విటమిన్ K2 ఎక్కువగా ఉండే టాప్ ఫుడ్స్ ఇవే!

మనం విటమిన్ల గురించి మాట్లాడేటప్పుడు, సాధారణంగా విటమిన్ ఎ, బి, సి, డి, మరియు ఇ గురించి మాట్లాడుకుంటాము. కానీ, మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన ఇంకా 13 రకాల విటమిన్లు ఉన్నాయని మీకు తెలుసా?

విటమిన్ కె అనేది అలాంటి విటమిన్లలో ఒకటి. కానీ, దీని గురించి పెద్దగా మాట్లాడరు. ఇది రక్తం గడ్డకట్టడం మరియు ఎముకల మొత్తం జీవక్రియను నియంత్రించే ప్రోథ్రాంబిన్ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది.

విటమిన్ కె అనేది కె1 మరియు కె2 విటమిన్ల కలయిక. అయితే, మనం ముదురు ఆకుకూరల నుండి కె1ని సులభంగా తీసుకోవచ్చు, కానీ కొన్నిసార్లు కె2 విటమిన్ ఆహారాల గురించి మనకు తెలియకపోవడంతో కె2ని తీసుకోవడం కష్టం అవుతుంది. అందుకే ఈ ఆర్టికల్ ద్వారా అలాంటి టాప్ ఫుడ్స్ ని మీముందు ఉంచబోతున్నాం. సో, లెట్స్ బిగిన్.

విటమిన్ K2 యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ K2 శరీర ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన పోషక పదార్థం. చాలా మందికి విటమిన్ K2 గురించి సరైన అవగాహన లేకపోవడంతో, దీని ఉపయోగాలను మరియు విటమిన్ K2 సమృద్ధిగా ఉండే ఆహారాలను తెలుసుకోవడం కష్టంగా మారింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది

విటమిన్ K2 ముఖ్యంగా కాల్షియంను ఎముకలకు సరైన విధంగా చేరేలా చేస్తుంది. ఇది ఓస్టియోపోరోసిస్ (ఎముకలు బలహీనపడటం) సమస్యను తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

గుండె సంబంధిత సమస్యల నుండి రక్షణ కల్పించడానికి విటమిన్ K2 సహాయపడుతుంది. ఇది కాల్షియం ధమనులలో చేరకుండా నియంత్రిస్తుంది. తద్వారా గుండెకు సంభందించిన వ్యాధులను తగ్గించగలదు.

మెదడు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది

మతిమరుపు వంటి నరాల సమస్యలను తగ్గించడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి విటమిన్ K2 కీలక పాత్ర పోషిస్తుంది.

రక్తం గడ్డకట్టే ప్రక్రియలో సహాయపడుతుంది

ఇది శరీరంలోని గాయాలు త్వరగా మానటానికి మరియు రక్త స్రావాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది.

విటమిన్ K2 సమృద్ధిగా ఉండే ఆహారాలు

ఇదంతా విన్న తర్వాత విటమిన్ K2 ఏయే ఆహార పదార్ధాలలో దొరుకుతుందో తెలుసుకోవాలని అనిపిస్తుంది కదూ! ఈ క్రింద పేర్కొన్న లిస్ట్ చదవండి.

నాట్టో

నాట్టో అనేది జపాన్‌లో ప్రసిద్ధి చెందిన ఒక ఫెర్మెంటెడ్ సోయాబీన్ ఫుడ్. ఇది విటమిన్ K2 అధికంగా కలిగి ఉంటుంది. మరియు ప్రపంచంలోనే అత్యధికంగా ఈ విటమిన్‌ను కలిగి ఉన్న ఆహారంగా నాట్టో పరిగణించబడుతుంది.

గొర్రె పాలు మరియు పాల ఉత్పత్తులు

గొర్రె పాలు, గొర్రె పెరుగు, మరియు ఇతర పాల ఉత్పత్తులలో విటమిన్ K2 సమృద్ధిగా ఉంటుంది.

ఫెర్మెంటెడ్ ఫుడ్

పూర్వకాలం వాళ్ళు ఉపయోగించే పులియబెట్టిన ఆహారాలు కొంతవరకు విటమిన్ K2ని కలిగి ఉంటాయి. అవి:

చీజ్

కొన్ని రకాల చీజ్‌లలో విటమిన్ K2 అధికంగా ఉంటుంది. ముఖ్యంగా గౌడా, బ్రీ, మరియు ఎమెంటల్ చీజ్‌లలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది.

చికెన్

K2 కంటెంట్ అధికంగా ఉండే ఆహారం చికెన్. మీరు 100 గ్రాముల చికెన్ తో దాదాపు 10 మైక్రోగ్రాముల K2 పొందవచ్చు. ఇది పంది మాంసం మరియు గొడ్డు మాంసంలో లభించే K2 కంటెంట్ కంటే చాలా ఎక్కువ. కాబట్టి, చికెన్ మాంసాహారులకు K2 కంటెంట్ అధికంగా ఉండే ఆదర్శవంతమైన ఆహారంగా మారుతుంది.

పాల ఉత్పత్తులు

గడ్డి తిని పెరిగిన గేదెలు, ఆవులు ఇచ్చే పాలు మరియు పాల ఉత్పత్తులు విటమిన్ K2 అధికంగా కలిగి ఉంటాయి.

గుడ్లు

కోడిగుడ్లలో ఉండే పచ్చ సోనలో కూడా విటమిన్ K2 సమృద్ధిగా ఉంటుంది.

సీ ఫుడ్స్

సాల్మన్, మాక్రెల్, మరియు ఇతర కొవ్వు ఎక్కువగా ఉండే చేపల్లో విటమిన్ K2 మంచి మోతాదులో ఉంటుంది.

ఇది కూడా చదవండి: విటమిన్‌ డి ఓవర్‌డోస్ అయితే ఏం జరుగుతుందో తెలుసా!

విటమిన్ K2 లోపం వల్ల కలిగే సమస్యలు

విటమిన్ K2 లోపిస్తే, అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. అవి:

ఎముకల సమస్యలు

విటమిన్ K2 లోపం కారణంగా ఎముకలు బలహీనపడటం, విరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

గుండె సమస్యలు

అథెరోస్క్లెరోసిస్ (ధమనులు గట్టి కావడం), రక్తపోటు పెరగడం వంటి సమస్యలు రావచ్చు.

మెదడు సమస్యలు

మతిమరుపు, మానసిక ఒత్తిడి సమస్యలు పెరిగే అవకాశముంది.

ఋతు సమస్యలు

హెవీ మెనుస్ట్రువల్ బ్లీడింగ్ జరిగి మెనోరేజియాకి దారితీయచ్చు.

ఇంటర్నల్ బ్లీడింగ్

గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టకుండా లోలోపల అధిక రక్తస్రావం జరగవచ్చు.

డయాబెటిస్

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోయి డయాబెటిస్ కి దారితీస్తుంది.

సిస్టిక్ ఫైబ్రోసిస్

ఇది లంగ్స్ మరియు ప్యాంక్రియాస్‌తో సహా అనేక అవయవాలలో జిగటగా, మందపాటి మ్యూకస్ ఏర్పడటానికి కారణమవుతుంది.

క్రానిక్ కిడ్నీ డిసీజ్

దీర్ఘకాలికంగా మూత్రపిండాలు సరిగా పనిచేయకుండా పోయే ప్రక్రియ.

డైజెస్టివ్ ప్రాబ్లెమ్స్

జీర్ణవ్యవస్థను ప్రభావితం చేసే రుగ్మతలను జీర్ణ రుగ్మతలు అంటారు. ఇవి తేలికపాటి నుండి తీవ్రస్థాయి వరకు ఉంటాయి.

విటమిన్ K2 ఎంత మోతాదులో తీసుకోవాలి?

  • ప్రస్తుత అధ్యయనాల ప్రకారం, రోజుకు సుమారు 90-120 మైక్రోగ్రాముల విటమిన్ K2 అవసరం ఉంటుంది.
  • దీనిని సహజమైన ఆహార పదార్థాల ద్వారా లేదా అవసరమైతే సప్లిమెంట్ల ద్వారా పొందవచ్చు.

ముగింపు

విటమిన్ K2 మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. దీని లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, నిత్యం విటమిన్ K2 సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా పుట్టినరోజులు, వేడుకలు, పండుగలు లాంటి సందర్భాల్లో ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.

డిస్క్లైమర్

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment