షుగర్ బాధితులు కందిపప్పు తింటే ఏమవుతుంది?

మారుతున్న జీవన శైలి మనిషిని అనేక రోగాలపాలు చేస్తుంది. దిగజారుతున్న ఆహారపు అలవాట్లు బ్లడ్ ప్రెజర్, డయాబెటీస్, కొలెస్ట్రాల్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా షుగర్ పేషంట్లు తమ డైట్ ని పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించే ఆహారం తీసుకోవాలి. అందుకోసం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. కంది పప్పు చక్కెర స్థాయిలని సమర్ధవంతంగా నియంత్రిస్తుంది. మరి అలాంటప్పుడు డయాబెటిక్ పేషంట్లు కంది పప్పు తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటిక్ పేషెంట్లకి కంది పప్పు ఎలా ఉపయోగపడుతుంది?

డయాబెటిక్ పేషంట్లు తమ ఆహారంలో తప్పనిసరిగా కందిపప్పును చేర్చుకోవాలి. ఎందుకంటే, కంది పప్పులో గ్లైసెమిక్ ఇండెక్స్ 29% ఉంటుంది. ఇది మధుమేహంతో పోరాడుతుంది. ఇంకా ఈ కందిపప్పు అనేది శరీరానికి చాలా శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్‌లకు మూలం డయాబెటిక్ పేషెంట్లు ఈ కందిపప్పు తింటే, వారికి బ్లడ్ షుగర్ పెరగదు. ఇక క్రమం తప్పకుండా కందిపప్పును తీసుకోవడం ద్వారా.. వారి చక్కర స్థాయిలను పూర్తిగా అదుపులో ఉంటాయి.

మలబద్ధకం తగ్గిస్తుంది:

పప్పు ఫైబర్ కి మూలం. ఇది అజీర్ణం వంటి జీర్ణ సమస్యలుని తగ్గిస్తుంది. దీంతో మల బద్ధకం తగ్గుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

కంది పప్పులో మెగ్నీషియం ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచటంలో ఎంతగానో సహాయపడుతుంది. డయాబెటిక్ పేషెంట్లు ఆహారంలో దీనిని చేర్చుకుంటే.. వారికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది:

కందిపప్పు రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. రక్తంలో ఉండే హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటును తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

ముగింపు:

ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎట్టి పరిస్టితులలోనూ వీటిని నేరుగా ట్రై చేయకండి. కేవలం ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు మాత్రమే వీటిని పాటించండి.

Leave a Comment