కోవిడ్‌ తెస్తున్న కొత్త సమస్య.. ముఖ అంధత్వం..! లక్షణాలు ఇవే!!

కోవిడ్‌ వచ్చి పోయి నాలుగేళ్లు గడుస్తున్నా… దాని తాలూకు లక్షణాలు మాత్రం ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే నేటికీ ప్రజలు మరణ భయంతో బతికేస్తున్నారు. క‌రోనా వైర‌స్ చిన్నదే కావొచ్చు; కానీ అది తెచ్చిన విపత్తు మాత్రం చాలా పెద్దది.

కోవిడ్ సంక్రమణ తర్వాత అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి. మొదట్లో ఇన్ఫెక్షన్ సోకగానే రుచి, వాసన మాత్రమే తెలిసేది కాదు. ఆ తర్వాత అలసట, బిపి, శ్వాసకోశ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, మెదడు సంబంధిత సమస్యలు, రక్తంలో ప్లేట్లెట్లు పడిపోవటం ఇలా అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు.

ఈ లిస్టులో తాజాగా ఇప్పుడు మరో వ్యాధి కూడా వచ్చిచేరింది. అదే ‘ముఖ అంధత్వం’. దీర్ఘకాలిక కోవిడ్‌తో బాధపడుతున్న వ్యక్తులకి ఇది సంక్రమిస్తుంది. ముఖ అంధత్వం కారణంగా ఎవ్వరినీ గుర్తుపట్టలేరు. ఈ పరిస్థితి ఎంతగా దిగజారి పోతుందంటే… ఒకానొక దశలో సన్నిహితులని సైతం గుర్తించలేరు.

ముఖ అంధత్వం అంటే ఏమిటి?

ఈ సమస్య వస్తే ఎవ్వరినీ గుర్తుపట్టలేరు. ఇదో నాడీ సంబంధిత రుగ్మత. ఈ వ్యాధిలో ముఖాలను గుర్తించే తీరు, వేరు చేసే సామర్థ్యం దెబ్బతింటుంది. బాధిత వ్యక్తులు తమ స్నేహితులను, ప్రియమైన వారిని, చివరికి కుటుంబ సభ్యులను కూడా గుర్తించడం కష్టమవుతుంది. మెడికల్ టెర్మినాలజీ ప్రకారం దీనిని “ప్రోసోపాగ్నోసియా” లేదా “ఫేస్ బ్లైండ్‌నెస్” అని కూడా అంటారు.

లక్షణాలు:

  • వాస్తవ దృష్టితో దీనికి సంబంధం లేదు.
  • ఒక వ్యక్తి ముఖాన్ని స్పష్టంగా చూడలేరు.
  • ఒకవేళ చూసినా మొదటి చూపులో వారు ఎవరో అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.

చివరిమాట:

దీర్ఘకాలిక కోవిడ్‌తో బాధపడుతున్న వ్యక్తులు ఈ తరహా సమస్యలనే ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కరోనా వైరస్ మరోమారు విజృంభిస్తోంది. అందుకే దాని బారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మనంకూడా వీలైనంతవరకూ జాగ్రత్తలు తీసుకొంటే మంచిది.

డిస్క్లైమర్:

ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment