రోజూ మీకు బోర్లా పడుకునే అలవాటు ఉందా..! అయితే మీకీ సమస్యలు తప్పవు!

ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారంతోపాటు సరైన నిద్ర కూడా అవసరం. అయితే, ఆ నిద్రపోయే సమయంలో సరైన పొజిషన్‌ కూడా అవసరం. సరైన పొజిషన్ లో నిద్రించకపోతే… పలు ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నవాళ్ళం అవుతాం.

ప్రతీ ఒక్కరికీ రోజుకి 8 గంటలపాటు నిద్ర అవసరం అని సైన్స్ చెప్తుంది. అలా 8 గంటలపాటు నిద్రించినప్పటికీ పడుకొనే విధానం సరిగ్గా లేకపోతే ఆ నిద్ర వృధా!

పడుకొనే సమయంలో కొంతమంది వెల్లకిలా పడుకొంటే, ఇంకొంతమంది బోర్లా పడుకుంటారు. కొంతమంది లెఫ్ట్ సైడ్ కి తిరిగి పడుకొంటే, మరికొంతమంది రైట్ సైడ్ కి తిరిగి పడుకొంటారు. ఇలా పడుకొనే భంగిమ ఏదైనా సరే ఆరోగ్యకరమైన నిద్రని అందించ గలగాలి. లేదంటే ఆరోజంతా ఫ్రెష్ గా, ఎనర్జిటిక్ గా ఉండదు.

మిగతా భంగిమల్లో పడుకొనేవారి గురించి కొద్దిసేపు పక్కన పడితే, బోర్లా పడుకొనేవారు మాత్రం చాలా అనారోగ్య సమస్యలకి గురవుతారు. అవేంటంటే –

  • బోర్లా పడుకొన్నప్పుడు వారి శరీర బరువు మొత్తం కడుపుపై పడుతుంది. దీనివల్ల లేవగానే పొట్ట బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది.
  • ఇంకా పొట్టపై పడుకోవడం వల్ల వెన్నునొప్పి కూడా వస్తుంది. బోర్లా పడుకున్నప్పుడు వీపు భాగం కొద్దిగా పైకి ఎత్తినట్లు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ సేపు అలా బోర్లా పడుకోవడం వల్ల వెన్ను నొప్పి కూడా వచ్చే ఛాన్స్ ఉంది.
  • బోర్లా పడుకోవటం వల్ల ఆ ప్రభావం మన మెడపై చూపుతుంది. ఇది కాస్తా మెడ నొప్పికి దారితీస్తుంది.
  • బోర్లా పడుకోవటం వల్ల మొత్తం భారం ఉదరంపై పడి… అజీర్ణం, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలకి దారితీస్తుంది.
  • ముఖ్యంగా ఆహారం తిన్న వెంటనే ఇలా బోర్లా పడుకోకూడదు.
  • చిన్న పిల్లలు బోర్లా పడుకొని నిద్రిస్తే… అది వారి ఎత్తుపై ప్రభావం చూపుతుంది. పిల్లలు నిటారుగా పడుకోవటం వల్ల వారి శారీరక, మానసిక అభివృద్ధి వేగంగా ఉంటుంది. ఎత్తు కూడా వేగంగా పెరుగుతారు.

కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఎన్ని గంటలు నిద్రించాం అన్నది ముఖ్యం కాదు, ఏ పొజిషన్ లో నిద్రించాం అన్నదే ముఖ్యం. స్లీపింగ్ పొజిషన్ ని బట్టే మన మెంటల్ గ్రోత్ ఉంటుందని గుర్తించండి.

Leave a Comment