మీ శరీరం నుంచి దుర్వాసన వస్తోందా? కారణాలివే!

ఎండ వేడికి చెమట పట్టడం కామనే! కానీ కొంతమందికి అప్పుడే స్నానం చేసి వచ్చినా కూడా విపరీతంగా చెమటలు పట్టేస్తాయి. అంతేకాదు, చెమట కారణంగా వారి శరీరం నుండీ విపరీతమైన దుర్వాసన కూడా వస్తుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో చాలామందికి తెలియదు.

సాదారణంగా సబ్బుతో స్నానం చేసినా, పర్‌ఫ్యూమ్ స్ప్రే చేసినా చెమట వాసన పోతుంది. అలాకాకుండా ఎంతకీ చెమట వాసన పోకున్నట్లితే కొంచెం సీరియస్ గా థింక్ చేయాల్సిందే!

నిజానికి మన చర్మంపై ఏర్పడిన బ్యాక్టీరియా కారణంగా చెమట వాసన వస్తుంది. అయితే కొంతమందికి ఈ చెమట దుర్వాసన వచ్చి ఇబ్బందికరంగా మారుతుంది. దానికి కారణాలు లేకపోలేదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా… అయితే అది దీనికి సంకేతం కావచ్చు!!

హార్మోన్లలో మార్పులు:

హార్మోన్లలో ఏర్పడిన మార్పులు, లేదా హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల మన శరీరంపై విపరీతంగా చెమటలు పడతాయి. ఉదాహరణకి గర్భధారణ సమయంలో, ప్రీమెనోపాజ్ లేదా మెనోపాజ్ సమయాల్లో హార్మోన్లు మార్పుకు గురి అవుతాయి. దీంతో స్వెట్ గ్లాండ్స్ దుర్వాసనకు కారణమవుతాయి.

కొన్ని రకాల వ్యాధులు:

కొన్ని రకాల వ్యాధుల కారణంగా విపరీతమైన చెమట పడుతుంది. దీనిద్వారా కూడా శరీరం నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి డయాబెటీస్, ఒబేసిటీ, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లెమ్, ఇన్ఫెక్షన్స్, గౌట్ వంటి కొన్ని కారణాల వల్ల కూడా చెమటలు పడుతుంటాయి.

స్పైసీ ఫుడ్స్ తీసుకోవటం:

స్పైసీ ఫుడ్ తినటం, ఉల్లి, వెల్లుల్లి, కెఫిన్, ఆల్కహాల్ వంటివి అధికంగా తీసుకోవడం వల్ల కూడా చెమట దుర్వాసన వస్తుంది.

ఇది కూడా చదవండి: నోటి దుర్వాసనకి చెక్‌ పెట్టండిలా…

ప్రొటీన్లు పెరగడం:

ప్రోటీన్ ఫుడ్ శరీరానికి అవసరమే! కానీ, అవసరానికి మించి ప్రోటీన్స్ మన శరీరంలో ఉన్నట్లయితే, అది అనేక అనర్దాలకి దారి తీస్తుంది. అంతేకాదు, శరీరంలో ప్రొటీన్లు ఎక్కువైతే, చెమట దుర్వాసన వస్తుంది.

స్ట్రెస్ పెరగటం:

స్ట్రెస్ ఎక్కవైనా కూడా శరీరానికి చెమట ఎక్కువ పడుతుంది. ఇంకా ఆ చెమట వాసన వస్తుంది. చెమట వాసన ఎక్కువగా ఉంటే మన శరీరం ఒత్తిడికి లోనవుతుందని అర్థం.

చివరి మాట:

శరీరానికి చెమటలు పట్టడం సహజమే, కానీ విపరీతంగా చెమట పట్టడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఇంకా ఆ చెమట దుర్వాసన కూడా వస్తుంది. కాబట్టి మీ శరీరం నుండీ తరచూ దుర్వాసన వస్తుంటే… ముందుగా అది ఎందుకు వస్తుందో గ్రహించాలి. అనంతరం వైద్యుడ్ని సంప్రదించాలి.

డిస్క్లైమర్:

ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment