నరాల వీక్ నెస్ ని పోగొట్టే టాప్ 10 ఫుడ్స్

రోజంతా ఉరుకుల పరుగుల మయం. ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయమే ఉండదు. ఎంతసేపూ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి? మనీ ఎలా ఎర్న్ చేయాలి? అనే విషయాలపై ఉన్న ఇంట్రెస్ట్ హెల్త్ పై ఉండట్లేదు. అందుకే నూరేళ్ళ ఆయుష్షు కాస్తా అర్థాంతరంగా ముగిసిపోతుంది.

నిజానికి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం హెల్దీగా ఉండాలంటే… పోషకాహారం తినాలి. ఫిట్ గా ఉండాలంటే… వ్యాయామం చేయాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే! కానీ, ఈమధ్య కాలంలో అందరూ ఆయిల్ ఫుడ్స్ కి అలవాటు పడ్డారు. శారీరక శ్రమ అసలే లేదు. మరలాంటప్పుడు హెల్త్ ని రిస్క్ లో పడేస్తున్నట్లే కదా!

మన ఈ ఆనారోగ్యపు ఆహారపు అలవాట్లే నరాల బలహీనతకి కారణమవుతున్నాయి. నెర్వస్ సిస్టమ్ వీక్ అయితే అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. మరి అలాంటప్పుడు కొన్ని రకాల ఆహారాలను తింటే ఆ నెర్వస్ సిస్టమ్ ని తిరిగి రిపేర్ చేస్తాయి. ఆ ఆహారలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ వెజిటబుల్స్:

గ్రీన్ వెజిటబుల్స్ ఎన్నో రకాల న్యూట్రిషన్స్ కి మూలం. వీటిలో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఫోలేట్ వంటివెన్నో పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, ఎన్నో రకాల అనారోగ్యాలను సైతం పోగొడుతాయి. ఇవి నరాలను బలంగా ఉంచుతాయి. వీటిని తీసుకోవటం వల్ల నెర్వస్ సిస్టమ్ బలంగా తయారవుతుంది. అందుకే, గ్రీన్ వెజిటబుల్స్ ని మీ డైలీ డైట్ లో భాగంగా చేసుకోండి. ఆకుపచ్చని కూరగాయలు మనిషికి చేసే మేలు అంతా ఇంతా కాదు.

డ్రై ఫ్రూట్స్:

డ్రై ఫ్రూట్స్ లో ఎన్నో పోషకాలుంటాయి. ఒకరంగా చెప్పాలంటే ఇవి మనకు దివ్య ఔషదంతో సమానం. ఎందుకంటే వీటిలో ఉండే పోషకాలు నరాలను బలోపేతం చేస్తాయి. నెర్వస్ సిస్టంని ఫిట్ గా ఉంచటంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకోసం వాల్ నట్స్, జీడిపప్పు, బాదంపప్పులను రోజు వారి ఆహారంలో చేర్చండి.

చేపలు:

చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇది నరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అందుకే నరాలు బలహీనంగా ఉండేవారు తరచు చేపలను తీసుకున్నట్లయితే, కొద్ది రోజుల్లోనే వారి నరాలు బలంగా మారుతాయి.

సీడ్స్:

కొన్ని రకాల సీడ్స్ కూడా నెర్వస్ వీక్నెస్ ని పోగొడుతాయి. అందుకోసం అవిసె గింజలు, చియా విత్తనాలు, గుమ్మడి గింజలను రోజూ తీసుకోవాలి. వీటిలో ప్రోటీన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

డార్క్ చాక్లెట్స్:

డార్క్ చాక్లెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరాన్ని శక్తివంతంగా చేస్తాయి. ఇంకా మూడ్ స్వింగ్స్ ను కూడా పోగొడుతాయి. ముఖ్యంగా వీటిలో నరాలను బలాన్ని చేకూర్చే మెగ్నీషియం అధిక మొత్తంలో ఉంటుంది.

బ్రోకలి:

బ్రోకలీలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది, ఇది బ్రెయిన్ పవర్ ని, కాగ్నిటివ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. బ్రోకలీలో గ్లూకోసినోలేట్స్ అనే రిచ్ కాంపౌండ్ పుష్కలంగా ఉంటుంది. కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరుకు అవసరమైన న్యూరోట్రాన్స్‌మిటర్, ఎసిటైల్‌కోలిన్ విచ్ఛిన్నతను నెమ్మదిస్తుంది. ఇది మన మెదడు మరియు జ్ఞాపకశక్తిని పదునుపెడుతుంది.

గుడ్లు:

గుడ్లలో కోలిన్, మరియు బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. గుడ్లు తినేటప్పుడు, వాటిలోని కోలిన్ మెదడు కణాల మధ్య జ్ఞాపకశక్తి, మరియు కమ్యూనికేషన్ కోసం ముఖ్యమైన న్యూరోట్రాన్స్మిటర్ అయిన ఎసిటైల్కోలిన్‌ను తయారు చేయడానికి మెదడుచే ఉపయోగించబడుతుంది.

సాల్మన్:

సాల్మన్ చేప ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇది మెదడు శక్తిని బలోపేతం చేస్తుంది. పూర్ మెంటల్ ఎబిలిటీ తక్కువగా ఉన్నవారు దీనిని తీసుకొంటే మానసిక శక్తి పెరుగుతుంది.

అవకాడో:

అవకాడో మెదడులో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. తద్వారా స్ట్రోక్ నుండి రక్షిస్తుంది. దీనికి కారణం విటమిన్ K, మరియు ఫోలేట్. ఈ రెండూ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. అంతే కాకుండా, జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రతను మెరుగుపరచడంలో కూడా ఈ అవకాడోలు కూడా సహాయపడతాయి. అవోకాడోస్ యొక్క గొప్పదనం ఏమిటంటే, ఇతర పండ్లతో పోలిస్తే, అవకాడోలో అత్యధిక ప్రోటీన్, మరియు తక్కువ చక్కెర కంటెంట్ ఉంటుంది.

డైరీ ప్రొడక్ట్స్:

నరాల ఆరోగ్యానికి మరో ముఖ్యమైన పోషకం పొటాషియం. ఇది పాల ఉత్పత్తులలో సమృద్ధిగా లభిస్తుంది. పాలు, పెరుగు, మజ్జిగ మొదలైన వాటిలో పొటాషియం మరియు కాల్షియం పుష్కలంగా లభిస్తాయి.

డిస్క్లైమర్:

ఈ ఆర్టికల్ లో తెలియచేసిన టిప్స్, అండ్ సజెషన్స్ అన్నీ జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే! మీకు నిజంగా ఏదైనా సమస్య ఉంటే…మీ వైద్యుడిని లేదా ప్రొఫెషనల్ హెల్త్‌కేర్ ప్రొవైడర్‌ను సంప్రదించండి.

Leave a Comment