కాపర్ వాటర్ కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి అందరికీ తెలిసిందే! హిందూ సాంప్రదాయంలో దీనికున్న ప్రత్యేకతే వేరు. మన పూర్వీకులు ఎక్కువగా రాగి పాత్రలు, రాగి మర చెంబులు, రాగి గ్లాసులు వంటివే వాడేవారు. తర్వాత మారుతున్న జనరేషన్ బట్టి ఆచారాలు మారినప్పటికీ, కొంతమంది మాత్రం నేటికీ ఈ కాపర్ వాటర్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.
ఇక ఆయుర్వేద వైద్య విధానంలో ఇదీ ఒక భాగం. నిజానికి రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి. నీటివల్ల వచ్చే జబ్బులు రావు. శరీరంలో కాపర్ లోపించదు. అలాగని టూమచ్ గా కాపర్ వాటర్ తాగినట్లయితే, కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- నీటిని రాగి పాత్రలో 12 నుండి 48 గంటల పాటు నిల్వ ఉంచి, మరుసటి ఉదయం ఖాళీ కడుపుతో మాత్రమే తాగాలి. అలా కాకుండా, రోజంతా రాగి పాత్రలో నీరు తాగాలనుకుంటే… దాని వల్ల ఎటువంటి హాని ఉండదు. కాకపోతే, ఈ నీటిని తాజాగా నింపాలి.
- కలుషితమైన నీటిలో డయేరియాకి కారణమయ్యే బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే, రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగినట్లయితే, ఆ బ్యాక్టీరియాను చంపే యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది.
- బ్యాక్టీరియాను చంపడానికి, నీటిని కనీసం రాత్రిపూటంతా కానీ 12 గంటలు, లేదా 48 గంటల వరకు రాగి పాత్రలో నిల్వ ఉంచాలి.
- కాపర్ వాటర్ ని లిమిట్ గానే తాగాలి. 2 లీటర్ల కంటే ఎక్కువ తాగితే… కడుపు నొప్పి, గ్యాస్, లేదా అసిడిటీ వంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి.
- శరీరంలో అధిక మొత్తంలో రాగి నిల్వలు ఉన్నట్లయితే… వాంతులు, వికారం, కడుపు నొప్పి లేదా అతిసారం వంటి సమస్యలు తలెత్తుతాయి.
- పరిమితిని మించి తాగే కాపర్ వాటర్ వల్ల ఒక్కోసారి లివర్, కిడ్నీస్ వంటివి చెడిపోవచ్చు.
- భోజనానంతరం రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగితే, డైజెష్టివ్ సిస్టంపై దాని ప్రభావం పడుతుంది. ఫలితంగా, జీర్ణక్రియ మందగించవచ్చు లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.
- రాత్రి నిద్రించే సమయంలో మద్యలో రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగకూడదు. కేవలం పరగడుపున మాత్రమే తీసుకోవాలి.
- నీటితో నిల్వ ఉంచిన రాగి పాత్రని ఎప్పుడు నేలపై ఉంచకూడదు. చెక్క స్టూల్, లేదా ఏదైనా ఇతర వస్తువులపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల రాగిలో ఉండే స్వచ్ఛత మిగులుతుంది.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో రాగి ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలో రాగి ఎక్కువగా ఉండటం కంటే… తగినంత లేకపోవడమే సర్వసాధారణంగా మారింది. అలాంటప్పుడు ఈ కాపర్ వాటర్ తాగితే, శరీరం కాపర్ నిల్వలను తిరిగి పొందుతుంది.