ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, టూమచ్ గా ఉప్పు తింటున్నట్లే..!

ఆహార పదార్ధాలకి సరైన ఫ్లేవర్ ని అందించేది ఉప్పు. అలాంటి ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే అనర్ధమే! నిజానికి ఏ ఆహారమైనా లిమిట్ గా తీసుకొంటే డైజెస్ట్ అవుతుంది. లిమిట్ దాటితే ఎఫెక్ట్ చూపుతుంది.

సాదారణంగా ఉప్పనేది 40% సోడియం, మరియు 60% క్లోరైడ్‌తో తయారవుతుంది. సోడియం కండరాల, మరియు నరాల పనితీరుకు అవసరమైన ఖనిజం. దీనిని క్లోరైడ్‌తో కలిపి తీసుకొన్నప్పుడు, శరీరం సరైన నీరు, మరియు మినరల్ బ్యాలెన్స్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది.

శరీరానికి అవసరమైన దానికంటే అధికంగా ఉప్పును తింటే… అది మీ శరీరాన్ని తీవ్ర ప్రమాదంలో పడేస్తుంది. ఎప్పుడైతే శరీరంలో ఉప్పు ఎక్కువవుతుందో… అప్పుడు పలు సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తపోటు:

ఉప్పు అధికంగా ఉండే ఆహారం మీ రక్త నాళాలు, మరియు ధమనుల ద్వారా ప్రవహించే రక్తం యొక్క పరిమాణాన్ని పెంచేలా చేస్తుంది. ఇది రక్తపోటు పెరుగుదలకు దారితీయవచ్చు.

గుండెపోటు:

ఉప్పు ఎక్కువగా తీసుకోవటం వల్ల బ్లడ్ ఫ్లోయింగ్ పెరిగి… గుండె వేగంగా కొట్టుకోవటం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గుండె వేగం పెరుగుతుందో… అప్పుడది గుండె పోటుకు దారితీస్తుంది.

కిడ్నీ సమస్యలు:

టూమచ్ సాల్ట్ వల్ల కిడ్నీస్ లో సోడియం క్లోరైడ్ ఎక్కువగా పేరుకుపోతుంది. దీంతో కిడ్నీ దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదు.

కడుపు క్యాన్సర్:

ఉప్పు ఎక్కువగా తీసుకునే వారికి కడుపులో సోడియం క్లోరైడ్ నిల్వలు ఏర్పడి… కడుపు పూత, లేదా వాపు వంటివి ఏర్పడి చివరికి అది కడుపు క్యాన్సర్‌కు దారితీస్తుంది.

కంటి సమస్యలు:

ఉప్పు ఎక్కువగా తీసుకునే వారిలో కంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.

మానసిక సమస్యలు:

శరీరంలో సోడియం నిల్వలు ఎక్కువైతే దాని ప్రభావం మెదడుపై పడుతుంది. దీనివల్ల మానసిక సమస్యలు తలెత్తుతాయి.

తరచు మూత్రవిసర్జన:

తరచుగా మూత్రవిసర్జనకి వెళ్ళటం అనేది ఉప్పును ఎక్కువగా తీసుకుంటున్నారనడానికి సంకేతం. మూత్ర విసర్జన చేయడానికి ఎక్కువ సమయం కేటాయించినా… లేక

నిరంతర దాహం:

ఉప్పు ఎక్కువగా తీసుకొన్నట్లితే… తరచూ దాహం వేస్తుంది. సోడియం కంటెంట్ ఉన్న ఆహారాలు శరీర సమతుల్యతను దెబ్బతీస్తాయి. దీన్ని భర్తీ చేయడానికి నీరు ఎక్కువగా తాగాలి.

శరీరంలో వాపు:

మితిమీరి ఉప్పు తినటం వల్ల శరీరంలోని వివిధ భాగాల్లో వాపు వస్తుంది. ఈ వాపు ముఖ్యంగా వేళ్లు, చీలమండల చుట్టూ వస్తుంది. శరీరంలో అదనపు ద్రవం స్టోర్ అయి ఉండటం వల్ల ఈ వాపు ఏర్పడుతుంది. దీనిని ‘ఎడెమా’ తరచు తలనొప్పి:

తరచుగా తేలికపాటి తలనొప్పి వస్తున్నట్లితే అది ఉప్ప ప్రభావమే! డీహైడ్రేషన్ వల్ల ఈ తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. ఈ నొప్పి నుంచి విముక్తి పొందాలంటే… నీరు ఎక్కువగా తాగాలి.

ముగింపు:

తినే ఆహారంలో రోజువారీ ఉప్పును 2,300 మి.గ్రా కంటే తక్కువకు పరిమితం చేయడం మంచిది. అలాగే, పుష్కలంగా నీరు త్రాగడం, మరియు పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ద్వారా కూడా అధిక ఉప్పు వినియోగం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు.

Leave a Comment