డయాబెటిస్‌కు చెక్ పెట్టే హెర్బల్ టీ

డయాబెటిస్ అనేది ఈరోజుల్లో చాలా కామన్ అయిపోయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ బాధించే వ్యాధి ఇది. అయితే, ఒక్కసారి డయాబెటిస్ బారిన పడ్డారంటే, ఇక డైట్ లో చాలా చేంజెస్ చేసేస్తుంటారు.

మిగతా డైట్ విషయం పక్కనపెడితే, ముందుగా టీ తాగడాన్ని మానేయాలని సూచిస్తున్నారు వైద్యులు. ఎందుకంటే, టీని పాలు, చక్కెర మిశ్రమంతో తయారు చేస్తారు కాబట్టి. పాలల్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇక చక్కర అయితే సరే సరి. మరి అలాంటప్పుడు టీ తాగటం ఎలా అరికట్టాలి? కొంతమందికైతే టీ తాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది. మరి వారి సంగతేమిటి? ఇలా ఆలోచిస్తూ పోతే దీనికొక చక్కటి సొల్యూషన్ ఉంది. అదే హెర్బల్ టీ.

డయాబెటిక్ పేషెంట్లు హెర్బల్ టీ తాగి కూడా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. దీనివల్ల మధుమేహం ఎప్పుడూ నియంత్రణలో ఉంటుంది. అయితే, డయాబెటిస్‌ బాధితులు తమ ఇంట్లోనే ఈ టీని తయారుచేసుకోవచ్చు. అదికూడా బడ్జెట్ ధరలోనే! అదెలాగో ఇపుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

మెంతులు – 1 టేబుల్ స్పూన్

వాము – 1 టేబుల్ స్పూన్

సోంపు – 1 టేబుల్ స్పూన్

జీలకర్ర 1 టేబుల్ స్పూన్

నిమ్మకాయ – సగం ముక్క

తేనె – కొద్దిగా

తయారు చేసే విధానం:

హెర్బల్ టీ తయారు చేయడానికి ముందుగా 1 గ్లాసు నీరు తీసుకోవాలి. అందులో మెంతులు, సోంపు, వాము, జీలకర్ర, వేసి రాత్రంతా నానబెట్టాలి. తెల్లారాక ఆ పదార్థాలన్నింటిని నీటిలో వేసి మరిగించాలి. అలా మరిగిన ఆ నీటిని ఫిల్టర్ చేయాలి. దానికి నిమ్మరసం, తేనె కలపాలి. గోరువెచ్చగా ఉండగానే దానిని టీలాగా తాగాలి.

ప్రయోజనాలు:

ఈ హెర్బల్ టీ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో వాడిన మెంతులు ఇన్సులిన్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. సోంపు, వాము, జీరా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. హార్మోన్లను సమతుల్యం చేయడంలో కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇంకా ఈ టీ తాగడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు. అంతేకాదు, బరువు తగ్గటంలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

ముగింపు:

ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే! వీటిని నిపుణుల సలహాల మేరకు మాత్రమే తీసుకోవాలి.

Leave a Comment