యూరిక్ యాసిడ్ సమస్యల నుండి ఎలా బయటపడాలి?

శరీరంలో యూరిక్‌ యాసిడ్ పెరిగితే అనేక నష్టాలు కలుగుతాయి. యూరిక్ యాసిడ్ అనేది మనం తీసుకొన్న ఆహారం జీర్ణమవగా… రక్తంలో మిగిలిపోయి ఉండే వ్యర్థపదార్థం.

బాడీలో ప్యూరిన్స్ అనే సమ్మేళనాలు జీవక్రియ చేయబడినప్పుడు యూరిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. సాధారణ పరిస్థితుల్లో, యూరిక్ యాసిడ్ మూత్రపిండాలు మరియు మూత్రం గుండా వెళ్ళిపోతుంది. కానీ, మనం ప్యూరిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తిన్నప్పుడు, ఈ యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఏర్పడతాయి. శరీరంలో నిలిచి ఉన్న ఈ యూరిక్ యాసిడ్ స్ఫటికాల నిక్షేపణనే “గౌట్” అంటారు.

ఇటీవలి కాలంలో మారుతోన్న ఆహార విధానాల కారణంగా ఈ యూరిక్ యాసిడ్ సమస్య పెరుగుతోంది. హానికరమైన టాక్సిన్లు శరీరంలో నుంచి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లకపోతే… శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయి పెరిగిపోతుంది. దీనివల్ల కీళ్ల సమస్యలు వస్తాయి.

తరచుగా పాదాలు, మరియు కాలిలో వాపుకు కారణమవుతుంది. ఇది తీవ్రరూపం దాల్చితే చివరికి నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య దరిచేరకూడదంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఖచ్చితంగా మన డైట్‌లో భాగంగా చేసుకోవాలి. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

చెర్రీస్:

శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ను తగ్గించే ఆహార పదార్ధాలలో చెర్రీలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఇది శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయిని తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

ఫైబర్‌:

ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మెటబాలిజం మెరుగు పడుతుంది. అంతేకాక, ఫైబర్‌ వల్ల యూరిక్‌ యాసిడ్‌ స్థాయి కూడా తగ్గుతుంది. అందుకోసం తృణధాన్యాలు, ఓట్స్‌, బ్రోకలీ, సెలరీ, గుమ్మడికాయ వంటి వాటిని తీసుకోవాలి.

డార్క్‌ చాక్లెట్‌:

డార్క్ చాక్లెట్ ఒత్తిడిని దూరం చేసే యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే థియోబ్రోమిన్‌ ఆల్కలాయిడ్‌ కారణంగా యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు తగ్గుముఖం పడతాయి. అయితే షుగర్‌ కంటెంట్‌ ఎక్కుగా ఉండని చాక్లెట్‌లను తీసుకుంటే మంచిది.

టొమాటో:

యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలను తగ్గించడంలో టొమోటో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్‌ సి యూరిక్‌ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది.

ఆరెంజ్‌:

ఆరెంజ్‌ లో విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది. అందుకే ప్రతీరోజూ ఆరెంజ్‌ తీసుకున్న వారిలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు కూడా తగ్గుతాయి.

డిస్క్లైమర్:

యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు పెరగటం అనేది కేవలం ఒక వ్యాధి మాత్రమే కాదు, ఒక్కోసారి ఇది కిడ్నీస్ లో స్టోన్స్ ఏర్పడటానికి కూడా దారితీయవచ్చు. అందుచేత పైన చెప్పిన విషయాలన్నీ కేవలం సమస్యని తగ్గించే హోమ్ రెమెడీస్ మాత్రమే! సమస్య ఎక్కువైనప్పుడు డాక్టర్ సలహా మేరకు మాత్రమే జీవనశైలిలో మార్పులు, లేదా ఆహారంలో మార్పులు చేయాలి.

Leave a Comment