తమలపాకులు నమలటం వల్ల… ఈ సమస్యలు తొలగిపోతాయి!

హిందూ సాంప్రదాయంలో తమలపాకులకి ప్రత్యేకమైన స్థానం ఉంది. పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు ఇలా ఒకటేమిటి అన్ని శుభాకార్యాలలోనో వీటిని విరివిగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా భగవంతుని ఆరాధనలో ఈ తమలపాకులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పూర్వకాలంలో అతిథులకి భోజనానంతరం వీటిని అందించేవారు. ఇప్పటికీ మన దేశంలో ఏవైనా ఫంక్షన్లు జరిగినప్పుడు పాన్ రూపంలో వీటిని ఇవ్వటం ఆనవాయితీ.

అయితే, కొంతమందికి తమలపాకులని అలానే తింటే ఆరోగ్యానికి హానికరమనే అపోహ కూడా లేకపోలేదు. కానీ, నిజానికి వీటిని అలానే తినేయటం వల్ల మన శరీరంలోని ఎన్నో సమస్యలు తగ్గిపోతాయట. తమలపాకులో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి.

తమలపాకులలో టానిన్స్, ఆల్కలాయిడ్స్, ఫినైల్, ప్రొపేన్ వంటివి ఉన్నాయి. ఇవి శరీరంలో పెయిన్, మరియు ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, తమలపాకులని నమలటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

  • తమలపాకులని నమలడం వల్ల డైజేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది.\
  • మలబద్ధకం తగ్గిపోతుంది.
  • అసిడిటీ వంటి సమస్యల నుంచి కూడా బయట పడొచ్చు.
  • అల్సర్ వంటి వ్యాధులు నయం చేయడంలో కీలక పాత్ర వహిస్తాయి.
  • చిగుళ్ల వాపు తగ్గిస్తుంది. చిగుళ్లలో వాపు, లేదా గడ్డలు వంటివి ఏర్పడినప్పుడు దీనిని నమిలి తింటే చాలు వెంటనే తగ్గిపోతుంది.
  • బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. తమలపాకులు నమలటం ద్వారా శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి.
  • తరచూ తమలపాకులు నమిలితే దంతాలకు చాలా మంచిది. అలా అని సున్నం కలుపుకుని పాన్ రూపంలో తినకూడదు, అచ్చం ఆకులనే తినాలి.
  • జలుబు, తలనొప్పి, గాయం, వాపు, గాయం వంటి సాధారణ సమస్యలని కూడా తగ్గిస్తుంది.

చూశారుగా..! తమలపాకుతో ఎన్ని సమస్యలు నిర్మూలించ బడతాయో..! అందుకే దీనిని అప్పుడప్పుడూ నమలటం ఎంతో మంచిది. అలా అని మితిమీరి నమిలితే ఆరోగ్యానికే ప్రమాదమని గుర్తు పెట్టుకోండి.

Leave a Comment