క్యాప్సికమ్ ప్రయోజనాలు తెలిస్తే ఒదిలిపెట్టరు!

క్యాప్సికమ్‌లో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలెన్నో ఉన్నాయి. మిరపజాతికి చెందిన క్యాప్సికమ్… ఆహారపదార్ధాలకి రుచిని పెంచుతుంది. వంటకాలని స్పైసీగా మార్చడానికి క్యాప్సికమ్ ని కలుపుతారు. క్యాప్సికమ్‌లో పై తొక్క నుంచి విత్తనాల వరకు ప్రతిదీ ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది.

క్యాప్సికమ్‌ను ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. ‘బెల్ పెప్పర్’ అని కూడా పిలువబడే ఈ వెజిటబుల్ వివిధ రంగులలో లభిస్తుంది. దాని ఔషధ గుణాల కారణంగా ఇది ఔషధంగా కూడా ఉపయోగించబడుతుంది. ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉండి అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్, మరియు న్యూట్రిషన్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. అటువంటి క్యాప్సికమ్‌ తింటే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గుండెకు మేలుచేస్తుంది:

క్యాప్సికమ్ తినడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఫ్లేవనాయిడ్స్, సైటో కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి కరోనరీ హార్ట్ డిసీజెస్, మరియు స్థూలకాయానికి వ్యతిరేకంగా పోరాడే శక్తిను కలిగి ఉంటాయి.

జీర్ణక్రియను పెంచుతుంది:

క్యాప్సికమ్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది.

జీవక్రియను మెరుగుపరుస్తుంది:

క్యాప్సికమ్‌లో క్యాప్సైసిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ ఉండటం వల్ల థర్మోజెనిసిస్‌ను యాక్టివ్ చేయడానికి మరియు జీవక్రియ రేటును పెంచడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గటంలోసహాయపడుతుంది:

క్యాప్సికమ్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మన శరీరంలో ఉన్న కేలరీలను చాలా వేగంగా కరిగిస్తుంది. దీనివల్ల బరువు తగ్గుతారు.

మధుమేహులకు మేలు చేస్తుంది:

క్యాప్సికమ్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల పలు సమస్యలు దూరమవుతాయి. అలానే ఇది డయాబెటిక్ రోగులకు కూడా ఎంతో మేలు చేస్తుంది.

కంటి చూపు పెంచుతుంది:

క్యాప్సికంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన కంటి చూపును అందించటంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా నైట్ విజన్ ని కలిగి ఉండటంలో సహాయపడుతుంది. కళ్లకు మేలు చేసే ల్యూటిన్ అని పిలువబడే కెరోటినాయిడ్స్ యొక్క గొప్ప మూలం ఇందులో ఉంది. ఇది మచ్చల క్షీణత, దృష్టిలోపం, కంటిశుక్లం బారినుండి కళ్ళను కాపాడుతుంది.

క్యాన్సర్‌ను నివారిస్తుంది:

రెడ్ పెప్పర్ లో యాంటీ ఆక్సిడెంట్లు, మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. మరియు వివిధ రకాల క్యాన్సర్ నిరోధక గుణాలు కలిగి ఉంటాయి. క్రానిక్ ఇన్ఫ్లమేషన్, మరియు క్రానిక్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వంటివి క్యాన్సర్ రిస్క్ ని పెంచుతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఈ కారకాలను ఎదుర్కోవచ్చు.

గుండెకు మేలు చేస్తుంది:

క్యాప్సికంలో యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైటోన్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, మరియు ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అలానే ఫోలేట్, మరియు విటమిన్ బి6తో పాటు, లైకోపీన్, హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. దీంతో హృదయ స్పందన రేటు, మరియు రక్తపోటు తగ్గుతుంది.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది:

బెల్ పెప్పర్‌లో విటమిన్ సి ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, దెబ్బతిన్న కణజాలాలను సరిచేయడానికి, మరియు ఆక్సీకరణ ఒత్తిడి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది:

క్యాప్సికంలో మెగ్నీషియం మరియు విటమిన్ బి6 పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండు విటమిన్లు నాడీ వ్యవస్థ యొక్క సాధారణ పనితీరును నిర్వహించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, మరియు తీవ్ర భయాందోళనలను నివారించడానికి చాలా ముఖ్యమైనవి. మెగ్నీషియం యాంగ్జైటీ వల్ల కలిగే మజిల్ స్ట్రైన్ ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది:

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, ఇవి ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులకు వాపు మూల కారణం. అలాంటి వాపులను తగ్గించటం ద్వారా రోగనిరోధక శక్తిపెరిగేలా చేస్తుంది.

మెనోపాజ్ దశలో ఉపశమనం కలిగిస్తుంది:

మోనోపాజ్ సమీపించే స్త్రీలు క్యాప్సికమ్ వంటి ఫ్లేవనాయిడ్-రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు.

ఆర్థరైటిస్ ని తగ్గిస్తుంది:

క్యాప్సికమ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది ఆర్థరైటిస్ యొక్క క్రానిక్ కండిషన్ కి సంబంధించిన నొప్పి, మరియు వాపుని తగ్గిస్తుంది.

జ్వరంతో పోరాడుతుంది:

జ్వరంతో సంబంధం ఉన్న నొప్పులతో బాధపడుతుంటే, క్యాప్సికమ్ శక్తివంతమైన అనాల్జేసిక్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలో నిరోధకతను మెరుగుపరుస్తుంది మరియు జ్వరంతో పోరాడటానికి మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

క్రోన్స్ వ్యాధిని తగ్గిస్తుంది:

క్రోన్స్ వ్యాధి ఒక రకమైన ప్రేగు వ్యాధి. ఇది ఎక్కువగా చిన్న ప్రేగు మరియు పెద్దప్రేగులో సంభవిస్తుంది. క్యాప్సికమ్‌లో ఉండే ఫైటోకెమికల్స్ కారణంగా, క్రోన్స్ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఉపశమనం కలిగిస్తుంది.

డిస్క్లైమర్:

క్యాప్సికమ్ చాలా హెల్దీ వెజిటబుల్. దీనికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, ఇమ్యూనిటీ, మరియు మెటబాలిజం రేటుని గణనీయంగా పెంచుతుంది. క్యాప్సికమ్ తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనప్పటికీ, అతిగా తినడం వల్ల గుండెల్లో మంట, విరేచనాలు వంటి కడుపు నొప్పి సమస్యలు తప్పవు.

Leave a Comment