వేసవిలో బీట్‌రూట్‌ జ్యూస్ తాగితే… ఈ సమస్యలకి చెక్ పెట్టొచ్చు!

బీట్‌రూట్‌ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తుంటారు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. క్రమంతప్పకుండా దీనిని తీసుకున్నట్లయితే, అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు, సాదారణంగా మట్టిలోపల పండే దుంపలు ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయని చెబుతారు. అందుకేనేమో..! బీట్‌రూట్‌ లో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి. ఇంకా ఇందులో విటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువే!

ఇక సమ్మర్ సీజన్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ కాలంలో ఎదురయ్యే మలబద్ధకం, జీర్ణ సమస్యల నుండి ఇది కాపాడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ మరియు విటమిన్ ఎ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల సమ్మర్ సీజన్లో క్రమం తప్పకుండా ఈ బీట్‌రూట్‌ జ్యూస్ ని తాగినట్లైతే, పొట్టని క్లీన్ చేస్తుంది. దీంతో మలబద్ధకం, మరియు జీర్ణ సమస్యలు వంటివి తగ్గిపోతాయి. అలాగే ఎండాకాలంలో వచ్చే చర్మ సమస్యలనుండీ కూడా కాపాడుతుంది.

బీట్‌రూట్‌లోని నైట్రేట్ కంటెంట్ బ్లడ్ ప్రెజర్ ని తగ్గించి, రక్త నాళాలని విస్తరింప చేస్తుంది. తద్వారా రక్తపోటు తగ్గుతుంది. బీట్‌రూట్ రసం కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇంకా ఇది కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గిస్తుంది.

బీట్‌రూట్ జ్యూస్‌ని రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే, స్కిన్ బ్రైట్ నెస్ పెరుగుతుంది,. ఇంకా యాంటీ ఏజింగ్ కూడా ఉపయోగపడుతుంది. బీట్‌రూట్‌లో నేచురల్ కెమికల్ అయిన నైట్రేట్ ఉంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతుంది. అందువల్ల శరీరంలో బ్లడ్ పంపింగ్ ని ఈజీ చేస్తుంది. బీట్‌రూట్‌లో విటమిన్ సి, మెగ్నీషియం, కాల్షియం అధిక మోతాదులో ఉంటాయి. క్రమం తప్పకుండా దీనిని తాగడం వల్ల శారీరక అలసట తగ్గి… శక్తి పెరుగుతుంది.

షుగర్ పేషంట్లు కూడా బీట్‌రూట్ జ్యూస్‌ తాగొచ్చు. అయితే, లిమిట్ గా తీసుకోవాలి. ఈ జ్యూస్ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జుట్టు రాలే సమస్య ఉన్నవారు దీనిని తప్పక వాడవచ్చు. అయితే, వీళ్ళు బీట్ రూట్ జ్యూస్‌లో కొద్దిగా అల్లం కలిపి తాగాల్సి ఉంటుంది. అదే వెనిగర్ కలిపి తీసుకొంటే డ్రై స్కాల్ప్ సమస్య తగ్గుతుంది.

ఇంకా కడుపులో దీర్ఘకాలిక మంట, కాలేయ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌, ఒబేసిటీ వంటి సమస్యలతో బాధపడేవారికి ఇదో చక్కటి పరిష్కారం. అనీమియాని తగ్గిస్తుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దంత సమస్యలని నివారిస్తుంది. జీవక్రియని వేగవంతం చేస్తుంది.

పైన తెల్పిన సమస్యలలో మీరు దేనికి రిలేటెడ్ గా ఉన్నా… బీట్‌రూట్ జ్యూస్‌ ని తప్పక తీసుకోండి, అయితే, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు మాత్రం కొంచెం ఆలోచించాల్సిందే!

Leave a Comment