కొత్త కొత్త లక్షణాలతో వస్తున్న కరోనా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన విధ్వంసం అంతా… ఇంతా… కాదు. మూడేళ్ళుగా, మూడు దఫాలుగా ముప్పుతిప్పలు పెట్టిన ఈ మహమ్మారి ఇప్పుడు మళ్ళీ తన ప్రతాపం చూపించటానికి సిద్ధమైంది. రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఫోర్త్‌వేవ్‌ కొత్త కొత్త లక్షణాలతో వస్తూ… మనుషులని అతలాకుతలం చేస్తుంది. ఈ నేపధ్యంలో కరోనా సోకినట్లు నిర్దారణ చేసుకొనే ముందు అసలు కరోనాకి దారి తీసే ఆ కొత్త లక్షణాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

అతిసారం:

కరోనా వైరస్‌ ఊపిరితిత్తులతో పాటు, పొట్టపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతంది. అందులో భాగంగానే అతిసారం సమస్య తలెత్తుతుంది. జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించిన కరోనా వైరస్‌ మొదట జీర్ణక్రియపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత అతిసారం, విరేచనాలు వంటివి కలుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సొంత వైద్యం పాటించకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.

ఆకలి తగ్గిపోవడం:

కొత్తగా వస్తున్న కరోనా లక్షణాలలో ఆకలి తగ్గిపోవడం సమస్య కూడా ఒకటి. పొట్ట సమస్యల కారణంగా కరోనా రోగుల్లో ఆకలి తగ్గిపోతుంది. మరో విషయమేమిటంటే, కరోనా నుంచి కోలుకున్న తర్వాత చాలామందికి ఆకలి తగ్గిపోయినట్లు తెలిసింది. కాబట్టి రుచి, వాసన చూసే సామర్థ్యం తగ్గిపోయినట్లే… ఆకలి తగ్గిపోవటం కూడా కరోనా సిమ్ టమ్స్ లో భాగమే!

కడుపు నొప్పి:

కరోనా బాధితులు కడుపు సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కొంటున్నట్లు ఇటీవల పలు పరిశోధనల్లో వెల్లడైంది. కడుపునొప్పితో పాటు తలనొప్పి, అలసట వంటివి కూడా ఎక్కువగా కలుగుతున్నాయి. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి. చికిత్స కోసం వైద్యుడి వద్దకు కూడా వెళ్లండి.

ముగింపు:

పైన తెల్పిన అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే! అంతకుమించి https://healthyfabs.com ఎలాంటి బాధ్యతా వహించదు. అయితే ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించటం, వారి సలహాలు తీసుకోవటం మంచిది.

Leave a Comment