ఉదయాన్నే పరిగడుపున వెల్లుల్లి తింటే ఏం జరుగుతుందో తెలుసా!

ఔషధాల గని వెల్లుల్లి. ఇందులో అనేక మెడిసినల్ ప్రాపర్టీస్ తో పాటు, న్యూట్రిషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో విటమిన్ B1, B6, C తో పాటు… కాల్షియం, కాపర్, మాంగనీస్,సెలీనియం వంటి పోషకాలు కూడా దాగి ఉన్నాయి. ముఖ్యంగా వెల్లుల్లి అలిసిన్ అని పిలువబడే ఒక ప్రత్యేకమైన మెడిసినల్ ఎలిమెంట్ ని కలిగి ఉంటుంది.

వెల్లుల్లిలో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇది ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాంటి వెల్లుల్లిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తింటే.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఇమ్యూనిటీ పెరుగుతుంది:

వెల్లుల్లి శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో ఎంతగానో దోహదపడుతుంది. రెగ్యూలర్‌గా దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే టాక్సిన్స్ బయటకు వస్తాయి. ఇంకా ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది.

ఉదర సమస్యలు తగ్గుతాయి:

అన్ని రోగాలకు కారణం మన జీర్ణ వ్యవస్థే. అలాంటి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా ఇది చేస్తుంది. అందుకోసం ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీటితో కలిపి రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నట్లైతే… గ్యాస్, అసిడిటీ, అజీర్తి, మలబద్ధకం మొదలైన వంటి సమస్యలేవీ దరిచేరవు.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది:

అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి జీవక్రియను మెరుగుపరచడమే కాకుండా.. శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని వేగంగా కరిగిస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి వెల్లుల్లి చాలా ఉపయోగకరం.

షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది:

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే మెడిసినల్ ఎలిమెంట్ బ్లడ్ లో ఉండే షుగర్ లెవెల్స్ ని నియంత్రిస్తుంది. అందుకే మధుమేహ బాధితులు రోజూ ఉదయాన్నే ఈ వెల్లుల్లిని తీసుకుంటే చాలా మంచిది.

సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది:

క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను నీటితో కలిపి తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు. వెల్లుల్లిని రోజూ తీసుకొంటే సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు వంటివి రావు.

టీబీ, ఆస్తమాలను తగ్గిస్తుంది :

రోజూ క్రమం తప్పకుండా వెల్లుల్లి తింటే… టీబీ, ఆస్తమా వంటి రెస్పిరేటరీ ప్రాబ్లెమ్స్ దరిచేరవు. అందుకే శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్ళు రెగ్యులర్ గా వెల్లుల్లి తీసుకొంటే బెటర్.

క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది:

వెల్లుల్లిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీబయాటిక్, యాంటీ కార్సినోజెనిక్ గుణాల వల్ల… క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా నివారిస్తుంది.

బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేస్తుంది:

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే సల్ఫర్ ధమనులలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది.

ఇవిమాత్రమే కాక మరెన్నో జబ్బులని వెల్లుల్లి నివారిస్తుంది. అందుకే దీనిని ఆయుర్వేదంలో విరివిగా వాడుతుంటారు.

Leave a Comment