మడమలు పగుళ్ళు చిటికెలో పోగొట్టే చిట్కాలు

సీజన్ తో సంబందం లేకుండా అన్ని సీజన్లలోనూ ఇబ్బంది పెట్టే సమస్య ఒకే ఒక్కటి. అదే మడమలు పగుళ్లు. ఇది ఆడా… మగా… పిల్లా… పెద్ద… అనే తేడా లేకుండా అందరినీ బాదిస్తుంది. నిజానికి ఇది సమస్యే కాదు, పాదాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్లే అవి పగులుతుంటాయి. అలా పగిలిన మడమల పగుళ్లలో ఇరుక్కున్న దుమ్మును ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటే చాలు త్వరగా ఈ సమస్య తగ్గిపోతుంది.

అయితే చాలా మంది ఈ సమస్య వచ్చినప్పుడు రకరకాల క్రీములు, ఆయింట్మెంట్లు వాడుతుంటారు. కానీ, పాదాలలో ఆయిల్ కంటెంట్ తగ్గినప్పుడు చర్మం పొడిబారుతుంది. దీనివల్ల మడమల పగుళ్లు ఏర్పడతాయి. అయితే ఇంట్లోనే కొన్ని సింపుల్ చిట్కాలు ఉపయోగించి దీనిని తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె లేదా ఏ ఇతర నూనెలతోనైనా సరే మీ పాదాలను మసాజ్ చేయడం వల్ల పాదాలు శుభ్రంగా ఉండటమే కాకుండా మడమలపై ఏర్పడిన పగుళ్ళు కూడా తగ్గిపోతాయి. ఎప్పుడైతే పాదాలు శుభ్రంగా ఉంటాయో… అప్పుడు పగుళ్లు వచ్చే అవకాశం కూడా తక్కువ.

కలబంద:

మడమల పగుళ్ళపై కలబందని అప్లై చేసినట్లైతే… అది మడమల్లో ఉండే తేమ తగ్గకుండా కాపాడుతుంది. దీనివల్ల పగుళ్ళు తగ్గుతాయి.

నిమ్మరసం:

వారానికి మూడు లేదా నాలుగు సార్లు నిమ్మరసాన్ని పాదాలకు అప్లై చేసి… బాగా మసాజ్ చేస్తే… పాదాల పగుళ్లు తొందరగా తగ్గిపోతాయి.

బేకింగ్ సోడా:

గోరువెచ్చని నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలిపి ఆ నీటిలో మీ పాదాలను 15 నిమిషాలు నానబెట్టండి. ఇలా వారానికి రెండు, లేదా మూడు సార్లు ప్రయత్నిస్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది.

ఉప్పు:

ఉప్పు పాదాల పగుళ్లకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం గోరువెచ్చని నీటిని తీసుకొని, అందులో కొద్దిగా ఉప్పు వేసి, ఆ నీటిలో మీ పాదాలను నానబెట్టండి. సుమారు 20 నిమిషాల వరకు ఇలా చేయడంవల్ల కూడా పాదాల పగుళ్లు తొందరగా నయమవుతాయి.

గోరువెచ్చని నీరు:

గోరువెచ్చని నీటిలో ఉప్పు, మరియు నిమ్మరసం కలిపి అందులో మీ పాదాలను డిప్ చేయండి. కొద్దిసేపటి తర్వాత నిమ్మరసాన్ని పాదాలకు రుద్ది క్లీన్ చేయండి. దీనివల్ల మడమల పగుళ్ళు మటుమాయం అవుతాయి.

షాంపూ:

గోరువెచ్చని నీటిలో షాంపూ, మరియు నిమ్మరసం కలిపి మీ పాదాలను అందులో ముంచండి. 30 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి. 15 డేస్ కి ఒకసారి అయినా ఇలా ప్రయత్నించి చూడండి.

తేనె:

అర బకెట్ వేడి నీటిలో ఒక కప్పు తేనెను కలపండి. అందులో 10-20 నిమిషాలపాటు మీ పాదాలను నానబెట్టండి. పాదాల పగుళ్లను పోగొట్టడానికి ఇదో సింపుల్ రెమెడీ.

చివరిమాట:

మడమల పగుళ్లును నిర్వహించడం చాలా కష్టం. ప్రత్యేకించి మీరు పొడి వాతావరణంలో నివసిస్తుంటే, ఖచ్చితంగా మదమల పగుళ్లు ఏర్పడతాయి. ఇంకా పోషకాహార లోపం, మధుమేహం, లేదా ఇతర చర్మ సంబందమైన కారణాలవల్ల కూడా ఇవి ఏర్పడవచ్చు. అందుకే మడమలు ఎండిపోయి… గట్టిపడినట్లు అనిపించినప్పుడు వాటి గురించి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. మడమలని కడగడం, మాయిశ్చరైజింగ్ చేయడం, మరియు సాక్స్ ధరించడం వంటివి చేయటం ద్వారా వాటిని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఇంకా పైన చెప్పిన కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా కూడా మడమల పగుళ్లను నివారించవచ్చు. ఇవేవీ పని చేయకపోతే, అప్పుడు వైద్యుడిని సందర్శించి వారి సలహాలు, సూచనలు తీసుకోవాలి.

డిస్క్లైమర్:

ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment