గోళ్లు రంగుమారితే… ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టేనా..!

మీకు తెలుసా! మీ గోళ్లు మీ ఆరోగ్యానికి సంబంధించి కొన్ని క్లూస్ ఇస్తాయని. గోళ్ళు వాటి రంగుని బట్టి రాబోయే అనారోగ్యాన్ని ముందే రివీల్ చేస్తాయి. మన శరీరంలో న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ ఏర్పడినప్పుడు లేదా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు కెరాటిన్ ప్రభావితమవుతుంది దీని ప్రభావం గోళ్లపై కనిపిస్తుంది.

కెరాటిన్ అనేది ఒక రకమైన ప్రోటీన్. ఇది మన జుట్టు, గోళ్ళు వంటి స్కిన్ ఔటర్ లేయర్స్ ని తయారుచేసే ఒక పదార్ధం. మన శరీరంలో దీని కొరత ఏర్పడినప్పుడు గోళ్ళు రంగుమారటం మొదలవుతుంది. అందుకే, పూర్వ కాలంలో వైద్యులు పేషెంట్ యొక్క కళ్ళు, గోర్లు, నాలుకని చూసి వ్యాధిని నిర్ధారించేవారు. గోళ్ల రంగుని బట్టి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి మేజర్ ఆర్గాన్స్ పనితీరు తెలుసుకోవచ్చు. అయితే, గోళ్ళు ఏ రంగులో ఉంటే… ఎలాంటి అనారోగ్యం రాబోతుందో ఇప్పుడే తెలుసుకుందాం.

మీ గోళ్లు తెల్లగా, పాలిపోయినట్లు ఉంటే… అది అనీమియా, హెపటైటిస్, హార్ట్ ఫెయిల్యూర్, న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ మొదలైన వాటికి సంకేతం కావొచ్చు.

  • నలుపు రంగు గోర్లు:

గోళ్లు నల్లగా మారితే… స్కిన్ క్యాన్సర్‌ వచ్చిందని అర్థం. ఒక్కోసారి ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా గోళ్లు నల్లగా మారతాయి. కొన్నిసార్లు గోళ్ళకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు గోరు కింద ఉండే రక్త నాళాలు చిట్లి పోయి… రక్తం నల్లగా మారుతుంది. అలాగే, సూడోమోనాస్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కూడా గోళ్లు నల్లగా మారుతాయి.

  • పసుపు రంగు గోర్లు:

మీ గోళ్ళు పసుపు రంగులోకి మారాయి అంటే… శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని అర్థం. అంతేకాదు, ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్, థైరాయిడ్, సిర్రోసిస్ వంటి కారణాల వల్ల కూడా గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి.

  • ఆకుపచ్చ రంగు గోర్లు:

ఉన్నట్టుండి మీ గోళ్ళు ఆకుపచ్చ రంగులోకి మారిపోతే… సూడోమోనాస్ అనే బ్యాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశించిందని అర్ధం.

  • నీలి రంగు గోర్లు:

మీ గోళ్ళు నీలిరంగులోకి మారాయంటే… మీ శరీరంలో ఆక్సిజన్‌​ కొరత ఏర్పడిందని అర్థం. అంతేకాదు, ఇంకా హార్ట్ ప్రాబ్లెమ్స్, లంగ్స్ ఇన్ఫెక్షన్ వంటివి ఉన్నా కూడా గోళ్ళు నీలి రంగులోకి మారతాయి.

  • తెలుపు-గులాబీ రంగు గోర్లు:

మీ గోర్లు సగం తెలుపు, సగం గులాబీ రంగులో ఉన్నట్లయితే… మీ శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గిందని అర్ధం.

  • ఎరుపు-గోధుమ రంగు గోర్లు:

మీ గోర్లు సగం ఎరుపు, సగం గోధుమ రంగులో ఉన్నట్లయితే… మీరు సార్కోయిడోసిస్ అనే స్కిన్ డిసీజ్ తో బాధపడుతున్నారని అర్ధం. దీనివల్ల గోరు కింద చర్మం ఎరుపు-గోధుమ రంగులలో కనిపిస్తుంది.

  • గోళ్ళపై తెల్లటి మచ్చలు:

గోళ్లపై తెల్లటి మచ్చలు ఏర్పడటం చాలామందికి సర్వ సాదారణం. ఎప్పుడైతే, ఈ మచ్చల పరిమాణం పెరుగుతుందో… అప్పుడు శరీరంలో సమస్య ఏర్పడినట్లు. అది కూడా కాలేయానికి సంబంధించిన సమస్యే అయి ఉంటుంది.

  • గోళ్లలో చారలు:

గోళ్ళపై ఏర్పడే చారలు విటమిన్-బి, బి-12, మరియు జింక్ లోపాన్ని సూచిస్తాయి.

  • అలలు లాంటి గోర్లు:

మీ గోరు పైభాగంలో గుంటలు పడి, అలలు లాగా ఉన్నత్లైతే… సోరియాసిస్, లేదా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ యొక్క ఫస్ట్ సైన్ కావచ్చు.

  • పెళుసుగా ఉండే గోర్లు:

మీ గోళ్ళు పొడిబారిపోయి, పెళుసుగా తయారై, తరచుగా చిట్లిపోవడం వంటివి జరిగితే… థైరాయిడ్ వ్యాధితో భాదపడుతున్నట్లు అర్ధం. ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా పగుళ్లు, లేదా చీలికలు ఎక్కువవుతాయి. మరోవైపు గోర్లు డ్రైగా మారి తరచూ విరిగిపోతున్నట్లయితే అది శరీరంలో పోషకాల కొరతను సూచిస్తుంది.

  • ఉబ్బిన గోర్లు:

గోరు చుట్టూ ఉండే చర్మం ఎర్రగా మారి ఉబ్బినట్లు కనిపిస్తే… దీనిని గోరు మడత యొక్క వాపు అంటారు. ఇది లూపస్ డిసీజ్, లేదా టిష్యూ డిజార్దర్ వలన సంభవిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల గోరు చుట్ట్టూ ఉండే చర్మం ఎర్రబడటం, మరియు వాపుకు కారణమవుతుంది.

  • నల్లటి గీతలు గల గోర్లు:

గోళ్ళ పైన నల్లటి గీతలు కనిపిస్తే… అది మెలనోమా వంటి అత్యంత ప్రమాదకరమైన చర్మ క్యాన్సర్ వల్ల కావచ్చు.

  • కొరికిన గోర్లు:

కొంతమందిలో గోర్లు కోరికే అలవాటు ఉంటుంది. ఇలా గోర్లు కొరకటం అనేది అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్‌ అనే వ్యాధికి మూలం.

ముగింపు:

గోర్లు రంగు మారటం అనేది అనేక సందర్భాలలో జరుగుతూ ఉంటుంది. అలా రంగుమారటం ఒక్కోసారి సాదారణం అయితే, ఇంకోసారి ప్రాణాంతకం కావచ్చు. ఏదైనా ఆకస్మాత్హుగా మీ గోర్లు రంగు మారితే అది దేనికి సంకేతమో తెలుసుకోవటానికి వీలైనంత వరకూ డాక్టర్ని సంప్రదిస్తే మంచిది.

Leave a Comment