మీల్ మేకర్‌ ని అదేపనిగా లాగించేస్తున్నారా..! అయితే జరిగే అనర్ధాలు ఇవే!

మీల్ మేకర్ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరుంటారు చెప్పండి! ఇటీవలి కాలంలో మనమంతా ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటు పడి పోయాం. స్పైసీ నెస్ ని ఎక్కువగా కోరుకుంటున్నాం. అలాంటప్పుడు అటు ప్రోటీన్ తో పాటు, ఇటు స్పైసీ నెస్ కూడా ఒకే దాంట్లో లభిస్తుంటే ఇంకేం కావాలి. 

రొటీన్ డైట్‌లో మీల్ మేకర్ ని చేర్చుకోవడం ద్వారా కొంత మేరకు మీ శరీర అవసరాలను తీర్చుకోవచ్చు. ఎలాగంటే, మీల్ మేకర్ ఓ ప్రోటీన్ నిధి.  ప్రోటీన్ నిధి మాత్రమే కాదు… ఖనిజాల గని అని కూడా చెప్పుకోవచ్చు.  ఇందులో అనేక రకాల ప్రోటీన్లతో పాటు, ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ వంటి మినరల్స్ కూడా ఉన్నాయి.

Digital illustration showing a person walking after eating to reduce heart attack risk
భోజనం తర్వాత 15 నిమిషాల వాకింగ్ గుండెపోటుని తగ్గిస్తుందా?

అటువంటప్పుడు దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి మరింత మేలు చేకూరుతుంది. కానీ మేలు చేస్తుంది కదా అని దానిని అదేపనిగా తింటే హాని కూడా చేస్తుంది. అయితే ముందుగా ‘సోయా చంక్స్’ అని పిలవబడే ఈ మీల్ మేకర్ ని మితంగా తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో… అతిగా తింటే కలిగే అనర్ధాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి.

మీల్ మేకర్ ని మితంగా తింటే కలిగే ప్రయోజనాలు:

  • మీల్ మేకర్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుచే వీటిని తింటే ఫిట్‌గా ఉంటారు.
  • వీటిని తింటే బరువు తగ్గడం, క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు, బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధులు దరిచేరవు.

మీల్ మేకర్ ని అతిగా తింటే కలిగే నష్టాలు:

  • మీల్ మేకర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈస్ట్రోజెన్ హార్మోన్, మరియు యూరిక్ యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. అలాగే దీనివల్ల ఒత్తిడి, నిద్రలేమి, పీరియడ్స్ లో ఇబ్బందులు ఎదురవుతాయి.
  • మధుమేహులు తమ రోజువారీ ఆహారంలో వీటిని తీసుకోకపోవటమే మంచిది. 
  • ముఖ్యంగా మహిళలు వీటిని వీలైనంత తక్కువగా తీసుకొంటే మంచిది.
  • నెలసరిలో నొప్పి, మరియు అధిక రక్తస్రావం ఉన్నవారు వీటిని తినకూడదు.
  • మహిళల్లో హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ అవుతుంది. 
  • వీటిని తినడం వల్ల పురుషుల్లో లైంగిక శక్తి తగ్గుతుంది.
  • అలాగే మేల్ హార్మోన్లు, లిబిడో పవర్, స్పెర్మ్ కౌంట్,  సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. 

చివరిమాట:

మీల్ మేకర్ ఎంతో రుచికరమే అయినా… వాటి దుష్ప్రభావాలని కూడా దృష్టిలో ఉంచుకొని తీసుకోవాలి. మితిమీరి తీసుకొనే ఏ డైట్ అయినా అనర్ధదాయకమే!

Eating carrots daily reduces cancer risk and improves blood health
క్యారెట్ తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందా?

డిస్క్లైమర్:

ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment