నోటి దుర్వాసనకి మనం చేసే ఈ తప్పులే కారణం..!

నోటి దుర్వాసన సాధారణ సమస్యే అనుకుంటారు చాలామంది. కానీ దీని మూలంగా కొన్ని ఇబ్బంది కరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. నోటి నుంచి చెడు వాసన రావటానికి అనేక కారణాలు ఉండవచ్చు. అవి మనం తినే ఆహారం ద్వారా ఉండవచ్చు. లేదా త్రాగే నీటి ద్వారా ఉండవచ్చు. మరీ ముఖ్యంగా దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోక పోవటం ద్వారా కూడా కావచ్చు. అయితే, రీజన్ ఏదైనా సరే నోటి దుర్వాసన రావటానికి మనం చేసే కొన్ని తప్పులే కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.

  1. దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకవటం:

ప్రతి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మొదటగా మన దంతాలను టూత్ పేస్ట్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. దంతాల పైన ఉండే పాచిని పూర్తిగా పోగొట్టుకోవాలి. అలా కాకుండా దంతాలని సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా… రాత్రి తిన్న ఆహారం పళ్ళ సందుల్లో ఇరుక్కొని ఉన్నా… నోటి దుర్వాసన వస్తుంది.

  1. ఆహారం తినేటప్పుడు నీరు త్రాగకూడదు:

మనలో చాలామంది భోజనం చేసేటప్పుడు లేదా చేసిన తరువాత నీరు ఎక్కువగా త్రాగుతుంటారు. నిజానికి అది చాలా తప్పు. ఎందుకంటే అలా నీరు త్రాగటం వల్ల నోటి నుంచి ఒక రకమైన దుర్వాసన వస్తుంది. అలానే టీ లేదా కాఫీ లాంటి పదార్ధాలు సేవించేటప్పుడు కూడా నీరు త్రాగటం చాలా తప్పు.

  1. చెక్కెర పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం:

మనం తినే ఆహరంలో చెక్కెర శాతం తక్కువగా ఉంటే చాలా మంచిది. చెక్కెర మూలంగా మన దంతాలు త్వరగా చెడి పోయి నోటి నుంచి దుర్వాసన వెంటనే వస్తుంది. అంతే కాకుండా ఏదైనా అల్పాహారం తీసుకున్న వెంటనే కూడా నోటిని అతిగా శుభ్రం చేసుకోవటం అంత మంచిది కాదు.

  1. నోటి ద్వారా గాలి పీల్చటం:

మనలో చాలా మంది వారికి తెలుయకుండానే ముక్కుతో కాకుండా నోటి ద్వారా కూడా గాలిని పీలుస్తూ ఉంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. దీని ద్వారా నోటిలో లాలాజలం ఊరక నోటి నుంచి చెడు వాసన వస్తుంది. అంతే కాకుండా మన ఊపిరితిత్తులు కూడా త్వరగా చెడిపోవటానికి అవకాశం ఉంది.

సో ఫ్రెండ్స్! పైన చెప్పిన ఈ చిన్న చిన్న తప్పులే మన నోటి దుర్వాసనకి కారణం అవుతున్నాయి. అందుకే ఇలాంటి తప్పులు ఇకపై రిపీట్ కాకుండా చూసుకోవటం బెటర్.

Leave a Comment