పిస్తా పప్పుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!

ఏ ఆహారపదార్ధాలని తీసుకున్నామనేది కాదు, ఎలాంటి ఆహార పదార్ధాలని తీసుకున్నమనేదే ముఖ్యం. ఎందుకంటే, రోజూ మనం తీసుకునే ఆహారపదార్ధాలన్నీ ఒక ఎత్తైతే, పిస్తా పప్పుది మరో ఎత్తు.

పిస్తా పప్పు ఆరోగ్యానికి మంచిదేనా?

ప్రపంచంలోనే అతి పురాతనమైన గింజలలో పిస్తాపప్పులు ఒకటి. వీటిలో పోషకాలు చాలా ఎక్కువ. ఇందులో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఇ, బి కాంప్లెక్స్, కెరోటిన్‌ , ఫైటోకెమికల్స్ తో పాటు, కాపర్, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కొవ్వు శాతం తక్కువ.

పిస్తా పప్పులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు

తరచుగా పిస్తా పప్పులను తీసుకోవడం వల్ల గుండె, మరియు మెదడు ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. తినుబండారాల్లో ఎక్కువగా ఈ గింజలని వినియోగిస్తుంటారు. దీనివల్ల వాటికి అదనపు రుచిని ఇస్తాయి. మరి అలాంటి పిస్తా పప్పుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ తగ్గుతుంది

సాధారణంగా నట్స్‌ని అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. కానీ, పిస్తా పప్పులో ఆ సమస్య లేదు. ఎక్కువగా తిన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కాబట్టే వీటిని తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కంటిచూపు మెరుగుపడుతుంది

పిస్తాపప్పులు గింజలలో అత్యధిక స్థాయిలో జియాక్సంతిన్ మరియు లుటీన్‌లను కలిగి ఉంటాయి, ఈ రెండూ బ్లూ లైట్ మరియు మాక్యులార్ డీజెనరేషన్ వల్ల కలిగే నష్టం నుండి మీ కళ్ళను రక్షిస్తాయి.

ఙ్ఞాపకశక్తి పెరుగుతుంది

ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు కూడా మతిమరుపు సమస్యతో సతమతమవుతున్నారు. ఈ సమస్యకు చెక్ చెప్పి ఙ్ఞాపకశక్తిని పెంపొందించాలంటే… ప్రతి రోజూ పిస్తాపప్పుని తప్పనిసరిగా తినాలంటున్నారు.

మెదడు పనితీరు మెరుగుపడుతుంది

పిస్తా పప్పు తింటే… మెదడులో కణాలు దెబ్బ తినకుండా ఉంటాయి. అన్ని శరీర భాగాలకూ రక్తం సరఫరా అవుతుంది. దీంతో మెదడు పనితీరు మెరుగు పడుతుంది. పిస్తాలో ఉండే ల్యూటిన్ మేధాశక్తిని పెంచుతుంది. దీనివల్ల మెదడు చురుగ్గా మారుతుంది.

చక్కెర స్థాయిలు పెరగవు

పిస్తాపప్పులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగివుంటాయి, అంటే వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెద్దగా పెరగవు. అవి యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్ మరియు ఫినాలిక్ సమ్మేళనాలను కూడా కలిగి ఉంటాయి, ఇవన్నీ ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలకు మద్దతు ఇస్తాయి.

యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది

పిస్తాలో ఉండే విటమిన్ ఇ… చర్మం మీది మృతకణాలను తొలగించి దానిని మృదువుగా ఉంచుతుంది. దీనివల్ల త్వరగా వృధ్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటుంది.

వెంట్రుకల పెరుగుదలకి తోడ్పడుతుంది

పిస్తా ఆయిల్స్ సహజ మాయిశ్చరైజర్‌గా పని చేస్తాయి. పిస్తాలో ఉండే కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన పొడవాటి జుట్టును అందించేందుకు తోడ్పడతాయి.

రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడుతుంది

పిస్తా పప్పుని తినడం వలన నరాల్లో రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. దీంతో, రక్తపోటు సమస్యలు రావు.

జీర్ణ సమస్యలని తగ్గిస్తుంది

పిస్తాపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రీబయోటిక్‌గా పని చేస్తుంది లేదా మీ గట్‌లోని మంచి బ్యాక్టీరియా ద్వారా జీర్ణమయ్యే ఆహారం వాటి పెరుగుదలకు సహాయపడుతుంది. దీనివల్ల డైజేషన్ సమస్యలు తగ్గుతాయి.

క్యాన్సర్ ని నిరోధిస్తుంది

గట్ బాక్టీరియా ఫైబర్‌ను పులియబెట్టి, దానిని షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్స్‌గా మార్చగలదు, ఇది క్యాన్సర్, గుండె జబ్బులు మరియు జీర్ణ రుగ్మతల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

ముగింపు

తెలిసింది కదా! మిగిలిన డ్రై ఫ్రూట్స్‌ అన్నింటితో పోలిస్తే… ఇందులో కేలరీలు తక్కువ. ప్రయోజనాలు ఎక్కువ. అందుకే ఈ పిస్తా పప్పుని మీ మెనూలో చేర్చేసుకోండి.

డిస్క్లైమర్

ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment