గతంతో పోల్చుకుంటే… ఇటీవలి కాలంలో గుండె జబ్బుల బారిన పడే వారి సంఖ్య ఎక్కువై పోయింది. అలాగే, మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరిగి పోయింది. ఈ క్రమంలో అమెరికాకి చెందిన శాస్త్రవేత్తలు దీనిపై కొన్ని పరిశోధనలు జరిపారు. ఆ పరిశోధనల్లో ఒక కీలక అంశం బయట పడింది.
అదేంటంటే, మిగిలిన గ్రూపులతో పోల్చుకొంటే, ఒకే ఒక బ్లడ్ గ్రూప్ కి చెందిన వారికే ఈ హార్ట్ స్ట్రోక్ ఎక్కువగా వస్తుందట. గుండె జబ్బుల బారిన పడుతున్న వ్యక్తుల యొక్క బ్లడ్ శాంపిళ్లను సేకరించి… పరిశోదించగా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. 60 ఏళ్లలోపు వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని ఈ బ్లడ్ గ్రూప్ ద్వారా అంచనా వేయవచ్చు.
యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (UMSOM) పరిశోధకుల బృందం ‘A’ బ్లడ్ గ్రూప్ కలిగినవారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ‘O’ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి ప్రమాదం తక్కువగా ఉంటుంది. ‘B’ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం కొంచెం ఎక్కువ. ఇక ‘A’ బ్లడ్ గ్రూప్ వారికి స్ట్రోక్‌తో బాధపడే అవకాశం 16 శాతం ఎక్కువగా ఉంటుంది.
స్ట్రోక్ అనేది మెడికల్ ఎమెర్జెన్సీ. ఇది రక్త సరఫరాకు అంతరాయం కలిగించి… మెదడుకు నష్టం కలిగిస్తుంది. స్ట్రోక్ రాగానే ఎమెర్జెన్సీ ట్రీట్మెంట్ అవసరం. అలా ఎలర్ట్ అయినప్పుడే మెదడు దెబ్బతినడాన్ని కొంతమేరకు తగ్గించవచ్చు.
అయితే, స్ట్రోక్ ప్రమాదాన్ని అంచనా వేయడంలో ఈ బ్లడ్ గ్రూప్ ఎందుకు కీలక పాత్ర పోషిస్తుందో స్పష్టంగా తెలియదు. కానీ, ఒక వ్యక్తికి రక్తం గడ్డకట్టటానికి రక్తం యొక్క రకం కారణమని పరిశోధకులు భావిస్తున్నారు.
స్ట్రోక్ లక్షణాలు:
మాట్లాడటం, అర్థం చేసుకోవడం, నడవడంలో ఇబ్బంది. అలాగే ముఖం, చేయి లేదా కాలు పక్షవాటానికి గురవటం, లేదా తిమ్మిరిగా ఉండటం. ఈ స్ట్రోక్ యొక్క మేజర్ లక్షణాలు.