హార్ట్ బ్లాక్ ను తొలగించే దివ్యౌషదం

Pomegranate Juice Can Clear Plaques That Clog Arteries

మన బాడీలో ఉన్న మేజర్ ఆర్గాన్స్ లో గుండె ఒకటి. ఏ మనిషైనా దీర్ఘాయువుతో జీవించాలంటే… ముందు ఆరోగ్యవంతమైన గుండె కావాలి. ఆరోగ్య వంతమైన గుండె కావాలంటే… మంచి ఆహారం కావాలి. మన ఆహార అలవాట్ల మీద ఆధారపడే గుండె ఆరోగ్యం ఉంటుంది. సాదారణంగా బ్రెడ్, బిస్కెట్స్, కేక్స్, చిప్స్, పాస్తా, సమోసాలు, కుల్చాలు, పిజ్జా, బర్గర్‌లు ఎక్కువగా తీసుకున్నట్లయితే గుండె జబ్బులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ ఆహారాలన్నీ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు … Read more

డిన్నర్ తర్వాత చేసే వాకింగ్ మంచిదేనా?

Benefits Of Take Walk After Dinner

డిన్నర్ తర్వాత చాలామంది చేసే పని నిద్రకు ఉపక్రమించడం. సాదారణంగా భోజనం చేసిన తర్వాత వచ్చిన భుక్తాయాసంతో కాసేపు అలా నడుం వాలుద్దామని అనుకొంటారు. కానీ, తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు. లేదంటే పడుకొని మొబైల్ ఫోన్లతో కుస్తీ పడుతుంటారు. నిజానికి ఇవే రెండూ తప్పే! నైట్ డిన్నర్ తర్వాత నాలుగడుగులు అలా వేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బాడీ ఫిట్‌గా ఉండాలంటే, రోజులో ఎంతోకొంత సమయం కేటాయించాలి. మరి రోజంతా సమయం దొరకనప్పుడు కనీసం రాత్రి భోజనం … Read more

మనిషికి ఎంత నిద్ర అవసరం?

How Much Sleep Do We Need

ఆరోగ్యకరమైన జీవన విధానానికి మంచి నిద్ర చాలా అవసరం. ప్రతి ఒక్కరూ రోజుకి కనీసం 8 గంటలు నిద్రపోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. కానీ, ఈ ఉరుకులు, పరుగుల జీవితంలో నిద్ర వేళల్లో మార్పులు వచ్చాయి. ఈ కారణంగానే జీవనశైలిలో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. తగినంత నిద్ర పోయినప్పుడే బాడీ రిలాక్స్ అవుతుంది. అలాకాక, నిద్రలో ఎక్కువ, తక్కువలు జరిగితే, ఆ ప్రభావం కేవలం మైండ్ మీద మాత్రమే కాదు, టోటల్ బాడీ మీద పడుతుంది. … Read more

స్టైలిష్‌ లుక్ తో కనిపించాలంటే ఇలా చేయండి!

5 Fashion Tips To Look Stylish

ఈ కాలంలో ఎవరికైనా డ్రెస్ సెన్స్ అనేది చాలా ముఖ్యం. మీ డ్రెస్సింగ్ స్టైల్‌ ని బట్టే మీ క్యారెక్టర్ ని అంచనా వేయటం ప్రారంభిస్తారు. అందుకే నేటి యువత ఫ్యాషన్ డిజైన్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే, అమ్మాయిల కంటే అబ్బాయిలకే ఫ్యాషన్ నాలెడ్జ్ తక్కువని చెప్పొచ్చు. ఇలాంటి సమయంలో, కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా మీ డ్రెస్సింగ్ స్టైల్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మరి స్టైలిష్ లుక్ తో కనిపించాలంటే మీరు పాటించవలసిన … Read more

కంటి చూపును మెరుగు పరిచే అద్భుతమైన ఆహారాలు

Eye Care Diet

ఈ కంప్యూటర్ యుగంలో ప్రతీదీ డిజిటలైజ్ అయిపొయింది. దీంతో ప్రతి పనికీ మొబైల్, లేదా ల్యాప్‌టాప్‌ మీద ఆధారపడాల్సి వస్తుంది. గాడ్జెట్ల వినియోగం ఎక్కువయ్యే కొద్దీ అవి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా వాటి స్క్రీన్ లైట్ మన కళ్ళకి చాలా హాని కల్గిస్తున్నాయి. ఈ కారణంగా కళ్ళు మంట, దురద వంటి సమస్యలు మొదలై… చివరికి కంటిచూపు కూడా మందగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కంటి ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ ఆహారాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఉసిరి:

ఉసిరి కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం చేత కంటిచూపు పెరుగుతుంది. ఉసిరిని డైరెక్ట్ గా అయినా తీసుకోవచ్చు, లేదంటే… ఉసిరి పొడి, ఊరగాయ, జామ్, ఇలా ఏదో ఒక రూపంలో దీనిని తీసుకోవచ్చు. ఉసిరికాయను రోజూ తీసుకోవడం వల్ల ఒక్క కంటికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

ఆకు కూరగాయలు:

కంటి చూపు మెరుగుపడటంలో ఆకుకూరలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆకు కూరలు, పచ్చి కూరగాయలు కంటికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిన్-సి లతో పాటు, ఐరన్, లుటిన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి ఉన్నాయి. ఇవి కంటి చూపును మరింత పెంచుతాయి.

ఆవకాడో:

అవకాడోలో విటమిన్-ఇ పుష్కలంగా ఉండటం చేత ఇది కంటి రెటీనాని మరింత బలపరుస్తుంది. అవకాడో ఎక్కువగా తింటే… వృద్ధాప్యం వచ్చినా మీ కళ్ళు ఆరోగ్యంగానే ఉంటాయి.

క్యారెట్:

క్యారెట్‌లో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపును మరింత పెంచుతుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్-ఎ కళ్లకు ఎంతో మేలు చేస్తుంది.

సీఫుడ్:

సీఫుడ్ తీసుకోవటం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా ట్యూనా ఫిష్, సాల్మన్ ఫిష్, ట్రౌట్ ఫిష్ వంటి సముద్ర చేపలు కంటి రెటీనాను బలోపేతం చేస్తాయి. ఈ చేపలలో DHA అనే ​​కొవ్వు ఆమ్లం ఉంటుంది. ఇది రెటీనా బలాన్ని పెంచుతుంది. తద్వారా కంటి చూపుమెరుగుపరుస్తుంది.

సిట్రస్ ఫ్రూట్స్:

సిట్రస్ ఫ్రూట్స్ అయిన నిమ్మ, నారింజ, ద్రాక్షపండు, జామపండులో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ సి కళ్లకు మేలు చేస్తుంది.

డ్రైఫ్రూట్స్:

బాదం, వాల్ నట్స్ వంటి డ్రైఫ్రూట్స్ కంటి చూపును ఎంతో మెరుగుపరుస్తాయి. ఈ డ్రైఫ్రూట్స్ రోజూ తింటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

ఇవి మాత్రమే కాదు, స్క్రీన్‌పై కంటిన్యూగా పని చేయకుండా మధ్య మద్యలో కాస్త విశ్రాంతి తీసుకోవాలి. అలాగే, అప్పుడప్పుడూ కళ్ళను చల్లటి నీటితో కడగడం వల్ల కూడా కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.

Read more

అన్నం తినేటప్పుడు ఈ ఐదు పొరపాట్లు అస్సలు చేయకండి!

5 Most Common Eating Mistakes

చాలామంది ఆహారం తినేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మీరు చేసే ఈ పొరపాట్లే… మీ జీవనశైలిని దెబ్బతీస్తాయి. సాధారణంగా ఎవరైనా రోజుకు రెండు, లేదా మూడు సార్లు భోజనం చేస్తారు. అయితే, ఆ భోజనం చేసే సమయంలో తెలిసో, తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. నిజానికవి చాలా సింపుల్ విషయాలే అయినప్పటికీ ఫ్యూచర్ లో మన హెల్త్ పై గ్రేట్ ఇంపాక్ట్ చూపుతాయి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా ఏదైనా సరే టైమ్ టూ టైమ్ … Read more

ఈ సంకేతాలు కనిపిస్తే మీకు ఛాతీ ఇన్ఫెక్షన్ ఉన్నట్లే!

Signs And Symptoms Of Chest Infection

కరోనా మహమ్మారి పుణ్యామా అని ఇటీవలికాలంలో ఏమాత్రం ఛాతీలో నొప్పి వచ్చినా భయపడాల్సి వస్తుంది. నిజానికి అన్ని రకాల చెస్ట్ పెయిన్స్… చెస్ట్ ఇన్ఫెక్షన్ కి దారి తీయవు. అలాగని చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. కొన్ని రకాల ఛాతీ నొప్పులు సాదారణమైనవే అయితే, మరికొన్ని రకాల ఛాతీ నొప్పులు మాత్రం ప్రాణాంతకంగా మారతాయి. కొన్నిసార్లు మనం తిన్న ఆహార పదార్ధాల కారణంగా అసిడిటీ, గ్యాస్ వంటివి వస్తుంటాయి. దీనివల్ల ఛాతీలో నొప్పి వస్తుంటుంది. ఇంకొన్నిసార్లు … Read more

ఉదయాన్నే పరిగడుపున వెల్లుల్లి తింటే ఏం జరుగుతుందో తెలుసా!

What Happens If You Eat Raw Garlic On Empty Stomach

ఔషధాల గని వెల్లుల్లి. ఇందులో అనేక మెడిసినల్ ప్రాపర్టీస్ తో పాటు, న్యూట్రిషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో విటమిన్ B1, B6, C తో పాటు… కాల్షియం, కాపర్, మాంగనీస్,సెలీనియం వంటి పోషకాలు కూడా దాగి ఉన్నాయి. ముఖ్యంగా వెల్లుల్లి అలిసిన్ అని పిలువబడే ఒక ప్రత్యేకమైన మెడిసినల్ ఎలిమెంట్ ని కలిగి ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇది ఎన్నో వ్యాధుల నుంచి … Read more