డిన్నర్ తర్వాత చేసే వాకింగ్ మంచిదేనా?

డిన్నర్ తర్వాత చాలామంది చేసే పని నిద్రకు ఉపక్రమించడం. సాదారణంగా భోజనం చేసిన తర్వాత వచ్చిన భుక్తాయాసంతో కాసేపు అలా నడుం వాలుద్దామని అనుకొంటారు. కానీ, తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు. లేదంటే పడుకొని మొబైల్ ఫోన్లతో కుస్తీ పడుతుంటారు. నిజానికి ఇవే రెండూ తప్పే!

నైట్ డిన్నర్ తర్వాత నాలుగడుగులు అలా వేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బాడీ ఫిట్‌గా ఉండాలంటే, రోజులో ఎంతోకొంత సమయం కేటాయించాలి. మరి రోజంతా సమయం దొరకనప్పుడు కనీసం రాత్రి భోజనం తర్వాత అయినా కొద్ది టైం కేటాయించాలి.

డిన్నర్ తర్వాత వాకింగ్‌కు వెళితే… ఎన్నో శారీరక సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా నడక వల్ల బాడీ గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తుంది. ఇది మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలనుండీ ఉపశమనం లభిస్తుంది.

అలాగే, భోజనం తర్వాత 10 నిమిషాలపాటు నడవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. నడక కారణంగా గ్లూకోజ్‌ను శరీరం పూర్తిగా ఉపయోగించుకుంటుంది. తద్వారా బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. నిద్రించటానికి శరీరం ఎక్కువ కేలరీలను వినియోగించుకుంటుంది. వాకింగ్ చేయటం వల్ల ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు కూడా వాకింగ్ చేయడం వల్ల అదనపు క్యాలరీలను తగ్గించుకోగలుగుతారు.

ముగింపు:

ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే పూర్వం రోజుల్లో “After dinner rest a while, after supper walk a mile” అన్నారు పెద్దలు.

Leave a Comment