసాజ్ చేయాలి. అలాగే, చల్లటి నీటితో మౌత్ వాష్ చేస్తే వెంటనే ఫలితం కనిపిస్తుంది.
  • లవంగం నమలడం, లవంగం నూనెని రాయడం ద్వారా కూడా ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు.
  • తేనె యాంటీ మైక్రోబియల్ గుణాలని కలిగి ఉంటుంది. అందుచే ఇది నోటిపూతని వెంటనే తగ్గించి వేస్తుంది. అలాగే, తేనె న్యాచురల్‌ మాయిశ్చరైజర్‌గా కూడా పని చేస్తుంది. కాబట్టి నోటిపూత ఏర్పడిన ప్రాంతంలో తేనెలో కాస్త పసుపు వేసి కలిపి రాస్తే, త్వరగా ఉపశమనం కలుగుతుంది.
  • సాదారణంగా వేడి చేస్తే, కొబ్బరి బొండాం నీళ్ళు తాగుతాం. ఎందుకంటే, ఇది శరీరంలోని వేడిని తగ్గించి వేస్తుంది. అందుకే, నోటి పూత సమస్య ఉన్నవాళ్ళు కూడా ఈ కోకోనట్ వాటర్ ఎక్కువగా తాగితే సమస్య తగ్గుముఖం పడుతుంది.
  • కొన్ని తులసి ఆకులని తీసుకొని, నీళ్ళల్లో వేసుకోవాలి. ఆ నీళ్ళని తాగుతూ దానితోపాటే తులసి ఆకులని కూడా నములుతూ ఉండాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

పైన చెప్పిన నేచురల్ రెమెడీస్ ఉపయోగించి ఎంతో సమస్యాత్మకంగా మారిన నోటిపూతకి శాశ్వతంగా చెక్ పెట్టేయెచ్చు.

Leave a Comment