కంచు పాత్రలో వండిన ఆహారం తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసుకోండి!

ఇటీవలికాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై విపరీతమైన శ్రద్ధ కనపరుస్తున్నారు. ఎవరికి వారుగా తమ ఇమ్యూనిటీని పెంచుకునే పనిలోపడ్డారు. అందులో భాగంగా పోషకాహారంపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే తినే ఆహారం దగ్గర నుంచి వండే పాత్రల వరకు ప్రతి ఒక్క విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నారు.

ఇందుకోసమై పూర్వకాలంలో మన పెద్దలు పాటించిన పద్ధతులనే తిరిగి వినియోగంలోకి తీసుకు వస్తున్నారు. అందుకే, గత కొంతకాలంగా ఇత్తడి, కంచు, రాగి, మరియు మట్టి పాత్రలపై ఎక్కువ మక్కువ చూపుస్తున్నారు. ఈ పాత్రల్లో వండిన ఆహార పదార్ధాలను తినటం, వీటిలో నిల్వ ఉంచిన నీటిని తాగటం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో వర్క్ షాప్స్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే, ప్రస్తుతం మనం ఇప్పుడు కంచు పాత్రలో భోజనం చేయటం, మరియు వీటిలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • మనం తీసుకొనే ఆహారం, లేదా నిల్వ ఉంచిన నీరు కాంస్య పాత్రలలో ఉన్నట్లయితే… అది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • బ్రోంజ్ మంచి హీట్ కండెక్టర్ గా ఉంటుంది. అందుకే బ్రోంజ్ యూటెన్సిల్స్ లో నిల్వ ఉంచిన ఆహారం ఏదైనా సరే ఎక్కువసేపు వెచ్చగా ఉంచుతుంది. అలాగే, అందులో న్యూట్రిషన్స్ కూడా అలాగే ఉంచుతుంది.
  • కాంస్య పాత్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే, ఆహారాన్ని కంచు పాత్రలలో ఉంచినట్లయితే, ఆహారంలో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నప్పటికీ, కొద్దిసేపటికే అవి చంపబడి, ఆహారానికి స్వచ్చతని అందిస్తుంది.
  • కాంస్య పాత్రలలో ఎనిమిది గంటల పాటు నీటిని నిల్వ చేసి ఉంచినట్లయితే… అందులో ఉన్న సూక్ష్మ క్రిములు నశిస్తాయి. అలాంటి నీటిని తాగటం వల్ల వైరస్ కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్స్ బారినుండీ తప్పించుకోవచ్చు.
  • కంచు ఆల్కలీన్ మెటల్ కావతంచేత ఇది ఎసిడిటీని కలిగించే ఆహారాలు, మరియు పుల్లని పదార్థాలతో ఎలాంటి చర్య తీసుకోదు. ఇంకా ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
  • కంచులో చర్మాన్ని కాంతివంతంగా మార్చే గుణం ఉంది. అందువల్ల కంచు పాత్రల్లో ఆహారాన్ని తీసుకోనేవారిని అందంగా మారుస్తుంది.
  • ఇంకా ఇది పైత్యాన్ని హరింప చేసి, జీర్ణశక్తి పెంచుతుంది.
  • కంచు పాత్ర కంటికి కూడ మేలు చేస్తుంది.
  • ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
  • థైరాయిడ్ హార్మోన్స్ ని బ్యాలెన్స్‌ చేస్తుంది.

డిస్క్లైమర్:

కంచు పాత్రల్లో ఆహారం తినడం, నీటిని త్రాగడం పూర్వం నుంచి వస్తున్న అలవాటు. ఆయుర్వేదం ప్రకారం కూడా కంచు పాత్రల వినియోగం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా చెబుతారు.

Leave a Comment