విటమిన్‌ డి ఓవర్‌డోస్ అయితే ఏం జరుగుతుందో తెలుసా!

మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పోషకాలలో విటమిన్ డి కూడా ఒకటి. ఇది ఇమ్యూనిటీని పెంచటంతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచీ కాపాడుతుంది. అయితే ఇది అవసరానికి మించి ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే!

విటమిన్ డి ఓవర్‌డోస్‌ అయితే ఎన్నో ఇబ్బందులకి దారితీస్తుంది. ఇంకా వివిధ వ్యాధులకు కూడా కారణమవుతుంది. ఈ క్రమంలో శరీరంలో విటమిన్ డి మోతాదుని మించితే ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వాంతులు:

బాడీలో విటమిన్ డి డోస్ పెరిగితే కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. ఇంకా మలబద్ధకానికి కూడా దారితీస్తుంది. అలాంటి సందర్భంలో వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఆకలి లేకపోవడం:

విటమిన్ డి కోసం ఇష్టానుసారంగా సప్లిమెంట్లను వాడటం కొందరికి అలవాటు. దానివల్ల శరీరంలో దాని మోతాదు పెరిగిపోతుంది. ఫలితంగా ఆకలి మందగిస్తుంది.

మానసిక అనారోగ్యం:

పరిమితికి మించి విటమిన్ డి తీసుకుంటే అనేక మానసిక వ్యాధులను ఎదుర్కొనవలసి వస్తుంది. ఉదాహరణకి ఒత్తిడి, ఆందోళన, విసుగు, విరక్తి, ఇంకా తలనొప్పి వంటివి కూడా కలుగుతాయి.

హైపర్ కాల్సేమియా:

శరీరానికి కాల్షియం అవసరమే! ఇది విటమిన్ డి వల్ల ఎక్కువగా లభిస్తుంది. కానీ అదే విటమిన్ డి ఎక్కువైతే కాల్షియం లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయి హైపర్కాల్సెమియాకు దారి తీస్తుంది.

కిడ్నీ సమస్యలు:

శరీరంలో విటమిన్ డి అధికంగా ఉంటే ఎక్కువగా దాహం వేస్తుంది. తరచూ మూత్ర విసర్జన జరుగుతుంటుంది. ఫలితంగా ఇది కిడ్నీ సమస్యలకు దారి తీస్తుంది.

చివరిమాట:

మారుతున్న జీవనశైలి, ఆహార నియమాలవల్ల సూర్యరశ్మిలో తగినంత సమయం గడపకపోలేక పోతున్నారు. అందుకే చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఫలితంగా సప్లిమెంట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. వైద్యులు కూడా వీటినే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. కొందరైతే వైద్యులు సూచించకపోయినా స్వతహాగానే వీటిని వాడున్నారు. ఇది అనేక అనర్దాలకి దారితీస్తుంది.

విటమిన్ డి లోపాన్ని సూర్యకాంతి వంటి సహజ పద్ధతుల ద్వారానే భర్తీ చేయడానికి ప్రయత్నించాలి. అది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇంకా మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. అలా కాకుండా సప్లిమెంట్స్ రూపంలో తీసుకొంటే ఒక్కోసారి అది మోతాదుకు మించి చనిపోయిన వారు కూడా లేకపోలేదు.

డిస్క్లైమర్:

ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment