హైపో టెన్షన్ లక్షణాలు ఏమిటి?

బీపీ అనేది ఈరోజుల్లో అందరికీ కామన్ గా వస్తున్న సమస్య. దీనిని విస్మరిస్తే ప్రాణానికే ప్రమాదం. సాదారణంగా ఎక్కువ రక్తపోటును వైద్య పరిభాషలో ‘హైపర్ టెన్షన్’ అంటారు. తక్కువ రక్తపోటును ‘హైపోటెన్షన్’ అంటారు. దీనినే ‘లోబీపీ’, లేదా ‘లో బ్లడ్ ప్రెజర్’ అనికూడా అంటారు.

నిజానికి ఈ హైపోటెన్షన్ ని చాలావరకు గుర్తించలేరు. దాని తాలూకు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభించినా… ఒక నిర్ధారణకి రాలేరు. అందుకే తక్కువ రక్తపోటు కొన్నిసార్లు అత్యవసర పరిస్థితులకు దారితీస్తుంది. 

ఇదికూడా చదవండి: హైపర్‌టెన్షన్‌ ని కంట్రోల్‌లో ఉంచే బెస్ట్ స్లీపింగ్ పొజిషన్ ఇదే!

Patient with chest pain showing second heart attack risk and prevention
రెండవ గుండెపోటు ప్రమాదం ఎందుకు రిస్క్ ఎక్కువ?

హైపోటెన్షన్ లక్షణాలు:

  • మైకము కమ్మటం 
  • ఏకాగ్రత లోపించడం
  • మూర్ఛ పోవటం 
  • వాంతులు, వికారం, తల తిరగటం 
  • డీహైడ్రేషన్
  • డిప్రెషన్ 
  • దృష్టి కోల్పోవడం 
  • చర్మం లేత నీలం రంగులోకి మారడం
  • త్వరగా శ్వాస తీసుకోవడం
  • స్పృహ కోల్పోవడం

హైపోటెన్షన్ ఎప్పుడు ప్రమాదకరం?

నిజానికి బీపీ కొద్దిగా తగ్గినా… పైకి ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే దీనిపై ఎవరూ దృష్టి పెట్టరు. అయితే, పైన మనం చెప్పుకొన్న లక్షణాలలో ఏవి కనిపించినా మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. లేదంటే తర్వాత పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కలగవచ్చు.

ఇదికూడా చదవండి: ఎంతోమందిని బాధిస్తున్న ఈ రెండు జబ్బులకి… సింపుల్ గా ఇలా చెక్ పెట్టండి!

హైపోటెన్షన్ ఎందుకు వస్తుంది?

  • శరీరంలో రక్తం లేకపోవడం
  • భారీగా రక్తస్రావం జరగటం 
  • గుండె సమస్యలు ఉన్నప్పుడు 
  • మధుమేహం కలిగినప్పుడు 
  • గర్భధారణ సమయంలో శరీరంలో మార్పులు వచ్చినప్పుడు 
  • డీహైడ్రేషన్ సమస్య ఉన్నప్పుడు
  • విటమిన్లు, పోషకాలు తగ్గినప్పుడు 
  • తీవ్రమైన వ్యాధి, లేదా వైరస్ సంక్రమించినప్పుడు 
  • కొన్ని మందుల దుష్ప్రభావం వల్ల 

రక్తపోటు పరిధి ఎంత?

రక్తపోటు పరిధి 120/80 (mm Hg) ఉండాలి. దాన్ని ‘నార్మల్  బ్లడ్ ప్రెజర్’ గా పరిగణిస్తారు. అలాకాకుండా 90/60 (mm Hg) కంటే తక్కువగా ఉంటే దాన్ని ‘లో బ్లడ్ ప్రెజర్’ లేదా ‘హైపోటెన్షన్’ గా పరిగణిస్తారు. ఇంకా 130/90 (mm Hg) అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ‘హై బ్లడ్ ప్రెజర్’  లేదా ‘హైపర్ టెన్షన్’ గా పరిగణిస్తారు. 

A close-up of a person sneezing in a doctor's office, a visual representation of respiratory infection symptoms.
శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు: లక్షణాలు, కారణాలు, చికిత్స మరియు నివారణా మార్గాలు

డిస్క్లైమర్:

ఇదంతా కేవలం మీ అవగాహన కోసం మాత్రమే! అత్యవసర పరిస్థితుల్లో వైద్యుడ్ని సంప్రదించటం మర్చిపోకండి. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment