మైయోసైటిస్‌ ఏ విధమైన వ్యాధి?

సమంత రూత్ ప్రభు తాను మైయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్నట్లు వచ్చిన వార్తతో సౌత్ ఇండియన్స్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వెంటనే మైయోసైటిస్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? అని గూగుల్ లో సెర్చ్ చేయటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అసలు మైయోసైటిస్ అంటే ఏమిటి? ఇది ఎన్ని రకాలు? ఈ వ్యాధి లక్షణాలు, కారణాలు, ఈ వ్యాధిలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి?  ఎలా డయాగ్నోస్ చేయాలి? ఏ విధమైన ట్రీట్మెంట్ అవసరమవుతుంది? వంటి వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

మైయోసిటిస్ అంటే ఏమిటి?

మైయోసైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. దీని వలన ఇమ్యూనిటీ అనేది తన స్వంత కణజాలాలపైనే పొరపాటుగా దాడి చేస్తుంది. ఇలా జరిగినప్పుడు కండరాలలో వాపులు ఏర్పడటం, బలహీనంగా మారటం, దద్దర్లు రావడం వంటివి జరుగుతాయి. రోజు రోజుకీ దీని తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది.

మైయోసైటిస్‌ రకాలు:

ఇమ్యూనిటీని దెబ్బతీసే ఈ మైయోసైటిస్ 5 రకాల రూపాల్లో వస్తుంది. అవి: 

 1. పాలిమయోసైటిస్‌:

దీనివలన చిన్న చిన్న పనులకే నీరసపడిపోతారు. కండరాలు భరించలేనంత నొప్పిపెడతాయి. ఏ కొద్ది దూరం నడిచినా వెంటనే అలసిపోతారు. ఒక్కోసారి అదుపు తప్పి కిందపడిపోతారు కూడా. 

 1. డెర్మటోమయోసైటిస్‌:

దీనివలన కండరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. ఇంకా కనురెప్పలపై ఊదా, లేదా ఎర్రరంగు మచ్చలు ఏర్పడతాయి. కళ్లు ఉబ్బుతాయి. ఎండలోకి వెళ్తే ముఖం ఎర్రగా కందిపోతుంది. సూర్యరశ్మిలో ఉండే ఆల్ట్రా వయోలేట్ కిరణాల ప్రభావం వల్ల ఈ రకమైన స్థితి నెలకొంటుంది. ఎక్కువగా మహిళలు, చిన్నారుల్లోనే ఈ సమస్య కనిపిస్తుంటుంది. 

 1. టాక్సిక్ మయోసైటిస్:  

దీనివలన శరీర మధ్యస్థ భాగాల్లో ఉండే కండరాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మోచేతులు, భుజాలు, మెడ వెనుక భాగం, నడుము, తొడలలో నొప్పి ఉంటుంది. 

 1. ఇన్‌క్లూజన్‌ బాడీ మయోసైటిస్‌:

దీనివలన ముంజేతి కండరాలు, మోకాలి కింద కండరాలు, తొడ కండరాలు పట్టేసి నొప్పిగా అనిపిస్తాయి. నీరసంగా అనిపిస్తుంటుంది. 50 సంవత్సరాలు పైబడిన వారిలో ఇలాంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. 

 1. జువెనైల్‌ ఫామ్స్‌ ఆఫ్‌ మయోసైటిస్‌:

దీనివలన కలిగే ప్రభావం ఎక్కువగా పిల్లల్లో, యుక్తవయసు వాళ్లలో ఉంటుంది.  

మైయోసైటిస్‌ లక్షణాలు:

 • కండరాల బలహీనత
 • డిప్రెషన్
 • అలసట
 • ఆహారం మింగటంలో ఇబ్బంది
 • శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది 
 • కూర్చోవడంలో ఇబ్బంది

మైయోసైటిస్‌ రావడానికి కారణాలు:

 • ఏ కారణం లేకుండా రావచ్చు.
 • దగ్గు, జలుబు, ఫ్లూ, హెచ్‌ఐవి వంటి వైరస్‌ల వలన రావచ్చు.
 • గాయం, లేదా ఇన్ఫెక్షన్ వలన కూడా తలెత్తవచ్చు.
 • ఆల్కహాల్, కొకైన్ వంటివి తీసుకోవడం వలన వచ్చే ఛాన్స్ వుంది.
 • కొన్ని రకాల కార్డియో వాస్కులర్ మెడిసిన్స్ వలన కూడా తలెత్తే అవకాశం వుంది. 
 • మెడిసిన్ రియాక్షన్ (డ్రగ్ టాక్సిసిటీ) వలన కూడా ఇది రావటానికి అవకాశం ఎక్కువ.  

మైయోసైటిస్‌ స్టేజెస్:

 • ఈ వ్యాధి సోకినప్పుడు మొదట నడవడం కష్టంగా అనిపిస్తుంది.
 • కూర్చున్న చోట నుండి లేవడం కూడా కష్టంగానే ఉంటుంది. 
 • ఏ కొద్దిపాటి మెట్లు ఎక్కాలన్నా కష్టంగా ఉంటుంది.
 • పడుకున్నప్పుడు ఎటు తిరిగినా నొప్పి కలుగుతుంది.
 • చివరికి వస్తువులను ఎత్తడంలోనూ కష్టంగానే ఉంటుంది. 

మైయోసైటిస్‌ కాంప్లికేషన్స్:

 • కండరాలు పూర్తిగా బలహీనంగా మారతాయి. అందువల్ల కొన్నిసార్లు ఔషధ చికిత్సలు పూర్తిగా పని చేయవు. 
 • అరుదైన సందర్భాల్లో గుండె బలహీనపడటానికి కూడా కారణం కావచ్చు.
 • ఊపిరితిత్తులలో మంట ఉన్నట్లయితే, ఇది ఊపిరితిత్తుల పనితీరుని ప్రభావితం చేస్తుంది. ఈ కారణంగా ఇది మచ్చలను కలిగిస్తుంది. 
 • అరుదైన సందర్భాల్లో ఇది క్యాన్సర్‌తో సంబంధం కలిగి ఉంటుంది.

మైయోసైటిస్‌ డయాగ్నోసిస్:

 • మైయోసిటిస్ ఉన్నట్లు ఖచ్చితంగా నిరూపించగల ఏ ఒక్క పరీక్ష లేదు. 
 • మీ లక్షణాల గురించి  డాక్టర్ కి వివరించాలి. వారి సూచన మేరకు టెస్టులు చేయించుకోవాలి.
 • ఈ వ్యాధి యొక్క లక్షణాలు అనేక ఇతర వ్యాధుల లక్షణాలకు సమానంగా ఉన్నందున మీరు బహుశా రక్త పరీక్షలు, మరియు ఇతర పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. 

మైయోసైటిస్‌ ట్రీట్మెంట్:

 • ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ
 • ఫిజియోథెరపీ
 • బయోలాజికల్ థెరపీ
 • స్టెరాయిడ్స్‌ ట్రీట్మెంట్ 
 • యాంటీ-రుమాటిక్ డ్రగ్స్  ట్రీట్మెంట్ 
 • DMARD సైక్లోఫాస్ఫామైడ్

డిస్క్లైమర్:

ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే! నిజంగా సమస్య కలిగినప్పుడు డాక్టర్ ని సంప్రదించటం బెటర్. అంతకు మించి healthyfabs ఎటువంటి బాధ్యత వహించదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay in Touch

To follow the best weight loss journeys, success stories and inspirational interviews with the industry's top coaches and specialists. Start changing your life today!

spot_img

Related Articles