స్కిన్ టైట్ డ్రెస్ ధరిస్తే జరిగే ప్రమాదం ఇదే!

ఇటీవలి కాలంలో యూత్ అందరూ స్కిన్ టైట్ డ్రెస్ వేసుకోవటం ఫ్యాషన్ అయిపోయింది. కానీ, దానివల్ల ప్రమాదం పొంచి ఉందని అస్సలు ఊహించలేక పోతున్నారు. సాదారణంగా యువత ట్రెండింగ్ ని ఫాలో అవుతూ ఉంటారు. వేసుకొనే డ్రెస్ ఏదైనా సరే… అవి మన బాడీకి నప్పుతాయా… మన హెల్త్ కి పనికొస్తాయా… అని కూడా చూడరు. అలాంటి వాళ్ల కోసం స్కిన్ టైట్ డ్రెస్ లో ఉండే నష్టాల గురించి చెప్పడమే మా ఈ చిరు ప్రయత్నం.

గతంలో సన్నగా, నాజూగ్గా కనిపించడం ‘కోర్సెట్’ అనే వస్త్రం ఉండేది. దీనిని ధరించటం వల్ల నడుము సన్నగా కనిపించేది. కానీ పొట్ట, ప్రేగులు వంటివి ఎఫెక్ట్ అయ్యేవి. ఒక్కొక్కసారి అది ఆపరేషన్ కి కూడా దారి తీసేది. ఈ జనరేషన్ వాడుతున్న సింథటిక్ ఫ్యాబ్రిక్స్, ‘స్లిమ్ ఫిట్ జీన్స్’ కూడా అదే కోవలోకి వస్తాయి.

అలాగే, టైట్ గా ఉండే బ్రాలు కూడా అస్సలు వేసుకోకూడదు. అవి ఫ్రీగా ఊపిరి తీసుకోనివ్వవు. ఛాతిపై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో గుండె ఊపిరితిత్తుల్లో సన్నని నొప్పి మొదలవుతుంది. బ్రెయిన్ కి ఆక్సిజన్ అందక తలనొప్పి కూడా వస్తుంది.

మగవారు బిగుతుగా ఉన్న జీన్స్ వేసుకోవటం వల్ల శరీరంలోని వేడి ఎక్కువ అవుతుంది. ఇంకా ఇన్ – ఫెర్టిలిటీకి కూడా కారణం అవుతాయి. ఆడవారికి వెజైనాలోని పీహెచ్ ఇన్-బ్యాలెన్స్ అవుతుంది. దీంతో ఈస్ట్ క్యాండిడ్ లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి కొన్ని సందర్భాల్లో ఇవి ఇన్ ఫెర్టిలిటీకి కూడా దారితీస్తాయి.

బిగుతుగా ఉండే బట్టల వల్ల గుండె నుంచి కాళ్ల వరకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా సరిగా జరగదు. దీనివల్ల గుండెకి సంబందించిన సమస్యలు ఎదురవుతాయి. ఒక్కోసారి గుండెకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఆగిపోవచ్చు.

చివరిమాట:

కాబట్టి ఎంతో అవసరమైతేనే స్కిన్ టైట్ అవుట్ ఫిట్స్ ని యూస్ చేయండి. లేదంటే, అలాంటి వాటిని అవాయిడ్ చేయడమే బెటర్.

డిస్క్లైమర్:

ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment