వర్కౌట్స్ తర్వాత మనం ఏమి తినాలి?

జాగింగ్, స్విమ్మింగ్, రైడింగ్, వెయిట్ లిఫ్టింగ్ ఇలా ఏవి చేసినా వర్కౌట్స్ ఫినిష్ చేసిన ఛాలెంజ్ కంప్లీట్ కాదు, వర్కౌట్స్ చేసిన తర్వాత ఏం తినాలో తెలుసుకోవటం, బాడీని రీ-ఫ్యూయలింగ్ చేయడం, రీ-హైడ్రేటింగ్ చేయడం, రీ-కవరింగ్ చేయడం ద్వారా మజిల్స్ ని రీ-బిల్డింగ్ చేయడం ద్వారా మాత్రమే ఇది ఫినిష్ అవుతుంది.

వర్కౌట్స్ చేసిన తర్వాత ఎక్కువగా తినవలసిన అవసరం లేదు, కానీ మీల్స్ ని మాత్రం స్కిప్ చేయండి.

వర్కౌట్స్ తర్వాత ఆహారం తీసుకోవడం యొక్క ప్రాముఖ్యత:

వర్కౌట్స్ సమయంలో బ్రేక్ అయిన మజిల్ టిష్యూస్ ని రీ-బిల్డ్ చేయటానికి, మరియు రిపేర్ చేయడానికి హై క్వాలిటీ ప్రోటీన్ ఫుడ్ అవసరం. అలాగే, మజిల్ రికవరీ, వర్కౌట్స్ కి అనుగుణంగా మజిల్ ప్రోటీన్ సింథసిస్ ని పెంచటానికి ఈ హై క్వాలిటీ ప్రోటీన్ ఫుడ్ అవసరం ఎంతైనా ఉంది.

వర్కౌట్స్ చేసే సమయంలో కండరాలు ఎక్కువగా సంకోచ వ్యాకోచాలకి గురవుతూ ఉంటాయి. దీనివల్ల మజిల్స్ లో ఉండే ఫైబర్ తగ్గిపోతూ వస్తుంది. అందుకే, ఈ ఫైబర్ ని రీ-బిల్ట్, మరియు రీ-జనరేట్ చేయటంలో ప్రోటీన్ సహాయపడుతుంది.

వర్కౌట్స్ నుంచీ ఏర్పడిన నష్టాన్ని ఫుల్ ఫిల్ చేయాలంటే, సెల్స్ ని ప్రొటెక్ట్ చేయటం, ఫ్లుయిడ్స్ ని రికవర్ చేయటం, అలాగే, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే భోజనం తినడం ద్వారానే సాధ్యపడుతుంది.

మరోవైపు, వర్కౌట్స్ తర్వాత స్నాక్స్ వంటివాటిని స్కిప్ చేయటం వలన శరీరం మరింత అలసిపోయినట్లు అనిపించవచ్చు అప్పుడు హీలింగ్, మరియు రిపేర్ వంటి ప్రక్రియలకు కూడా బాడీ నెమ్మదిస్తుంది. తర్వాత మళ్ళీ వర్కౌట్ చేసినప్పుడు ఈ పనితీరు కూడా దెబ్బతినవచ్చు.

వర్కౌట్స్ తర్వాత ఎప్పుడు తినాలి?

  • ఫిజికల్ యాక్టివిటీస్ నుండి బాడీ రికవర్ అవ్వటానికి, న్యూట్రిషన్స్ ఉపయోగించడానికి బెస్ట్ టైమ్ వర్కౌట్స్ తర్వాత మొదటి 30 నుండి 45 నిమిషాలలోపు.
  • వర్కవుట్ చేసిన వెంటనే ఎక్కువ తినాలని మీకు అనిపించకపోతే బాధ పడొద్దు. లైట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే చాలు.
  • కోల్పోయిన ద్రవాలని తిరిగి నింపడం మర్చిపోవద్దు. చెమట ద్వారా కోల్పోయే ప్రతి పౌండ్‌కు 20 నుండి 24 ఔన్సుల ద్రవాన్ని త్రాగవలసి ఉంటుంది. ఇది వర్కౌట్స్ చేసిన తర్వాత గంటలో తీసుకోవాలి.
  • ఎక్కువ సమయం, లేదా ఎక్కువ వేడిలో వ్యాయామం చేస్తుంటే… రీహైడ్రేషన్ కోసం స్పోర్ట్స్ డ్రింక్, లేదా కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్‌లనుతీసుకోవాల్సి ఉంటుంది.

వర్కౌట్స్ తర్వాత ఏమి తినాలి?

వర్కౌట్స్ తర్వాత ఈ క్రింది ఆహార పదార్ధాలని తీసుకోవాలి. అవి:

ఫ్రెష్ జ్యూస్, మరియు డ్రైడ్ ఫ్రూట్స్:

పండ్లు, గింజలు, మరియు పిండి పదార్థాలు, ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.

యోగర్ట్ ,మరియు బెర్రీలు:

హై-ప్రోటీన్ పెరుగు, కార్బోహైడ్రేట్, మ్మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే బెర్రీల కలయిక మజిల్స్ లో ఉండే గ్లైకోజెన్ నిల్వలను ఫుల్ ఫిల్ చేస్తుంది. మరియు మజిల్ రిపేర్ కి హెల్ప్ అవుతుంది.

స్మూతీ:

వర్కౌట్స్ వల్ల అయిన మజిల్ డ్యామేజ్ నుండి సెల్స్ ని ప్రొటెక్ట్ చేయాలంటే…ఫ్రూట్స్, మరియు వెజిటబుల్స్ తీసుకోవటం మంచిది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మజిల్ రికవరీ కోసం సహాయపడతాయి.

ఎగ్, అండ్ హోల్ గ్రైన్ టోస్ట్:

కోడిగుడ్డుని ఏ రకంగా తీసుకొన్నా అందులో గొప్ప ప్రోటీన్లు దాగి ఉంటాయి. మరోవైపు హోల్ గ్రైన్ టోస్ట్ తీసుకొంటే… అందులో కార్బో హైడ్రేట్స్ మిక్స్ అయి ఉంటాయి. ఈ రెంటినీ కలిపి తీసుకున్నప్పుడు ప్రోటీన్స్, మరియు కార్బో హైడ్రేట్స్ ఏకకాలంలో లభిస్తాయి.

చాక్లెట్ మిల్క్:

వర్కౌట్స్ చేసిన తర్వాత చాక్లెట్ మిల్క్ తీసుకుంటే… మజిల్స్ ని సమన్వయం చేస్తుంది. బాడీని రీహైడ్రేట్ చేస్తుంది. గ్లైకోజెన్ నిల్వలను భర్తీ చేస్తుంది. కండరాల నొప్పిని తగ్గిస్తుంది.

వర్కౌట్స్ అయిన కొన్ని గంటల తర్వాత పూర్తి భోజనం:

  • వర్కౌట్స్ అయిపోయిన కొన్ని గంటల తర్వాత హోల్ గ్రైన్ టోస్ట్‌తో కూడిన వెజిటబుల్స్, మరియు చీజ్ ఆమ్లెట్.
  • టమోటా, మరియు అవకాడో ముక్కలు కలిగిన శాండ్‌విచ్
  • గింజ వెన్న మరియు ముక్కలుగా చేసిన అరటిపండుతో మిక్స్ చేయాలి.
  • హోల్-వీట్ బ్రెడ్ పచ్చి లేదా కాల్చిన కూరగాయలు మరియు హమ్మస్‌తో నింపబడి ఉంటుంది.
  • కూరగాయలు మరియు టోఫుతో కలిపి, బ్రౌన్ రైస్ లేదా క్వినోవాతో కలిపి తినాలి.

ముగింపు:

మొత్తం మీద ఆహారం విషయంలో ఒక్కో వ్యక్తి ఒక్కో టేస్ట్ కలిగి ఉంటారు. వర్కౌట్స్ చేసిన తర్వాత ఎవరి టేస్ట్ కి తగ్గట్టు వారు ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి.

Leave a Comment