షుగర్ పేషెంట్లు జీలకర్ర నీళ్ళు తాగితే ఏమవుతుంది?

జీలకర్రని అనేక విధాలుగా ఉపయోగిస్తుంటారు. ఇది కేవలం వంటకాల్లో వాడే సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఆకలిని పుట్టిస్తుంది. అజీర్తిని తగ్గిస్తుంది. వ్యాధులని హీలింగ్ చేస్తుంది. అందుకే దీనిని డైరెక్ట్ గా కూరలలో వాడొచ్చు, పౌడర్ లా ఉపయోగించవచ్చు, కాచి, చల్లార్చి కషాయంలా తాగవచ్చు. ఎలా వినియోగించినప్పటికీ ఇది ఆరోగ్యానికి మేలే చేకూరుస్తుంది.

అయితే, డయబెటిస్ అనేది ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య. దీని బారిన పడ్డవాళ్ళు నానారకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి డయాబెటిక్ పేషెంట్లకి ఈ జీలకర్ర నీళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తాయని రుజువైంది. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

  • జీలకర్రలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్స్, యాంటీ బాక్టీరియల్, మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుచేత జీలకర్రని కాచి, చల్లార్చి, వడగట్టి కషాయంలా చేసి పరగడుపున తాగినట్లైతే మధుమేహానికి అద్భుత ఔషధంగా పనిచేస్తుంది.
  • జీలకర్ర నీరు రక్తంలో ఉండే చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అందువల్ల కేవలం డయాబెటిక్ పేషెంట్స్ మాత్రమే కాకుండా, స్థూలకాయులు కూడా బరువు తగ్గడానికి దీనిని తాగవచ్చు.
  • జీలకర్రలో ఫైబర్ పుష్కలంగా ఉంటుది. అందువల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. మధుమేహులకు గుండెకు హాని కలిగించే రక్తంలోని కొవ్వులు అధికంగా ఉంటాయి. అలాంటి కొవ్వు స్థాయిలను తగ్గించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
  • జీలకర్ర నీళ్ళు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
  • టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి అధిక-గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
  • జీలకర్ర గింజలు ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రేరేపించడంలో సహాయపడతాయి. తద్వారా ఇది కాలేయ కణాలను మెరుగుపరుస్తుంది. అలానే, కండరాల కణజాలం గ్లూకోజ్‌ని గ్రహించేలా చేస్తుంది.

ముగింపు:

మా వెబ్ సైట్ కేవలం సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. డయాబెటిస్‌ను నియంత్రించడానికి జీరా వాటర్ తీసుకునే ముందు మీరు న్యూట్రిషనిస్ట్, లేదా డైటీషియన్‌ను సంప్రదించటం మాత్రం మర్చిపోకండి.

Leave a Comment