బ్లాక్‌ కాఫీతో ప్రయోజనాలెన్నో!

కాఫీ అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ఉదయం నిద్ర లేస్తూనే బెడ్ కాఫీతో బాడీని రీచార్జ్ చేసుకుంటాం. ఇక మళ్ళీ బ్రేక్ ఫాస్ట్ తర్వాత, పని ఒత్తిడి పెరిగినప్పుడు, ఈవెనింగ్ స్నాక్స్ టైమ్ లో ఇలా అనేక సార్లు మన వీలుని బట్టి కాఫీ తాగుతూ ఉంటాం. కాఫీ తాగితే నీరసం, అలసట తగ్గి ఇన్స్టంట్ రిలీఫ్ కలుగుతుంది.

ఇదంతా ఒక ఎత్తైతే… ఉదయాన్నే పరగడుపున బ్లాక్ కాఫీ తాగితే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. నిజానికి మనం తాగే మిల్క్ కాఫీ కన్నా… బ్లాక్ కాఫీలోనే ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. రుచికి కాస్త చేదుగా అనిపించినప్పటికీ ఆరోగ్యానికి అసలు ఇదే మంచిది.

విటమిన్ బి-2, బి-3, బి-5, పొటాషియం, మెగ్నీషియం, ఫినాలిక్ యాసిడ్స్ ఈ కాఫీలో పుష్కలంగా ఉంటాయి. పైగా బ్లాక్ కాఫీలో పాలు కానీ, లేదా చక్కెర కానీ ఉండవు కాబట్టి దీనిని తాగడం వల్ల కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు వంటివి శరీరానికి అందవు. మరి అలాంటి బ్లాక్‌ కాఫీతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఒకసారి తెలుసుకుందాం పదండి.

బరువు తగ్గస్తుంది:

బ్లాక్ కాఫీ అనేది క్యాలరీలు లేని పానీయం. ఇందులోని కెఫీన్‌ మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. ఆకలిని అరికట్టి… తక్షణ శక్తిని ఇస్తుంది. అంతేకాదు, పొట్టలోని కొవ్వును కరిగించి… అధిక బరువును తగ్గిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్:

బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలకు మూలం. అందుకే ఇది ఇమ్యూన్ సిస్టం, మరియు మెటబాలిజం రేటుని ఇంప్రూవ్ చేస్తుంది.

మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది:

బ్లాక్ కాఫీ నెర్వస్ సిస్టంని స్టిమ్యులేట్ చేస్తుంది. డోపమైన్, నోర్‌పైన్‌ఫ్రైన్ వంటి న్యూరోట్రాన్స్‌మీటర్ల విడుదలను ప్రోత్సహిస్తుంది. తద్వారా రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండగలుగుతారు.

ఒత్తిడిని తగ్గింస్తుంది:

బ్లాక్ కాఫీలో యాంటీ-డిప్రెషన్ లక్షణాలు ఉంటాయి. ఇది మెదడులోని సెరోటోనిన్, డోపమైన్ వెంటి హార్మోన్స్ లెవెల్స్ ని పెంచుతుంది. ఫలితంగా ఒత్తిడి, డిప్రెషన్‌లని తగ్గిస్తుంది.

శారీరక పనితీరును మెరుగు పరుస్తుంది:

రక్తంలో ఆడ్రినలిన్ లెవెల్స్ ని పెంచుతుంది. ఈ హార్మోన్ కారణంగా శరీరం బలంగా తయారవుతుంది. తద్వారా శారీరక పనితీరు మెరుగు పడుతుంది.

కాలేయానికి మేలు చేస్తుంది:

బ్లాక్ కాఫీని క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తంలో టాక్సిక్ లివర్ ఎంజైమ్స్ లెవెల్ తగ్గుతుంది. ఈ కారణంగా క్యాన్సర్, హెపటైటిస్, ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ సిర్రోసిస్‌తో సహా పలు రకాల కాలేయ సమస్యలను నివారిస్తుంది.

జ్ఞాపకశక్తిని పెంచుతుంది:

బ్లాక్ కాఫీ జ్ఞాపకశక్తికి సంబంధించి వ్యాధులైన అల్జీమర్స్, డిమెన్షియా, పార్కిన్సన్స్‌ వంటి వ్యాదుల నుంచి రక్షణ కల్పిస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నరాల పనితీరు మెరుగుపడుతుంది. మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. అలానే, జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.

మధుమేహాన్ని తగ్గిస్తుంది:

బ్లాక్ కాఫీ తాగడం వల్ల డయాబెటిస్ రిస్క్ నుండీ బయటపడవచ్చు. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తూ… బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి బ్లాక్ కాఫీ సహాయపడుతుంది.

కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ ని తగ్గిస్తుంది:

కెఫీన్ రక్తపోటును పెంచడానికి సహాయపడుతుందని మనం సాధారణంగా వింటుంటాం కానీ అది నిజం కాదు. కాఫీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కార్డియో వాస్క్యులర్ డిసీజెస్, మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

క్యాన్సర్ ని నివారిస్తుంది:

కాలేయ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, మరియు రొమ్ము క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్‌లను తగ్గించడానికి బ్లాక్ కాఫీ సహాయపడుతుంది.

యూరినరీ సిస్టంని క్లియర్ చేస్తుంది:

బ్లాక్ కాఫీ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి… మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది. ఈ విధంగా పొట్టను శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

డిస్క్లైమర్:

ఈ సమాచారమంతా కేవలం అవగాహన కోసం మాత్రమే! నిజంగా బ్లాక్ కాఫీని ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలని అనుకుంటే… వైద్యుని సలహా, మరియు సూచన మేరకే చేయండి.

Leave a Comment