మీరు ఫాస్ట్ గా బరువు తగ్గాలనుకుంటే… ఈ 5 సింపుల్ టిప్స్ పాటించండి!

బరువు పెరగటం అనేది చాలా స్పీడ్ గా జరిగే ప్రాసెస్; కానీ తగ్గటం మాత్రం చాలా స్లోగా జరిగే ప్రాసెస్. ఒబేసిటీని కంట్రోల్ చేయటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డైట్ కంట్రోల్ చేస్తుంటారు. గంటల తరబడి  జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుంటారు. అయినప్పటికీ కోరుకున్న శరీరాన్ని మాత్రం పొందలేరు. ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయుల సంఖ్య రోజు రోజుకీ పెరిగి పోతుంది. ఈ క్రమంలో దీనిని అదుపుచేయటం చాలా ముఖ్యం.

నిజానికి ఓవర్ వెయిట్ సమస్య ఒక్కటే కాదు, దాంతోపాటు డయాబెటీస్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ వంటి అనేకే ఇతర క్రానిక్ డిసీజెస్ కూడా చుట్టుముడతాయి. వీటి కారణంగా కిడ్నీ, లివర్, బ్రెయిన్, హార్ట్ కి సంబందించిన సమస్యలు వస్తాయి. ఒకానొక దశలో అధిక బరువు వల్ల నడవడం కూడా కష్టతరమవుతుంది. మరి ఇన్ని సమస్యలకి మూలమైన ఈ స్థూలకాయాన్ని నియంత్రించాలనుకుంటే, కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తాగటం:

బరువు అదుపులోకి రావాలంటే ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తాగాలి. లెమన్ వాటర్ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. బరువును కూడా నియంత్రిస్తుంది. అంతేకాదు, బాడీ డిటాక్సిఫికేషన్ జరుగుతుంది.

llustration showing gut health and personalized nutrition with healthy foods and microbiome symbols
గట్ హెల్త్ సీక్రెట్: పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ తో హెల్త్ పవర్

భోజనానికి ముందు సలాడ్ తినటం:

భోజనానికి ముందు సలాడ్ తీసుకోవడం వల్ల ఆకలిని నియంత్రించడమే కాక, శరీరంలోని క్యాలరీలను కూడా తగ్గిస్తుంది. దీనివల్ల బరువు త్వరగా తగ్గుతారు. సలాడ్‌లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. దీంతో డైజేషన్ పెరుగుతుంది. సలాడ్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.

రాత్రిపూట రోటీ-రైస్ కాంబినేషన్ మానుకోవటం:

బరువు తగ్గాలనుకుంటే, డైట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందే! ఒక రోజులో ఎంత అన్నం తినాలి? ఎన్ని రోటీలు తినాలి? అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వీలైతే రోటీని పగటిపూట తినడానికి ప్రయత్నించండి. రాత్రిపూట కాదు. రాత్రిపూట రోటీ తినడం వల్ల డైజేషన్ దెబ్బతింటుంది. దీనివల్ల బరువు తగ్గకపోగా, ఊబకాయం పెరుగుతుంది.ఇంకా ఇది మీ నిద్రపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే రాత్రిపూట రోటీ-రైస్ కాంబినేషన్ మానుకోండి.

తిన్న 1 గంట తర్వాత నీరు త్రాగాలి:

కొందరికి ఆహారంతో పాటు నీళ్లు కూడా ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. ఆహారంతో పాటు నీటిని ఎక్కువగా తాగటం వల్ల అది మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. అంతేకాక ఊబకాయం కూడా పెరుగుతుంది. అందుకే ఆహారం తిన్న గంట తర్వాత నీరు తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఇంకా జీర్ణక్రియ కూడా సజావుగా ఉంటుంది.

llustration showing health risks of consuming too much instant noodles, including stomach bloating, weight gain, and poor nutrition**
నూడుల్స్ తినడం ఆరోగ్యానికి హానికరమా? 90% మందికి తెలియని నిజాలు!

ముగింపు: 

ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే రాయటం జరిగింది. అంతకుమించి https://healthyfabs.com ఎటువంటి బాధ్యతా వహించదు. సందేహాలు ఏవైనా ఉంటే… వైద్య నిపుణులను సంప్రదించటం మంచిది.

Leave a Comment