కంటి చూపును మెరుగు పరిచే అద్భుతమైన ఆహారాలు

ఈ కంప్యూటర్ యుగంలో ప్రతీదీ డిజిటలైజ్ అయిపొయింది. దీంతో ప్రతి పనికీ మొబైల్, లేదా ల్యాప్‌టాప్‌ మీద ఆధారపడాల్సి వస్తుంది. గాడ్జెట్ల వినియోగం ఎక్కువయ్యే కొద్దీ అవి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా వాటి స్క్రీన్ లైట్ మన కళ్ళకి చాలా హాని కల్గిస్తున్నాయి. ఈ కారణంగా కళ్ళు మంట, దురద వంటి సమస్యలు మొదలై… చివరికి కంటిచూపు కూడా మందగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కంటి ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ ఆహారాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఉసిరి:

ఉసిరి కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం చేత కంటిచూపు పెరుగుతుంది. ఉసిరిని డైరెక్ట్ గా అయినా తీసుకోవచ్చు, లేదంటే… ఉసిరి పొడి, ఊరగాయ, జామ్, ఇలా ఏదో ఒక రూపంలో దీనిని తీసుకోవచ్చు. ఉసిరికాయను రోజూ తీసుకోవడం వల్ల ఒక్క కంటికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

ఆకు కూరగాయలు:

కంటి చూపు మెరుగుపడటంలో ఆకుకూరలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆకు కూరలు, పచ్చి కూరగాయలు కంటికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిన్-సి లతో పాటు, ఐరన్, లుటిన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి ఉన్నాయి. ఇవి కంటి చూపును మరింత పెంచుతాయి.

ఆవకాడో:

అవకాడోలో విటమిన్-ఇ పుష్కలంగా ఉండటం చేత ఇది కంటి రెటీనాని మరింత బలపరుస్తుంది. అవకాడో ఎక్కువగా తింటే… వృద్ధాప్యం వచ్చినా మీ కళ్ళు ఆరోగ్యంగానే ఉంటాయి.

క్యారెట్:

క్యారెట్‌లో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపును మరింత పెంచుతుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్-ఎ కళ్లకు ఎంతో మేలు చేస్తుంది.

సీఫుడ్:

సీఫుడ్ తీసుకోవటం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా ట్యూనా ఫిష్, సాల్మన్ ఫిష్, ట్రౌట్ ఫిష్ వంటి సముద్ర చేపలు కంటి రెటీనాను బలోపేతం చేస్తాయి. ఈ చేపలలో DHA అనే ​​కొవ్వు ఆమ్లం ఉంటుంది. ఇది రెటీనా బలాన్ని పెంచుతుంది. తద్వారా కంటి చూపుమెరుగుపరుస్తుంది.

సిట్రస్ ఫ్రూట్స్:

సిట్రస్ ఫ్రూట్స్ అయిన నిమ్మ, నారింజ, ద్రాక్షపండు, జామపండులో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ సి కళ్లకు మేలు చేస్తుంది.

డ్రైఫ్రూట్స్:

బాదం, వాల్ నట్స్ వంటి డ్రైఫ్రూట్స్ కంటి చూపును ఎంతో మెరుగుపరుస్తాయి. ఈ డ్రైఫ్రూట్స్ రోజూ తింటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

ఇవి మాత్రమే కాదు, స్క్రీన్‌పై కంటిన్యూగా పని చేయకుండా మధ్య మద్యలో కాస్త విశ్రాంతి తీసుకోవాలి. అలాగే, అప్పుడప్పుడూ కళ్ళను చల్లటి నీటితో కడగడం వల్ల కూడా కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.

Leave a Comment