అన్నం తినేటప్పుడు ఈ ఐదు పొరపాట్లు అస్సలు చేయకండి!

చాలామంది ఆహారం తినేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మీరు చేసే ఈ పొరపాట్లే… మీ జీవనశైలిని దెబ్బతీస్తాయి. సాధారణంగా ఎవరైనా రోజుకు రెండు, లేదా మూడు సార్లు భోజనం చేస్తారు. అయితే, ఆ భోజనం చేసే సమయంలో తెలిసో, తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. నిజానికవి చాలా సింపుల్ విషయాలే అయినప్పటికీ ఫ్యూచర్ లో మన హెల్త్ పై గ్రేట్ ఇంపాక్ట్ చూపుతాయి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా ఏదైనా సరే టైమ్ టూ టైమ్ తీసుకోవాలి. వీటి వేళ్ళల్లో మార్పు ఉండకూడదు. ఇక తన్నం తినేటప్పుడు కూడా కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా వేగంగా తినడం:

ఆత్రంగా ఆహారాన్ని గబగబా తినకూడదు. ఇలా తింటే అతిగా తినేస్తుంటాం. అలాగే, పరిమితిని మించి కూడా తినేస్తాం. ఆత్రుతతో తినడం ఆకలి బాధను తగ్గిస్తుందేమో కానీ, అనారోగ్యాన్ని మాత్రం పెంచుతుంది.

భోజనానికి ముందు పెరుగుతినడం:

పెరుగు ఆరోగ్యానికి మంచిదే! కడుపులో చల్లగా ఉంటుంది.. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగని భోజనానికి ముందు అంటే ఖాళీ కడుపుతో ఈ పెరుగు తినకూడదు. ఎందుకంటే ఇది కడుపు ఆమ్లతను తగ్గిస్తుంది. అందుకే, పెరుగును ఎల్లప్పుడూ భోజనం తర్వాత మాత్రమే తినాలి. ఇలా చేయడం ద్వారా అందులో ఉండే ప్రోటీన్ మొత్తం మన శరీరానికి అందుతుంది. ఇది కండరాల అభివృద్ధికి దోహదపడుతుంది.

రాత్రి భోజనంలో అన్నం తినడం:

రోజువారీ ఆహారంలో అన్నం ముఖ్యమైనదే అయినప్పటికీ, . రాత్రిపూట మాత్రం దానిని తినకూడదు. బియ్యం కార్బోహైడ్రేట్ల గొప్ప మూలం. కావున అది జీర్ణమవటానికి సమయం పడుతుంది. అంతేకాక, అన్నం తినగానే పడుకుంటాం కాబట్టి ఇందులో ఉండే అధిక కేలరీల కారణంగా బరువు పెరిగే ఛాన్స్ ఉంది.

వేడి పాలు తాగడం:

పాలలో దాదాపు అన్ని రకాల పోషకాలు దాగి ఉన్నాయి. అందుకే పాలను సంపూర్ణాహారంగా పరిగణిస్తారు. అయితే, వేడి పాలు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి వీలైనంతవరకూ గోరువెచ్చని పాలు మాత్రమే తాగితే మంచిది.

ఖాళీ కడుపుతో అరటిపండు తినడం:

అరటిపండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాకపోతే దానిని సరైన సమయంలో తినకపోతే కీడు చేస్తుంది. ఖాళీ కడుపుతో అరటిపండును ఎప్పుడూ తినకండి. దీనివల్ల శక్తి హరించడం మాత్రమే కాకుండా డయేరియా, ఇంటెస్టినల్ సిండ్రోమ్ వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. అందుకే అరటిపండు కొద్దిగా కడుపు నిండుగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి.

అన్నం తినేటప్పుడు ఈ 5 పొరపాట్లు అస్సలు చేయకండి. అలా చేస్తే ఆరోగ్యం ఏమో కానీ, అనారోగ్యాన్ని మాత్రం కొని తెచ్చుకున్నవాళ్ళు అవుతారు.

Leave a Comment