ఆవలింతలు అనేవి జనరల్ గా ఎవరికైనా వస్తాయి. విచిత్రం ఏంటంటే, ఆవలించే వ్యక్తులని చూసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి కూడా ఆవలింతలు వచ్చేస్తాయి. ఇదే ఆవలింత లో ఉన్న మ్యాజిక్, కానీ దీని వెనకున్న లాజిక్ ని మాత్రం సైంటిస్టులు కూడా కనుక్కోలేకపోయారు.
ఆవిలింతలు రావడం ప్రతీ మనిషికీ కామనే! అయితే, ఇవి కేవలం మనుషులకే కాదు జంతువులకు కూడా వస్తాయి. చదువుతున్నా, పని చేస్తున్నా తరచుగా ఆవిలింతలు వస్తూనే ఉంటాయి.కానీ, బాగా అలిసి పోవడం వల్ల లేదంటే నిద్ర రావడం వల్ల ఈ ఆవిలింతలు వస్తూంటాయని పెద్దలు చెబుతూంటారు.
నిజానికి ఈ ఆవిలింతలు అనేవి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మొదలవుతాయట. 11 వారాల వయసున్న ఎంబ్రియోగా ఉన్నప్పుడే ఇవి మొదలవుతాయని, దీన్ని బట్టి చూస్తే ఈ భూమి మీదకి రాక ముందే ఆవలింత మనకి దగ్గరవుతుందని, అప్పుడు మొదలైన ఈ అలవాటు జీవితాంతం మనల్ని వదలిపెట్టదని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే, ఆవిలింతలు రావడానికి అసలు కారణాలు ఏంటి? అవి ఎందుకు వస్తాయి? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తరచుగా ఆవులించడానికి కారణం
- అసలు ఈ ఆవిలింతలు రావడానికి ముఖ్య కారణం ఆక్సిజన్ అందకపోవడమే! బ్రెయిన్ కి సరిపడా ఆక్సిజన్ అందకపోవటం వల్ల శరీరం ఆవిలింతల రూపంలో ఎక్కువ మొత్తంలో గాలిని తీసుకుంటుంది. దీంతో బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది.
- శరీరం పూర్తిగా అలసిపోయి నిద్ర ముంచుకొస్తునప్పుడు ఆవలింతలు వాటంతట అవే వస్తాయి.
- నిద్రలో ఉన్న శరీరాన్ని రీప్రెష్ చేసేందుకు కూడా ఆవలింత వస్తుందట. ఆవలింతతో శరీరానికి ఉండే లేజీ నెస్ మొత్తం వెళ్లిపోతుంది.
- కొద్దిసేపు బుక్స్ చదివేతే చాలు, వెంటనే ఆవలింతలు వచ్చేస్తాయి.
- మనకు ఆవలింతలు ఎక్కువగా వస్తున్నాయంటే దానర్ధం, మెదడు తనని తాను యాక్టివ్ గా ఉంచుకోవడానికి ట్రైచేస్తుందని.
- ఒక్కోసారి మనకి బోర్ కొట్టినప్పుడు కూడా ఆవలింతలు ఆగకుండా వస్తుంటాయి.
- ఏదైనా ఒకపనిని కంటిన్యూగా చేస్తున్నప్పుడు, బ్రెయిన్ హీటెక్కి, బయటినుంచీ చల్లటి గాలిని పీలుచుకోవటం కోసం ఆవలింతలు వస్తాయి. ఇలా జరగటం వల్ల కొద్దిసేపటి తర్వాత, బ్రెయిన్ చల్లబడి రిలాక్స్ అవుతాం. ఆ తర్వాత మళ్ళీ ఆ పనిని కంటిన్యూ చేయవచ్చు.
ఇక మనకొచ్చే ఒక్కో ఆవలింత యావరేజ్ గా 6 సెకన్స్ వరకూ ఉంటుంది. ఇక మనిషి తన జీవిత కాలం మొత్తంలో 400 గంటలు ఆవలిస్తాడట. అంటే 2.4 లక్షల సార్లు ఆవిలిస్తారు. ఈ ప్రకారం చూస్తే, మనిషి తన జీవితకాలం మొత్తంలో 16 నుండి 17 రోజులు వరకూ ఈ ఆవలింతలకే పోతాయన్నమాట. ఈ కౌంట్ డౌన్ అనేది మనం పుట్టక ముందు నుండే స్టార్ట్ అవుతుందంట.
ముగింపు
ఇక ఈ టాపిక్ చదవడం స్టార్ట్ అయినప్పటినుంచీ, ఎండ్ అయ్యేలోపు మీరు కూడా చాలాసార్లు ఆవలించి ఉంటారని నాకు అర్ధమవుతూనే ఉంది. అయితే, ఎన్నిసార్లు ఆవలించారో మాకు కామెంట్ లో తెలియచేయండి. లేదని మాత్రం చెప్పకండి. ఎందుకంటే అది ఖచ్చితంగా అబద్ధమే!
డిస్క్లైమర్:
ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.