ఎంతోమందిని బాధిస్తున్న ఈ రెండు జబ్బులకి… సింపుల్ గా ఇలా చెక్ పెట్టండి!

ఇటీవలి కాలంలో చాలామందిని బాధిస్తున్న జబ్బులు రెండే రెండు. అవి ఒకటి బ్లడ్ షుగర్ అయితే, రెండవది బ్లడ్ ప్రెషర్. ఇవి రెండూ కూడా మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అంతటితో ఆగకుండా అనేక ఇతర జబ్బులకు కారణమవుతున్నాయి. వీటిని సకాలంలో గుర్తించి, సరైన జాగ్రత్తలు పాటించకపోతే, చివరికి ప్రాణాంతకంగా మారుతున్నాయి.

దీనంతటికీ కారణం మనిషి జీవన విదానమే! ముఖ్యంగా ఈ జనరేషన్‌లో మారుతున్న ఆహార అలవాట్లు, సరైన వ్యాయామం లేకపోవటమే అన్ని జబ్బులకి కారణమవుతున్నాయి. అయితే, మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే, వీటినుండీ బయటపడొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

సరైన వ్యాయామమూ లేక, సరైన ఆహారమూ లేక, ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఇదిగో… ఇలాంటి అనారోగ్యాలే చుట్టుముడుతూ ఉంటాయి. ఈ జనరేషన్ పిల్లలంతా ఎలక్ట్రానిక్‌ డివైజ్ లకి అడిక్ట్ అయిపోయి… ఫిజికల్ ఎక్సర్ సైజ్ కి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అందుకే, చిన్న వయసులోనే దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు.

వీలైనంత వరకూ వాటిని పక్కనపెట్టి, ఆటలవైపు వారిని మళ్ళించేలా పెద్దవారు జాగ్రత్త పడాలి. అలాగే, పెద్దవాళ్లు కూడా రోజూ యోగా చేయటం అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉండడానికి, వ్యాధులు దరి చేరకుండా ఉండటానికి రోజు 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయమం చేయడం తప్పనిసరి. ప్రతి రోజు వాకింగ్‌ అలవాటు చేసుకోవడం కూడా ఎంతో మంచిది. రోజుకి కనీసం 40 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోవాలి.

తగిన వ్యాయామం ఉంటే, షుగర్ దరిచేరదు, గుండె సమస్యలూ రావు. శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది.

  • ఉప్పును తక్కువ తీసుకోవాలి:

సమస్యలన్నిటికీ మూలం ఉప్పే. రోజూ మనం తినే ఆహార పదార్దాలలో… ఉప్పులేని పదార్ధమంటూ ఉండదు. అయితే, అది తక్కువ మోతాదులో అంటే… 2300 మిల్లీ గ్రాములకంటే తక్కువ తీసుకుంటే పర్లేదు కానీ, ఎక్కువ తీసుకుంటే రక్తపోటు ఏర్పడే అవకాశం ఉంది.

అధిక రక్తపోటు సోడియంతో ముడిపడి ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. రోజువారీ ఆహారపదార్ధాలలో ఉప్పును తక్కువగా తీసుకోవటం వల్ల హై బ్లడ్ ప్రెషర్ ని తగ్గించవచ్చు.

ఇక సుమారు రోజుకు 2,800 మిల్లీ గ్రాములు, అంతకంటే ఎక్కువ తీసుకునేవారిలో చెక్కర వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ.

ఉప్పు ద్వారా శరీరంలోకి చేరే సోడియం ఇన్సులిన్‌ను నిరోధిస్తుంది. ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుంది. ఈ డయాబెటిస్‌ ద్వారా బీపీ వచ్చే అవకాశం ఉంది.

  • పోటాషియం ఎక్కువగా తీసుకోవాలి:

హైబీపీతో బాధపడుతున్నవారికి పోటాషియం అనేది ఒక ముఖ్యమైన పోషకం. ఆహారంలో పోటాషియం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిని తగ్గించవచ్చు. ప్రాసెస్‌ చేయబడిన, ప్యాక్‌ చేయబడిన ఆహారాలలో సోడియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. అందుకే, ఆహారాన్ని సమతుల్యం చేయడానికి పోటాషియం నిల్వలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఆకు కూరలు, టమోటాలు, బంగాళ దుంపలు, చిలగడ దుంపలు, అరటి, అవకాడో, నారిజం, నట్స్‌, పాలు, పెరుగు వంటి వాటిలో ఈ పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

  • స్మోకింగ్ మానేయాలి:

ధూమపానం, మద్యపానం వంటివి అధిక రక్తపోటు ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. ఆల్కహాల్ సేవించటం వల్ల అధిక రక్తపోటు 16% వరకూ పెరిగే ప్రమాదముంది. స్మోకింగ్, మరియు డ్రింకింగ్ వల్ల రక్తనాళాలు పూర్తిగా దెబ్బ తింటాయి. అందుకే ఈ రెండింటికి దూరంగా ఉండటం ఎంతో మంచిది.

  • ఒత్తిడిని తగ్గించుకోవాలి:

అధిక వత్తిడి కూడా అనేక రుగ్మతలకి మూలం. అందుకే వీలైనంత వరకూ వత్తిడిని తగ్గించుకొనే ప్రయత్నం చేయాలి. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువవుతుంది. ఫలితం హైపర్ టెన్షన్ కి దారి తీస్తుంది.

మానసిక వత్తిడి పెరిగినప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇదే కంటిన్యూ అయితే డయాబెటీస్ కి కారణం అవుతుంది. అందుకే వీలైనంత వరకూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

పై జాగ్రత్తలు అన్నీ తీసుకున్నట్లయితే, క్రానిక్ డిసీజెస్ అయిన హైపర్ టెన్షన్, మరియు హై బ్లడ్ ప్రెషర్ కి సింపుల్ గా చెక్ పెట్టేయెచ్చు.

Leave a Comment