హఠాత్తుగా గుండెపోటు వస్తే ఇలా చేసి ప్రాణాలు కాపాడుకోండి..!

ఇటీవలికాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు 40 ఏళ్ళు దాటితేనే వచ్చే గుండెపోటు ఇప్పుడు 20 ఏళ్లకే సంభవిస్తుంది. మానసిక ఒత్తిడి, తినే ఆహారం, మారిన జీవనశైలి తదితర కారణాలే గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతున్నాయి.

మన శరీరంలోని అతి ముఖ్యమైన ఆర్గాన్స్ లో గుండె ఒకటి. రక్తాన్ని శరీరం అంతటా సరఫరా చేయడం దీని పని. ఇది యధావిధిగా పనిచేస్తూ… మిగిలిన అవయవాలను సజీవంగా ఉంచుతుంది. అయితే, గత కొన్నేళ్లుగా గుండె జబ్బులు, గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సాధారణంగా వయసు పైబడిన వారిలో మాత్రమే వచ్చే ఈ గుండె జబ్బులు ప్రస్తుతం యువతలో కూడా కనిపిస్తున్నాయి. దీనివల్ల చాలా చిన్న వయసులోనే మరణాలు సంభవిస్తున్నాయి.

కారణాలు:

  • తినే ఆహారంలో ఫ్యాట్ ఎక్కువైపోతే… గుండె ధమనులలో అది పేరుకుపోయి… రక్తం గడ్డకట్టడం వల్ల ఆ ప్రభావం గుండెపై తీవ్రంగా పడుతుంది. ఈ కారణంగా గుండెపోటు వస్తుంది.
  • డయాబెటిక్ పేషెంట్లలో ఎక్కువగా గుండెపోటు వస్తుంది.
  • హైపర్ టెన్షన్ వ్యాధి కారణంగా కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.
  • అధిక బరువు, ఊబకాయం గుండె సమస్యలకి దారితీస్తాయి.
  • మద్యపానం, ధూమపానం వంటి మత్తుపదార్థాల వినియోగం గుండె జబ్బులకు కారణమవుతాయి.
  • మానసిక ఒత్తిడి కూడా గుండెకు చేటు తెస్తుంది.
  • తినే ఆహారంలో మార్పులు కూడా గుండె జబ్బులకి కారణం.

లక్షణాలు:

  • గుండెపోటు సమయంలో వచ్చే నొప్పి గ్యాస్ లేదా ఇతర ఛాతీ నొప్పులకి భిన్నంగా ఉంటుంది.
  • నొప్పి రాగానే ఛాతీపై ఒత్తిడి పెరుగుతుంది.
  • గుండె గట్టిగా రాయిలా మారిపోతుంది.
  • ఎవరైనా గుండెను పిండేస్తున్నట్లు అనిపిస్తుంది.
  • శరీరంలో ఎడమభాగం మొత్తం అసౌకర్యానికి గురవుతుంది.
  • ఆ నొప్పి భుజాలు, చేతులు, వీపు, మెడ మొదలగు శరీరం భాగాలన్నిటికీ వ్యాపిస్తుంది.
  • చెమటలు పడతాయి.
  • అలసటగా, అశాంతిగా అనిపిస్తుంది.
  • వాంతులు కలుగుతాయి.
  • మైకం కమ్మినట్లు అనిపిస్తుంది.
  • ఒక్కోసారి మూర్ఛ కూడా పోవచ్చు.

ఫస్ట్ ఎయిడ్:

  • హఠాత్తుగా ఈ గుండెపోటు లక్షణాలు కనిపిస్తే… వెంటనే అందుబాటులో ఉన్నవారికి తెలియచేయాలి.
  • వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయాలి.
  • ఆస్పిరిన్ (డిస్ప్రిన్) టాబ్లెట్‌ను వేసుకోవాలి.
  • ఆ సమయంలో ప్రాణాలను కాపాడుకోవడానికి CPR సహాయం తీసుకోవచ్చు. CPR అంటే – చేతితో ఛాతీపై పదేపదే రుద్దటం.

డిస్క్లైమర్:

నిజానికి గుండె జబ్బులపై ప్రజల్లో సరైన అవగాహన లేదు. సగానికి పైగా ప్రజలు సకాలంలో ఆసుపత్రికి చేరుకోవడం లేదు. ఎక్కువశాతం మంది గుండె పోటు రాగానే అది గ్యాస్ వల్ల కలిగే ఛాతీనొప్పేమో అనుకోని లైట్ తీసుకుంటున్నారు. దీనివల్ల మరిస్థితి మరింత దిగజారుతుంది. తీరా ఆసుపత్రికి వెళ్ళే సమయానికి పరిస్థితి చేయి దాటిపోతుంది. చివరికి మరణం సంభవిస్తుంది.

అలాకాకుండా ముందుగానే ప్రతి ఒక్కరూ దాని లక్షణాలను గుర్తించగలగాలి. గుండె పోటు వల్ల కలిగే ఛాతీ నొప్పికి, గ్యాస్ వల్ల కలిగే ఛాతీ నొప్పికి మద్య తేడా గుర్తించాలి. ఛాతీలో ఏమైనా నొప్పి అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

Leave a Comment