రాత్రి వేళ ఆలస్యంగా భోజనం చేస్తున్నారా..? అయితే, మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే!

ఆహారాన్ని సరైన సమయంలో తీసుకొంటేనే… అందులోని పోషకాలు శరీరానికి అందుతాయి. అలాకాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల రోగాలు చుట్టుముడతాయి. ఈ క్రమంలో అర్థరాత్రి డిన్నర్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంది. ఒక్కోసారి పని ఒత్తిడి వల్లనో, సమయాభావం వల్లనో డిన్నర్ లేట్ అవుతుంది. ఇలా ఎప్పుడో ఒకసారి జరిగితే పర్లేదు కానీ, లెట్ నైట్ డిన్నర్ రోజూ కామన్ గా జరుగుతుంటే మాత్రం ఇబ్బందే!

ప్రతి రోజూ 8 గంటలకి డిన్నర్ కంప్లీట్ అయిపోవాలి. అలా కాక, అలాకాక, అర్థరాత్రి ఆహారం తీసుకోవడం వల్ల అనేక నష్టాలు కల్గుతుతాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి.

జీర్ణ సమస్యలు:

రాత్రివేళ ఆలస్యంగా తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక డైజేషన్ కష్టమవుతుంది. దీని కారణంగా మరుసటి రోజు ఉదయం కడుపు సరిగ్గా క్లీన్ అవ్వదు. ఇంకా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.

బరువు పెరుగటం:

ఆలస్యంగా భోజనం చేయడం వల్ల అత్యంత వేగంగా బరువు పెరిగే ఛాన్స్ ఉంది. బరువు నియంత్రణలో ఉండాలంటే ఆహారంr తీసుకోవటానికి, నిద్ర పోవటానికి మధ్య కనీసం 3 గంటలైనా గ్యాప్ ఉండాలి. అందుకే అర్థరాత్రి భోజనానికి దూరంగా ఉండాలి. దీనితో పాటు రాత్రిపూట ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ వంటివి తినడం మానుకోవాలి.

నిద్రలేమి:

లెట్ నైట్ డిన్నర్ వల్ల నిద్ర సమస్యలు కూడా తలెత్తుతాయి. అర్థరాత్రి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంపై అది ప్రభావం చూపుతుంది. దీని వలన నిద్రలేమితోపాటు… ఇంకా అనేక సమస్యలు వస్తాయి.

క్రానిక్ డిసీజెస్:

ఆలస్యంగా చేసే భోజనం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి క్రానిక్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. ఇవి మాత్రమే కాక, ఇంకా గుండె సంబంధిత సమస్యల బారిన పడే అవకాశం కూడా ఎక్కువ.

ముగింపు:

రాత్రి డిన్నర్ కి, మరియు నిద్రకి మధ్య మీరు ఎంత ఎక్కువ గ్యాప్ వదిలితే, మీ జీర్ణవ్యవస్థ పనితీరు అంత మెరుగ్గా ఉంటుంది.

Leave a Comment