మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే బీ అలర్ట్!

మీ రొటీన్ లైఫ్ స్టైల్ లో మీకు తెలియకుండా ఏవో కొన్ని చేజెస్ కనిపిస్తుంటే… ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే అవి ప్రమాదకరమైన జబ్బులకి దారితీస్తాయి. మీకు తెలుసు అన్ని జబ్బులకి మూల కారణం కొలెస్ట్రాల్ అని. కొలెస్ట్రాల్ పెరగడం అంటే… ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవటమే! 

సాదారణంగా రక్త నాళాలలో కొవ్వు పేరుకుపోవడంతో ప్రారంభమై… రక్త సరఫరా నిలిచిపోయి గుండె ఆగిపోవటంతో అంతమవుతుంది. అంతవరకూ రాకూడదు అనుకొంటే, శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉండేలా చూసుకోవాలి. 

ఇది కూడా చదవండి: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, టూమచ్ గా ఉప్పు తింటున్నట్లే..!

కొలెస్ట్రాల్ అనేది కాలేయంలో ఉత్పత్తి అయ్యే ఓ జిగట పదార్థం. ఇది ఆరోగ్యకరమైన కణాలను తయారు చేస్తుంది. కానీ, ఎప్పుడైతే మనం ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తింటామో… అప్పుడు రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోవడం మొదలవుతుంది. ఫలితంగా చివరకు రక్తసరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్‌ వంటివి సంభవిస్తాయి. 

అయితే కొలెస్ట్రాల్ పెరుగుతున్నట్లయితే వెంటనే దానిని గుర్తించాలి, లేదంటే ప్రమాదం. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: మీలో ఈ సంకేతాలు కనిపిస్తుంటే…శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గినట్లే!

ఛాతీ నొప్పి:

llustration showing gut health and personalized nutrition with healthy foods and microbiome symbols
గట్ హెల్త్ సీక్రెట్: పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ తో హెల్త్ పవర్

కొలెస్ట్రాల్ పెరుగుతున్నట్లు తెలిపే ముఖ్యమైన లక్షణం ఛాతీ నొప్పి, దీని కారణంగా అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి కొన్ని రోజుల వరకూ ఉంటుంది. అలా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. ఒక్కోసారి ఇది గుండె జబ్బుకి దారి తీస్తుంది. అందుకే ఇది చాలా ప్రమాదకరం.

విపరీతంగా చెమటలు పట్టడం: 

వాస్తవానికి వేసవిలో కానీ, వర్కౌట్స్ చేసిన తర్వాత కానీ  చెమటలు పట్టడం సహజం. కానీ శీతాకాలంలో కానీ, సాధారణ సమయాల్లో కానీ విపరీతంగా చెమటలు పట్టడం ప్రారంభమైతే… అది అధిక కొలెస్ట్రాల్ వల్ల అని గ్రహించాలి. ఇంకా ఇది గుండె జబ్బులకి కూడా సంకేతం. 

ఇది కూడా చదవండి: అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా… అయితే అది దీనికి సంకేతం కావచ్చు!!

బరువు పెరగడం: 

మీరు వేగంగా బరువు పెరుగుతున్నారు అంటే… అది చెడు కొలెస్ట్రాల్ పెరగడం అని గ్రహించాలి. ఈ లక్షణాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. వీలైనంత వరకూ శారీరక శ్రమను పెంచండి. డైట్ కంట్రోల్ చేయండి.

చర్మం రంగు మారడం: 

llustration showing health risks of consuming too much instant noodles, including stomach bloating, weight gain, and poor nutrition**
నూడుల్స్ తినడం ఆరోగ్యానికి హానికరమా? 90% మందికి తెలియని నిజాలు!

కొలెస్ట్రాల్ పెరుగుతున్నప్పుడు శరీరం అనేక సంకేతాలను పంపుతుంది. ఇందులో చర్మం రంగు మారడం కూడా ఒకటి. ఈ క్రమంలో చర్మంపై పసుపు దద్దుర్లు కనిపిస్తాయి. అలా కనిపించినప్పుడు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవటం ఎంతో ముఖ్యం.

ఇది కూడా చదవండి: ఈ లక్షణాలు కనిపిస్తే… ఊపిరితిత్తులు డేంజర్‌లో పడినట్లే!

చివరి మాట: 

పైన చెప్పిన ఈ 4 లక్షణాలలో ఏ ఒక్క లక్షణం కనిపించినా అశ్రద్ధ చేయకండి. వెంటనే డాక్టర్ ని సంప్రదించి తగు సలహాలు, సూచనలు తీసుకోండి. ఎందుకంటే చెడు కొలెస్ట్రాల్ ఎంతకైనా దారి తీస్తుంది. 

డిస్క్లైమర్: 

ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment