హార్ట్ బ్లాక్ ను తొలగించే దివ్యౌషదం

మన బాడీలో ఉన్న మేజర్ ఆర్గాన్స్ లో గుండె ఒకటి. ఏ మనిషైనా దీర్ఘాయువుతో జీవించాలంటే… ముందు ఆరోగ్యవంతమైన గుండె కావాలి. ఆరోగ్య వంతమైన గుండె కావాలంటే… మంచి ఆహారం కావాలి. మన ఆహార అలవాట్ల మీద ఆధారపడే గుండె ఆరోగ్యం ఉంటుంది.

సాదారణంగా బ్రెడ్, బిస్కెట్స్, కేక్స్, చిప్స్, పాస్తా, సమోసాలు, కుల్చాలు, పిజ్జా, బర్గర్‌లు ఎక్కువగా తీసుకున్నట్లయితే గుండె జబ్బులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ ఆహారాలన్నీ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.

అలాకాకుండా ఉండాలంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలని తీసుకోవాలి. ధాన్యపు రొట్టె, ఊక, వోట్స్, బంగాళదుంపలు, పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలన్నీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఎప్పుడైతే అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం మొదలు పెడతామో… అప్పుడు గుండెలో ఉండే కరోనరీ ధమనులలో ఆ కొలెస్ట్రాల్ తాలూకు ఫలకాలు అడ్డుపడి… రక్త ప్రసరణలో ఆటంకం కలిగిస్తాయి. దాని కారణంగా హార్ట్ బ్లాక్స్ ఏర్పడతాయి.

హార్ట్ బ్లాకేజ్ వల్ల గుండె ఆగిపోయే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు వ్యక్తి మరణిస్తాడు. ఇలా జరగకుండా ఉండాలంటే… రోజూ దానిమ్మ రసం తాగడం ఎంతో మంచిది.

హార్ట్ బ్లాకేజ్ యొక్క లక్షణాలు:

గుండె ఆగిపోవడం యొక్క ప్రారంభ లక్షణాలు మైకం, శ్వాస ఆడకపోవడం , మూర్ఛ, ఛాతీ నొప్పి మొదలైనవి.

దానిమ్మ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

రోజూ దానిమ్మ రసం తాగడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదాన్ని చాలా వరకూ తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

దానిమ్మపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తం పల్చ బడటానికి సహాయపడతాయి. తద్వారా గుండె ఆగిపోయే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కేవలం గుండెలో మాత్రమే కాదు, శరీరంలో మరెక్కడైనా రక్తం గడ్డకట్టి ఉన్నట్లయితే… దానిమ్మ రసం తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

దానిమ్మ రసం యొక్క ఇతర ఆరోగ్య ప్రయోజనాలు:

  • దానిమ్మ రసం తాగడం వల్ల గుండె సమస్యలు మాత్రమే కాదు, అనేక ఇతర వ్యాధుల ముప్పును కూడా తగ్గిస్తుంది.
  • దానిమ్మరసం తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
  • అనేక ఇతర గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది.
  • బరువుని నియంత్రిస్తుంది.
  • ఇమ్యూనిటీని పెంచుతుంది.
  • శరీరానికి శక్తిని అందిస్తుంది.

ముగింపు:

పైన పేర్కొన్న అంశాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించటం మంచిది.

Leave a Comment