ఈ 5 నెంబర్లు మీరు ఆరోగ్యంగా ఉన్నారో… లేరో… చెప్పేస్తాయ్!

మన శరీరం లోపల ఏం జరుగుతుందో మనకి తెలియకపోయినా పరవాలేదు కానీ, మన ఆరోగ్యానికి సంబంధించిన ఈ 5 నెంబర్ల గురించి మాత్రం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎందుకంటే, ఈ 5 నెంబర్లు మనం పూర్తి ఆరోగ్యంగా ఉన్నామో… లేదో… చెప్పేస్తాయి. అందుకే మనం ఫిట్ గా ఉండాలంటే… ఈ నెంబర్లపై అవగాహన ఉండాలి.

ఇక విషయానికొస్తే… ఒకప్పుడు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులని టెస్ట్ చేయించుకోవాలంటే, ఖచ్చితంగా హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు, వాటికి సంబంధించిన మెడికల్ కిట్ అందబాటులోకి వచ్చేసింది. ఈ మానిటర్స్ ఉపయోగించి ఇంట్లో ఉండే ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. వాటి ద్వారా మనం హెల్తీగా ఉన్నామా? లేదా? ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామా? అనేది ఇట్టే పసిగట్టవచ్చు. మరి ఆ సంఖ్యలేంటో ఇప్పుడే తెలుసుకుందాం.

90/60 – 120/80 (బ్లడ్ ప్రెజర్):

బ్లడ్ ప్రెషర్ అనేది ఈ రోజుల్లో అందరికీ కామన్ అయిపొయింది. సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ నేపధ్యంలో అసలు బీపీ లేవల్స్ ఎంత ఉంటే నార్మల్ గా ఉన్నట్లు అనేది చాలామందికి తెలియదు. కానీ, తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే హైపర్ టెన్షన్ కి దారితీస్తుంది. దాన్ని గుర్తించి వెంటనే చికిత్స చేయకపోతే… స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇలా అంతా జరగకుండా ఉండాలంటే… రక్తపోటు మినిమం 90/60 నుంచి మ్యాగ్జిమం 120/80 మధ్య ఉండాలి.

పరిష్కారం:

ముందు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటే మానుకోవాలి. ఆహారపదార్ధాలలో ఉప్పు తగ్గించాలి. బరువు అదుపులో ఉండేలా చూసుకోవాలి.

79 – 140 (బ్లడ్ షుగర్):

బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పితే అది బ్లడ్ షుగర్ కి దారితీస్తుంది. ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది వయసుతో సంబంధం లేకుండా వస్తున్న జబ్బు. అప్పుడే పుట్టిన పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అలసట, చిరు చెమటలు పట్టడం, దృష్టిలోపం, అరికాళ్ళ మంటలు వంటి లక్షణాలు కనిపిస్తే… అది లో బ్లడ్ షుగర్. అలాకాక, కళ్ళు, నరాలు వంటివి దెబ్బతింటే… అది హై బ్లడ్ షుగర్ గా పరిగణించాలి. అందుకే ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. నిజానికి చక్కెర స్థాయిలు 79 – 140 మద్య ఉంటే నార్మల్‌గా ఉన్నట్లు.

పరిష్కారం:

రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచాలంటే నీరు ఎక్కువగా తాగాలి. వీలైనంతవరకూ తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇంకా సరైన డైట్ పాటిస్తూ… తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

200 mg (కొలెస్ట్రాల్):

ఆయిల్, లేదా జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం, సరైన వ్యాయామం లేకపోవటం కారణంగా శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకి దారితీస్తుంది. చాలామందికి తినే తిండిపై సరైన అవగాహన లేకపోవటం వల్ల దీని బారిన పడుతున్నారు. ధూమపానం, మద్యపానం కూడా అధిక బరువుకి కారణమవుతుంది. కొలెస్ట్రాల్ అన్నివిధాలుగా చెడు చేస్తుంది. ఇది ధమనుల్లో పేరుకుపోతే గుండె పోటు, లేదా గుండె సంబంధిత జబ్బులకు కారణమవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు మన శరీరంలో కోలెస్ట్రాల్ స్థాయిలు 5 లేదా అంతకంటే తక్కువగా ఉండేలా జాగ్రత్త వహించాలి.

పరిష్కారం:

పోషకాహారం తీసుకుంటూ, కొవ్వు తక్కువగా ఉన్న పదార్ధాలని డైట్లో భాగం చేసుకోవాలి. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి తగ్గించాలి. వ్యాయామానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి.

19 – 30 (బీఎంఐ):

ఆరోగ్యకమరమైన బరువుతో ఉన్నారో! లేదో! తెలుసుకునేందుకు బెస్ట్ ఆప్షన్ బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ). వైద్య పరంగా మీరు ఎంత బరువు కలిగి ఉండాలో ఇది సూచిస్తుంది. తక్కువ, లేదా ఎక్కువ బరువు ఉంటే వెంటనే చెప్పేస్తుంది. అయితే ఇది వయసుని బట్టి వ్యక్తి హైట్ ని బట్టి నిర్ణయించబడుతుంది. నిజానికి వెయిట్ లాస్, లేదా వెయిట్ గెయిన్ అయినవాళ్ళలో గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్‌తో సహా అనేక ఇతర అనారోగ్య సమస్యలు పొంచి ఉంటాయి.

పరిష్కారం:

ఆహార నియమాలు పాటించటం, ఆహారంలో మార్పులు చేసుకోవడం దీనికి చక్కటి సొల్యూషన్.

2000 – 2500 (కేలరీస్):

సాధారణంగా రోజూ మనం తీసుకొనే ఆహారంలో కొన్ని కేలరీస్ మన శరీరంలో స్టోర్ అయి ఉంటాయి. ఇది వయసు, జీవక్రియ, శారీరక శ్రమని బట్టి మారుతుంది. ఆ కేలరీలు మహిళలకి అయితే 2000 అవసరం అవుతాయి. పురుషులకి అయితే 2500 అవసరం అవుతాయి.

పరిష్కారం:

ఎక్కువ కేలరీలు తీసుకుంటే బాడీ ఆ అదనపు శక్తిని కొవ్వుగా మారుస్తుంది. దానివల్ల ఊబకాయం వస్తుంది. ఆ కేలరీలు ఖర్చవటానికి ఎక్కువ శారీరక శ్రమ అవసరం అవుతుంది.

డిస్క్లైమర్:

అనేక రకాల స్టడీస్, మరియు రీసర్చిలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన ఇన్ఫర్మేషన్ ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఇదంతా వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు వెంటనే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించటం మర్చిపోకండి.

Leave a Comment